Home / పాలి 'ట్రిక్స్' / పాల‌కుల‌కి జీర్ణం కాని ప‌వ‌న్ నిజాలు.. అంత‌ర్మ‌ధ‌నంలో బాబు బ్యాచ్‌..

పాల‌కుల‌కి జీర్ణం కాని ప‌వ‌న్ నిజాలు.. అంత‌ర్మ‌ధ‌నంలో బాబు బ్యాచ్‌..

15055750_531423480401196_4505078102337100457_n అనంత సీమాంధ్ర హ‌క్కుల చైత‌న్య స‌భ త‌ర్వాత జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌ర్వ‌త్ర చ‌ర్చ‌నీయాంశంగా మారారు.. ఏపీలో ఏ ఇద్ద‌రు క‌లిసినా., అది సాధార‌ణ పౌరులు కావొచ్చు లేక ఉద్యోగులు కావొచ్చు.. రాజ‌కీయ నాయ‌కులు కావొచ్చు.. అంతా ఆయ‌న గురించే మాట్లాడుకుంటున్నారు.. ప్ర‌త్యేక ప్యాకేజీ త‌దిత‌ర అంశాల‌పై ప‌వ‌న్ బ‌ట్ట‌బ‌య‌లు చేసిన నిజాల గురించే మాట్లాడుకుంటున్నారు.. పాల‌కులు కాగితాల లెక్క‌ల‌తో ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో జ‌నానికి స్ప‌ష్టంగా తెలిసిపోయింది.. దీంతో జ‌న‌సేనానితో జ‌త‌క‌ట్ట‌వ‌ల‌సిన ఆవ‌శ్య‌క‌త‌పై ప‌బ్లిక్‌లో విప‌రీత‌మైన చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగుతున్నాయి.. పెద్ద‌నోట్ల ర‌ద్దుతో ప‌వ‌న్ స‌భ దెబ్బ నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని పాల‌కులు భావిస్తే., అది కాస్త సీన్ రివ‌ర్స్ అయ్యింది.. బ్యాంకు క్యూ లైన్ల‌లో కూడా జ‌నం జ‌న‌సేనానే హాట్ టాపిక్‌గా మార‌డంతో వారికి త‌ల‌బొప్పిక‌ట్టేస్తోంది..

1436437705-164

జ‌న‌సేనాని అనంత స‌భ‌లో చెప్పిన విష‌యాలు జీర్ణించుకోవ‌డం క‌ష్ట‌మే అయినా అన్నీ ప‌చ్చి నిజాలే.. ఇదే మాట ప‌దే ప‌దే ఈ మ‌ధ్య సాక్ష్యాత్తు ఏపీ సిఎం చంద్ర‌బాబు నోటి వెంట విన‌బ‌డుతోంది కూడా.. ఎవ‌రు ప‌వ‌న్ విష‌యం ఎత్తినా., ఆయ‌న మాట్లాడిన దాంట్లో త‌ప్పేముంది అన్న స‌మాధాన‌మే బాబుగారి నోటి వెంట వ‌స్తోంది.. ఇటవ‌ల జ‌రిగిన స‌ర్కారు అంత‌ర్గ‌త స‌మావేశంలో బాబుగారి ఆంత‌రాత్మ బ‌య‌టికి వ‌చ్చిందంట కూడా.. జ‌న‌సేనానితో పోలిస్తే., మ‌నం చాలా వెనుక‌బ‌డి పోతున్నాం అని ఆయ‌న తెగ బాధ ప‌డిపోతున్నారంట‌.. ఇప్ప‌టికే చాలా విష‌యాల్లో ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌జల్లో వ్య‌తిరేక‌త పెరిగిపోయింది.. పైకి మేక‌పోతు ఢాంబికాలు పేలుతున్నా., రుణ‌మాఫీ ద‌గ్గ‌ర్నుంచి చాలా విష‌యాల్లో ప్ర‌జ‌లు త‌మ‌ను ఛీ కొడుతున్నార‌న్న విష‌యం వారికీ తెలుసు.. ఈ నేప‌ధ్యంలో గ‌తిలేని ప‌రిస్థితిలో కేంద్రం ఇస్తామ‌న్న ప్యాకేజీ కాని ప్యాకేజీకి ఒప్పుకోవాల్సి వ‌చ్చింది.. హోదా వ‌ద్దు అన్న వెంక‌య్య అండ్ కో ప‌ల్ల‌వికి వంత పాడాల్సి వ‌చ్చింది.. పిచ్చ జ‌నానికి ఎలాగో మ‌సిపూసి మారేడుకాయ చేద్దామ‌నుకుంటే., ఇప్పుడు ఈ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెద్ద బాంబే పేల్చారు.. నిజాల‌న్నీ జ‌నం ముందు పెట్టేశారు..

ఇప్పుడు మ‌నం చేయ‌గ‌లిగింది ఏంటి..? ప‌వ‌న్‌ని నిలువ‌రించ‌డం ఎలా అనే కంటే..? ఆయ‌న‌తో పోటీ ప‌డ‌డం ఎలా అన్న అంత‌ర్మ‌ధ‌నం బాబు బ్యాచ్‌లో మొద‌లైంది.. హోదా కుద‌ర‌దు., ప్యాకేజీ ఇస్తాం అని చెప్ప‌డానికే కేంద్రానికి రెండున్న‌రేళ్ల కాలం ప‌ట్టింది.. అలాంటిది ఈ ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ద‌త ఇవ్వ‌డానికి, నిధులు విడుద‌ల చేయ‌డానికి ఇంకెంత స‌మ‌యం ప‌డుతుంది.. అందుకు మిగిలిన రెండున్న‌రేళ్ల కాలం స‌మ‌యం తీసుకుంటే ఇంకా మ‌నం చేసేది ఏంటి..? అన్న ప్ర‌శ్న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.. ఇప్ప‌టికే ప‌వ‌న్ దెబ్బ‌కి జ‌నం ముందు మ‌నం మోస‌కారులుగా ముద్ర వేయించుకున్నాం.. ఇక‌నైనా కేంద్రంపై పోరాడ‌కుంటే ముందు ముందు మ‌రింత ప‌లుచ‌నైపోతాం.. క‌నీసం ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ద‌త అయినా క‌ల్పించ గ‌లిగితే.., జ‌నానికి ఏదో ఒక‌టి చెప్పుకోవ‌చ్చు.. లేక‌పోతే 2019లో ఓట్లు అడ‌గ‌లేం.. అన్న చ‌ర్చ సాగుతోంది.. జ‌న‌సేనాని ముచ్చ‌ట‌గా మూడు సార్లు జ‌నం ముందుకి వ‌స్తేనే ఇంత కంగారు ప‌డుతున్నారు.., మ‌రి ఆయ‌న ఇంకో ప‌బ్లిక్ మీటింగ్‌కి సిద్ద‌మ‌వుతున్నారు.. కాచుకోండి పాల‌కులారా.. మీలో ఏదో ఒక మూల నిజాయితీ ఉంటే., జ‌నం ముందుకి వ‌చ్చి ప‌వ‌న్ అడిగే ప్ర‌శ్న‌ల‌కి బ‌దులివ్వండి.. లేదా రాజ‌కీయాల‌కి రాంరాం చెప్పి ఇళ్ల ద‌గ్గ‌ర కూర్చోండి.. లేక‌పోతే ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌దు..

 

Share This:

1,638 views

About Syamkumar Lebaka

Check Also

ఓటుకు నోటు ఇచ్చిన నేత‌ల‌కు జ‌నం నామం.. పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో ప్ర‌కంప‌న‌లు..

అధికారం చేతిలో ఉంటే ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చాల్సిన అవ‌స‌ర‌మూ లేదు.. సొంత పార్టీ నాయ‌కుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 2 =