Home / జన సేన / పాల‌కొల్లులో జ‌న‌సేన ఆధ్య‌ర్యంలో ఎస్వీఆర్ పేరిట ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌..

పాల‌కొల్లులో జ‌న‌సేన ఆధ్య‌ర్యంలో ఎస్వీఆర్ పేరిట ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌..

ఆసుప‌త్రిలో హ‌రిరామ‌జోగ్య‌ను క‌లిసిన సంద‌ర్బంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పాల‌కొల్లు ప్రాంతంలో సినిమా అభివృద్దికి చ‌ర్య‌లు తీసుకుంటూ ఓ నిర్ణ‌యం తీసుకున్నారు.. అల్లు రామ‌లింగ‌య్య‌, దాస‌రి, కోడి రామ‌కృష్ణ లాంటి ఎంద‌రో ప్ర‌ముఖుల‌ను చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఇచ్చిన పాల‌కొల్లులో జ‌న‌సేన పార్టీ ఆధ్వ‌ర్యంలో ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. తెలుగు చ‌ల‌న‌చిత్ర దిగ్గ‌జం ఎస్వీ రంగారావు పేరిట ఈ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు.. న‌వ‌త‌రంలో ఉన్న నైపుణ్యాన్ని తీర్చిదిద్దేలా ఈ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు చెప్పారు నిర్మాత‌గా ఎన్నో మంచి చిత్రాలు అందించిన హ‌రిరామ‌జోగయ్య చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించే ఈ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్వ‌హ‌ణా బాధ్య‌త‌లు రాజా వ‌న్నెంరెడ్డి, బ‌న్నీ వాసు చూసుకోనున్నారు.. తెలుగు రాష్ట్రాల యువ‌త‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉండే ఈ ఇనిస్టిట్యూట్‌కు త‌న అండ‌దండ‌లు ఉంటాయ‌ని జ‌న‌సేన అధినేత స్ప‌ష్టం చేశారు.. ఇక పాల‌కొల్లు ఇనిస్టిట్యూట్‌లో న‌ట‌న‌, ద‌ర్శ‌క‌త్వ విభాగాల్లో శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్టు హ‌రిరామ‌జోగయ్య ప్ర‌క‌టించారు.. ఇప్ప‌టికే శిక్ష‌ణ విధానం, ఫ్యాక‌ల్టీ సిద్దం అయ్యింద‌ని తెలిపారు.. ప్రారంభోత్స‌వానికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రానున్న‌ట్టు తెలిపారు.. రాజావ‌న్నెంరెడ్డి ప్రిన్స్‌పల్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు..

Share This:

233 views

About Syamkumar Lebaka

Check Also

కేంద్ర బ‌డ్జెట్ నిరాశ ప‌ర్చింది.. ఏపీ స‌ర్కారు స్ప‌ష్ట‌త తీసుకోవాలి-జ‌న‌సేన పార్టీ

కేంద్ర బ‌డ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని జ‌న‌సేన పార్టీ ముఖ్య‌నేత మాదాసు గంగాధ‌రం స్ప‌ష్టం చేశారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × one =