Home / జన సేన / ”పిడికిలి” బిగించిన జ‌న‌సేనుడు.. నిడ‌ద‌వోలు స‌భ‌లో పార్టీ గుర్తు ప్ర‌క‌ట‌న‌..

”పిడికిలి” బిగించిన జ‌న‌సేనుడు.. నిడ‌ద‌వోలు స‌భ‌లో పార్టీ గుర్తు ప్ర‌క‌ట‌న‌..

అది ఉక్కు ‘పిడికిలి’.. ఎంతో మందిని క‌దిలించిన శ‌క్తి.. దేశ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టించిన ఆయుధం.. సంఘ‌టిత పోరాటానికి ప్ర‌తీక‌.. ఐక్య‌త‌కు చిహ్నం.. అదే జ‌న‌సేన పార్టీ గుర్తు.. పోరాట యాత్ర‌లో భాగంగా నిడ‌ద‌వోలులో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో త‌మ పార్టీ గుర్తుగా ‘పిడికిలి’ని జ‌న‌నాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు.. పార్టీ ప్రారంభించిన తొలి నాళ్ల నుంచి గుండెల నిండుగ ధైర్యంతో త‌న ఉక్కు ప‌డికిలి గాలిని చీల్చుకుంటూ పైకి లేవ‌గా., ఆ శ‌క్తికి ముందుగా యువ‌ర‌క్తం జోడ‌య్యింది.. ఇప్పుడు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతూ, పాల‌కుల వెన్నులో వ‌ణుకుపుట్టిస్తున్న అదే ‘పిడికిలి’ అన్ని వ‌ర్గాల గుండెల్లో ముద్ర వేసేసింది.. అందుకే ప్ర‌తి ఒక్క‌రిలో పోరాట స్ఫూర్తిని నింపే ఆ ‘పిడికిలి’నే త‌న పార్టీ గుర్తుగా జ‌న‌సేన అధినేత ప్ర‌క‌టించారు..

అయితే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇక్క‌డ ‘పిడికిలి’ గుర్తు ప్ర‌క‌టించ‌డం వెనుక కార‌ణాన్ని ఒక్క ముక్క‌లో చెప్పేశారు.. అన్ని కుల‌మ‌తాల్ని క‌ల‌సి క‌ట్టుగా ఉండి బ‌లాన్ని చాటేలే ‘పిడికిలి’ చూపుతామ‌న్నారు.. అంటే పార్టీ సిద్ధాంతాలు కులాల్ని క‌ల‌ప‌డం, మ‌తాల ప్ర‌స్థావ‌న లేకుండా అంద‌ర్నీ క‌లుపుకుంటూ ఐక్య పోరాటం చేయ‌డ‌మే పిడికిలి ల‌క్ష్య‌మ‌న్న సందేశాన్ని పంపారు..

అధికారాన్ని మ‌దంతో., దాహంతో కొన్ని వ‌ర్గాలు మాత్ర‌మే త‌మ హ‌క్కుగా భావిస్తున్న రాజ్యాధికారాన్ని అన్ని వ‌ర్గాల సంఘ‌టిత పోరాటంతో అధికార వికేంద్రీక‌ర‌ణ‌కు దిక్సూచి కావాల‌న్న అర్ధాన్ని జ‌న‌సేనుడు సంధించిన ఈ ఉక్కు ‘పిడికిలి’.. ప్ర‌కంప‌న‌లు ఏ రేంజ్‌లో ఉంటాయో.. వేచిచూడాలి..

Share This:

2,060 views

About Syamkumar Lebaka

Check Also

కాకినాడ సెజ్‌లో జ‌న‌సేనాని.. బాధితుల వెత‌లు విన్న ప‌వ‌న్‌.. విత్ ఫోటో గ్యాల‌రీ..

కాకినాడ సెజ్‌..కేవీ రావు అక్ర‌మాల‌పై బాధితుల పోరాటానికి మ‌ద్ద‌తుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురువారం ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించారు.. యూ.కొత్త‌ప‌ల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen − 3 =