Home / సేన సేవ / పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌వ‌న్ అభిమాని.. ఆప‌న్న‌హ‌స్తం అందించిన జ‌న‌సైన్యం..

పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌వ‌న్ అభిమాని.. ఆప‌న్న‌హ‌స్తం అందించిన జ‌న‌సైన్యం..

img_8527

img-20161211-wa0096ఈ ఫొటోలో ఒంటికాలుతో నిల్చున్న వ్య‌క్తి పేరు షేక్ నూర్ అహ్మ‌ద్‌.. ఊరు బెజ‌వాడ‌.. ఇత‌ను జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి వీరాభిమాని.. కాదు భ‌క్తుడు.. ఊహ తెలిసిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న్నే త‌న రోల్ మోడ‌ల్‌గా ఆరాధించే వాడు.. అది ఏ స్థాయిలో అంటే., ప‌వ‌ర్‌స్టార్ చిత్రం ఒక‌టి విడుద‌ల అయితే అప్ప‌టి నుంచి మ‌రో చిత్రం విడుద‌ల అయ్యే వ‌ర‌కు., ప‌వ‌న్ ఆ చిత్రంలో ఏ గెట‌ప్‌లో తిరిగితే అదే గెట‌ప్‌లో నూర్ క‌నిపించేవాడు.. డ్రైవింగ్ అత‌నికి జీవ‌నోపాధి.. అదే వృత్తితో కుటుంబ భారాన్ని మోసే ఇత‌నికి., యాక్సిడెంట్ రూపంలో దుర‌దృష్టం ప‌లుక‌రించింది.. నూర్ అహ్మ‌ద్‌, అత‌ని కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ‌తీసింది.. కుటుంబ పోష‌ణ‌కు ఇత‌నే పెద్ద దిక్కు.. ఓ వైపు త‌ల్లి క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతోంది.. త‌న‌కు వ‌చ్చే కొద్దిపాటి సంపాద‌న‌లోనే ఆమెకు చికిత్స అందిస్తూ., కుటుంబాన్ని సాకుతూ వ‌స్తున్నాడు.. అయితే రెండు నెల‌ల క్రితం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం నూర్ జీవితంలో క‌ల్లోలం రేపింది.. అత‌ని కుడి కాలు కోల్పోయేలా చేసింది.. అత‌ను స్టీరింగ్ తిప్పితేగాని న‌డ‌వ‌ని బ‌తుకులు కాస్తా ఒక్క‌సారిగా కూలిపోయాయి.. ప్ర‌స్తుతం స‌ర్కారీ దావ‌ఖాన వైద్యుల సాయంతో చికిత్స చేయించుకుంటున్న నూర్‌., మందులు కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నాడు..

img_8516 img_8524

ఓ ప‌వ‌న్ అభిమాని క‌ష్టాల్లో ఉన్నాడ‌న్న విష‌యం.. జ‌న‌సైన్యం దృష్టికి వ‌చ్చింది.. ఎవ‌రు క‌ష్టంలో ఉన్నా., ఆదుకోమ‌న్న జ‌న‌సేనాని ప‌లుకులు వెంట‌నే వారికి గుర్తుకువ‌చ్చాయి.. త‌మ‌కు ఉన్న‌దాన్లో ప‌వ‌ర్‌స్టార్ అభిమాని అయిన నూర్ అహ్మ‌ద్‌ను ఆదుకోవాల‌ని సేన నిర్ణ‌యానికి వ‌చ్చింది.. అంతేకాదు వెంట‌నే అమ‌ల్లో కూడా పెట్టేసింది.. కృష్ణాజిల్లాలో జ‌న‌సేన పార్టీ త‌రుపున కార్య‌క్ర‌మాలు చేస్తున్న మండ‌లి రాజేష్‌., త‌న బృందంతో క‌లిసి నూర్ ఇంటి త‌లుపు త‌ట్టారు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారి పార్టీ త‌రుపున వ‌చ్చామ‌ని ప‌లుక‌రించారు.. ఓపిగ్గా అత‌ని బాధ‌ను విన్నారు.. త‌మ‌కు ఉన్న ఓపిక‌లో నూర్ అహ్మ‌ద్‌కి మూడు నెల‌ల‌కి స‌రిప‌డా మందులు అందించారు.. అంతేకాదు ఆ మూడు నెల‌ల‌కి స‌రిప‌డ బియ్యం, వంట సామాగ్రితో పాటు కొంత న‌గ‌దు కూడా ఆ కుటుంబానికి అందించారు..

img_8521                                                 img_8522

అయితే అత‌నికి ప్లాస్టిక్ కాలు పెట్ట‌డానికి మ‌రో మూడు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని వైద్యులు చెప్పారు.. ఈ మూడు నెల‌లు నూర్ కుటుంబానికి ఎలాంటి అవ‌స‌ర‌మొచ్చినా భ‌రించ‌డానికి సిద్ధ‌మ‌న్న జ‌న‌సైనికుడు మండ‌లి రాజేష్‌., ప్లాస్టిక్ కాలు కూడా తామే కొనిస్తామ‌ని హామీ ఇచ్చారు.. ప్లాస్టిక్ కాలు వేయించుకుంటే., ఏదో ఒక ప‌ని చేసుకుంటాన‌ని ఈ జ‌నసేనాని అభిమాని త‌న అభిమానాన్ని చాటుకోగా., పార్టీ త‌రుపున మ‌రికొంద‌ర్ని సంప్ర‌దించి., ఎవ‌రైనా ముందుకి వ‌స్తే., బ‌తుకుతెరువు కూడా చూపిస్తామ‌ని జ‌న‌సేన నేత‌లు హామీ ఇచ్చారు.. అంత నిస్స‌హాయ స్థితిలో కూడా కాట‌మ‌రాయుడు రిలీజ్‌కి తీసుకువెళ్ల‌మ‌న్న నూర్., త‌న అభిమానాన్ని చాటుకుంటే., ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకునేందుకు తాము ఎప్పుడూ సిద్ధ‌మ‌ని జ‌న‌సైన్యం చాటింది.. ప‌వ‌న్ అంటే భ‌రోసా.. ప‌వ‌నిజం అంటే బాధ్య‌త‌.. ఆ బాధ్య‌తే ఈ జ‌న‌సైన్యం.. ఇలాంటి సేవ‌కు సేన ముందుకి రావాల‌న్న‌దే మా ల‌క్ష్యం..

Share This:

1,361 views

About Syamkumar Lebaka

Check Also

విజ‌యం వ‌రిస్తుందో.? లేదో.? తెలియ‌దు.. ప‌ని మాత్రం మొద‌లెట్టేశాడు.. ద‌టీజ్‌ జ‌న‌సేన‌..

సామాజిక మాధ్య‌మాల్లో మూడు లైన్ల పోస్టు ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది.. తిరిగి అధికారంలోకి రాక‌పోతే టీడీపీ అధినేత చంద్ర‌బాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 5 =