Home / ఎడిటోరియల్స్ / పుకార్ల‌ మీడియాకి హాట్ కేక్‌గా మారిన జ‌న‌సేన‌, ప‌వ‌ర్‌స్టార్‌.. వెల్లువలా ఊహాగాన క‌థ‌నాలు..

పుకార్ల‌ మీడియాకి హాట్ కేక్‌గా మారిన జ‌న‌సేన‌, ప‌వ‌ర్‌స్టార్‌.. వెల్లువలా ఊహాగాన క‌థ‌నాలు..

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్ర‌జల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రాజ‌కీయ ప్ర‌స్థాన‌మే.. జ‌న‌సేనాని వేసే ప్ర‌తి అడుగునీ తెలుసుకోవాని జ‌నంలో ఉన్న ఆత్రుతే అందుకు కార‌ణం.. తెలుగు వారే కాదు, చుట్టు ప‌క్క‌ల రాష్ట్రాల్లో ఉన్న ప‌వ‌న్ అభిమానులు, తెలుగు మాట్లాడ‌టం వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రు ఎక్కువ‌గా సెర్చ్ చేసే అంశం కూడా జ‌న‌సేనానే.. దీంతో ప‌వ‌ర్‌స్టార్‌, ఆయ‌న పార్టీ జ‌న‌సేన‌కి సంబంధించి ఎలాంటి వార్త బ‌య‌టికి వ‌చ్చినా., అది హాట్ కేకే.. అందుకే ప‌వ‌న్, ఆయ‌న పార్టీ గురించి పుకార్లు చిలువ‌లు ప‌ల‌వ‌లుగా మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తూ ఉంటాయి.. వాస్త‌వానికి ఇదంతా రేటింగ్స్ పెంచుకునే ఓ టెక్నిక్ మాత్ర‌మే.. ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్సేమో త‌మ దేవుడి గురించి వ‌చ్చిన ఎలాంటి వార్త‌యినా త‌మ‌కు స్పెష‌లే క‌నుక దానికి సామాజిక మాధ్య‌మాల ద్వారా మ‌రింత ప్రాచుర్యం క‌ల్పిస్తున్నారు.. ప‌వ‌న్ మేనియా ఫైన‌ల్‌గా ఇలాంటి వార్త‌లు ప్ర‌చారం చేసేవారికి మీడియా సంస్థ‌ల‌కి బాగా ఉప‌యోగ‌ప‌డుతోంది..20161108_091943

 

ఇలాంటి ప్ర‌చారాల విష‌యంలో జ‌న‌సైన్యం కొన్ని నియ‌మాలు పాటిస్తే మంచిది.. ఇది ప‌వ‌ర్‌స్టార్ అభిమ‌తం.. ఏ విష‌యంలో అయినా స్ప‌ష్ట‌మైన వైఖ‌రి., పార‌ద‌ర్శ‌క‌త పాటించ‌డం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌త్యేక‌త‌.. ఆయ‌న ఏ ప‌ని చేసినా దాన్ని ర‌హ‌స్యంగా ఉంచే అల‌వాటు ఆయ‌న‌కి లేదు.. అయితే సినిమా, రాజ‌కీయ ప్ర‌స్థానాల‌కి సంబంధించి నిత్యం జ‌న‌సేనాని ఎంతో మందిని క‌లుస్తూ ఉంటారు.. ఇందులో కొన్ని వ్య‌క్తిగ‌త మైన‌వి కూడా ఉంటాయి.. కాబ‌ట్టి ప‌వ‌న్ ఎవ‌రితో క‌లిస్తే., వారు పార్టీలోకి వ‌చ్చి చేరిపోతున్నారంటూ వ‌స్తున్న వార్త‌ల‌కి కాస్త చెక్ పెట్టండి.. ఈ మ‌ధ్య కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌లు పార్టీలోకి వ‌చ్చేస్తున్నారంటూ విప‌రీత‌మైన ప్ర‌చారం కొన‌సాగుతోంది.. ఒక వేళ అలాంటిది ఏమైనా ఉంటే ప‌వ‌ర్‌స్టార్ స్వ‌యంగా చెబుతారు.. వారిని పార్టీలోకి ఆహ్వానించారా..? అయితే ఎందుకు ఆహ్వానించాల్సి వ‌చ్చింది..? అనే కార‌ణాలు మీ ముందుకి తెస్తారు.. దీంతో పాటు అనంత స‌భ‌కి లోక్‌సత్తా మ‌ద్ద‌తు తెలిపింద‌న్న వార్త రాగానే., భ‌విష్య‌త్తులో ప‌వ‌న్‌-జేపీ క‌లిసి అడుగులు వేస్తారంటూ చిల‌వ‌లు, ప‌ల‌వ‌లు మొద‌ల‌య్యాయి.. జ‌న‌సేన పార్టీకి ఓ ఖ‌చ్చిత‌మైన సిద్ధాంతం ఉంది, దీంతో పాటు ప‌క్కా ప్ర‌ణాళిక‌లు కూడా ఉన్నాయి.. వాటిని అనుకున్న విధంగా అమ‌లు ప‌రిస్తేనే., 2019లో మ‌నం అనుకున్న గ‌మ్యానికి చేరుకోగ‌లుగుతాం.. అందుకే ఇలాంటి పుకార్ల‌ను ద‌య‌చేసి ప్ర‌చారం చేయొద్దు., మ‌న సేనాని ఆకాంక్ష కూడా ఇదే..

ఇలాంటి ప్ర‌చారాల వ‌ల్ల పార్టీకి ఎలాంటి న‌ష్టం జ‌రుగుతుంది., ఇందులో మీడియా పాత్ర ఎలా ఉంటుంది అనే దానికి నిలువెత్తు ఉదాహ‌ర‌ణ మెగాస్టార్ పార్టీ పీఆర్పీ.. అందుకు నిలువెత్తు సాక్షిని నేనే.. ఆనాడు ఓ పేరుమోసిన మీడియా సంస్థ‌లో నేను ప‌నిచేస్తున్నాను.. మెగాస్టార్ రాజ‌కీయాల్లోకి వ‌ద్దామా..? వ‌ద్దా..? అన్న సంధిగ్దంలో ఉండ‌గా.. ఆయ‌న్ని రా..రా.. అంటూ ముందుకి లాగారు.. పార్టీ పెట్టాక ఇలాంటి పుకార్ల‌తో చౌక‌బారు రాజ‌కీయ నేత‌లంద‌ర్నీ ద‌గ్గ‌రికి చేర్చారు.. ఫైన‌ల్‌గా వారంద‌రికీ ఎక్కొలుపులు పెట్టి సాగ‌నంపేందుకు స‌హ‌క‌రించారు.. పీఆర్పీ ఫెయిల్యూర్‌లో ఇలాంటి పుకార్ల మీడియాదే కీ రోల్‌.. క‌నుక మ‌నం అనుకున్న ల‌క్ష్యాన్ని చేరాలంటే., మీకు నిజంగా తెలిసినా., ఆ విష‌యాన్ని మ‌న‌సేనాని ప్ర‌క‌టించే వ‌ర‌కు గోప్యంగా ఉంచండి..త‌ప్పుడు ప్ర‌చారాల్ని చిల‌వ‌లు, ప‌ల‌వ‌లు చేయొద్దు.. అత్యంత ప్ర‌జాధ‌ర‌ణ ఉన్న మ‌న సోష‌ల్ మీడియాలో వాటికి ప్రాధాన్య‌త ఇవ్వొద్దు..

Share This:

1,259 views

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనాని ”మౌనం” తుపాను ముందు ప్ర‌శాంత‌తే..

ఐదు సంవ‌త్స‌రాల క్రితం జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏం సాధించారు..? ఒక్క సీటు అయినా గెలుస్తారా..? అస‌లు ఎన్నిక‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 + nine =