Home / జన సేన / పెట్రోల్ వ్య‌తిరేక ఉద్య‌మానికి జ‌న‌సేన మ‌ద్ద‌తు.. శాంతియుత ఆందోళ‌న‌కి ప‌వ‌న్ పిలుపు..

పెట్రోల్ వ్య‌తిరేక ఉద్య‌మానికి జ‌న‌సేన మ‌ద్ద‌తు.. శాంతియుత ఆందోళ‌న‌కి ప‌వ‌న్ పిలుపు..

భారీగా పెరిగిన పెట్రోల్ ధ‌ర‌ల‌కి నిర‌స‌న‌గా ఈ నెల 10వ తేదీ దేశ వ్యాప్తంగా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన హ‌ర్తాళ్‌కు జ‌న‌సేన పార్టీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.. ఈ మేర‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.. సోమ‌వారం నాటి హ‌ర్తాళ్‌లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పూర్తి శాంతియుతంగా పాల్గొంటార‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.. రోజు రోజుకీ మండుతున్న పెట్రోల్ ధ‌ర‌లు తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌ని ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు.. పెట్రోల్‌ని గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ టాక్స్‌(జి.ఎస్‌.టి) ప‌రిధిలోకి తీసుకురావాల‌ని జ‌న‌సేన పార్టీ ఎప్ప‌టి నుండో డిమాండ్ చేస్తున్న అంశాన్ని ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న‌లో గుర్తు చేశారు..

ఇక దేశ వ్యాప్తంగా త‌ల‌పెట్టిన హ‌ర్తాళ్‌లో పాల్గొన వ‌ల‌సిందిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ సి.పి.ఎం కార్య‌ద‌ర్శి మ‌ధు, సిపిఐ కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌ల‌తో పాటు త‌న‌ను కొరిన ఏ.పీ.సీ.సీ ఛీఫ్ ర‌ఘువీరారెడ్డిల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.. అదే స‌మ‌యంలో జ‌నం స‌మ‌స్య‌ల‌పై చేప‌ట్టే పోరాటంలో జ‌న‌సేన ఏ పార్టీ పిలుపునిచ్చినా అండ‌గా వుంటుంద‌ని మ‌రోసారి జ‌న‌సేనాని చాటారు.. జ‌న‌సేన అధినేత పిలుపు నివ్వ‌డంతో., శాంతియుతంగా త‌మ నిర‌స‌న తెలిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వున్న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు సిద్ధ‌మ‌వుతున్నారు..

Advertisement.

Share This:

1,559 views

About Syamkumar Lebaka

Check Also

ఓట్ల మాయంపై రోడ్డెక్కిన జ‌నసేన‌.. మా ఓటు-మా హ‌క్కు అంటూ నిర‌స‌న‌..

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. ఓ వైపు ఎన్నిక‌ల సంఘం ప్ర‌తి నెలా డ్రైవ్‌లు పెట్టి మరీ 18 సంవ‌త్స‌రాలు నిండిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen + one =