Home / జన సేన / పెట్రో బంద్‌లో జ‌న‌సేన మార్క్‌.. తెలుగు రాష్ట్రాల్లో శాంతియుత నిర‌స‌న‌లు..

పెట్రో బంద్‌లో జ‌న‌సేన మార్క్‌.. తెలుగు రాష్ట్రాల్లో శాంతియుత నిర‌స‌న‌లు..

నిత్యం వ‌డ్డిస్తున్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌కి వ్య‌తిరేకంగా జాతీయ స్థాయిలో విప‌క్షాలు త‌ల‌పెట్టిన బంద్‌లో జ‌న‌సేన త‌న మార్క్ చాటుకుంది.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఈ బంద్‌కి దూరంగా వుండ‌గా., ఆ పాత్ర‌ని జ‌న‌సేన పోషించింది.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అదేశాల మేర‌కు వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్ పార్టీతో క‌ల‌సి జ‌న‌సైనికులు బంద్‌లో పాల్గొన్నారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయిన ప‌రిస్థితుల్లో ., 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో హ‌ర్తాళ్‌ని విజ‌వంతం చేయ‌డానికి జ‌న‌సైనికులే దిక్క‌య్యారు.. పార్టీ అధినేత సూచ‌న మేర‌కు దాదాపుగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అనే కంటే అన్ని మండ‌ల కేంద్రాల్లో నిర‌స‌న‌ల్లో పాల్గొన్న జ‌నసేన కార్య‌క‌ర్త‌లు.. శాంతియుత పంధాలోనే కార్య‌క్ర‌మాన్ని ముగించారు.. చాలా ప్రాంతాల్లో దేశ నాయ‌కుల విగ్ర‌హాల ఎదుట నిల‌బ‌డి పెంచిన పెట్రోల్ ధ‌ర‌ల్ని వెంట‌నే త‌గ్గించాల‌నీ, పెట్రోల్‌ని కూడా గ్రూడ్స్ అండ్ స‌ర్వీసెస్ టాక్స్‌(జీ.ఎస్‌.టీ)ప‌రిధిలోకి తేవాల‌ని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు..

 

మోడీ స‌ర్కారు చేసిన మోసంతో పాటు విప‌క్షాల‌కి పోటీగా క‌ప‌ట నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన రాష్ట్ర ప్ర‌భుత్వ తీరుపై కూడా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు దుమ్మెత్తిపోశారు.. ముఖ్యంగా గ‌డ‌చిన నాలుగేళ్లుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అధ‌నంగా మూడు రూపాల టాక్స్ వ‌డ్డించిన విష‌యాన్ని ప్ర‌జ‌ల ముందు ఉంచారు.. కేవ‌లం కేంద్ర-రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరుని ప్ర‌జ‌ల‌కి తెలియ‌చేయ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల హ‌ర్తాళ్ కార్య‌క్ర‌మం సాగింది..

మ‌రికొన్ని ప్రాంతాల్లో మాత్రం వామ‌ప‌క్ష పార్టీల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో పాటు జ‌న‌సైనికులు రోడ్డెక్కారు.. బెజ‌వాడ లాంటి ప్రాంతాల్లో ఉద‌యం ఏడు గంట‌ల నుంచే బ‌స్టాండ్‌ల బ‌య‌ట నిర‌న‌స కార్య‌క్ర‌మాల‌కి ఉప‌క్ర‌మించారు.. దీంతో పాటు ఆటోకి తాడు క‌ట్టి లాగుతూ., పెట్రోల్-డీజిల్ ధ‌ర‌లు రికార్డు స్థాయికి చేరిన నేప‌ధ్యంలో., ఇక మీద‌ట మ‌నుషులే వాహ‌నాల్ని తోచుకెళ్లాల్సిన దుస్థితి ఏర్ప‌నుందంటూ ఎద్దేవా చేశారు.. ప‌లు చోట్ల స్వ‌చ్చందంగా ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, దుకాణాలు, పాఠ‌శాల‌లు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల నిర‌స‌న‌తో స్వ‌చ్చందంగా మూసి వేశారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా బ‌స్సులు తిరిగినా., జ‌న‌సేన చేప‌ట్టిన శాంతియుత నిర‌స‌న కార్య‌క్ర‌మాలు మాత్రం విజ‌య‌వంతం అయ్యాయి… శాంతియుత నిర‌స‌న‌ల నేప‌ధ్యంలో ప్ర‌జ‌ల‌కి ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా జ‌న‌సైనికులు కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కి త‌మ నిర‌స‌న తెలియ‌జేశారు..

ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎన్నిక‌ల వేళ బంద్ విజ‌య‌వంత‌మ‌య్యింది.. చాలా చోట్ల పోలీసుల బెధిరింపుల నేప‌ధ్యంలో కూడా జ‌న‌సైనికులు రోడ్ల మీద‌కి వ‌చ్చి బంద్‌ని విజ‌య‌వంతం చేశారు.. భాగ్య‌న‌గ‌ర వీధుల్లో సైతం బంద్ చేసి చూపారు.. ఓవ‌రాల్‌గా తాజా బంద్‌లో ప్ర‌జ‌ల కోసం పోరాటం చేసే మూడో ప్ర‌త్యామ్నాం జ‌న‌సేన రూపంలో ప్ర‌జ‌ల‌కి ల‌భించిన‌ట్ట‌య్యింది.. అయితే ఒక‌టి, రెండు చోట్ల మాత్రం జ‌న‌సేన బంద్ స్వ‌ల్ప ఉద్రిక్త‌త‌ల‌కి దారితీసింది.. శాంతియుత నిర‌స‌న‌ల్ని కూడా పోలీసులు సెక్ష‌న్ల పేరుతో అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌డంతో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు-పోలీసుల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది.. ప‌లు చోట్ల ప‌రిస్థితి అక్ర‌మ అరెస్టుల వ‌ర‌కు వెళ్లింది..

Advertisement.

Share This:

1,462 views

About Syamkumar Lebaka

Check Also

స్థానిక ఎన్నిక‌ల్లోనూ జీరో బ‌డ్జెట్ -జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

రాబోయే రోజుల్లో జ‌న‌సేన పార్టీ ఓ స్ప‌ష్ట‌మైన విజ‌న్‌తో ముందుకు వెళ్తుంద‌ని సిబిఐ మాజీ జేడీ, విశాఖ ఎంపి అభ్య‌ర్ధి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × two =