Home / జన సేన / పేద‌రికాన్ని పెంచి పోషిస్తున్న వారే జ‌న‌సేన శ‌త్రువులు.. మువ్వ‌న్నెల జెండా సాక్షిగా జ‌న‌సేనుడు..47

పేద‌రికాన్ని పెంచి పోషిస్తున్న వారే జ‌న‌సేన శ‌త్రువులు.. మువ్వ‌న్నెల జెండా సాక్షిగా జ‌న‌సేనుడు..47

72వ స్వ‌తంత్ర దినోత్స‌వం.. జ‌న‌సేన ఖాతాలోకి బోలెడంత మంది శ‌త్రువుల్ని చేర్చేసింది.. అదే స‌మ‌యంలో ఆ శ‌త్రువులంతా మూకుమ్మ‌డిగా దాడి చేసినా ఎదిరించే స‌త్తా ఉన్న జ‌న‌బ‌లాన్ని ఇచ్చింది.. ఎందుకంటే జ‌న‌సేనుడు త‌న పార్టీకి వ‌ర్గ శ‌త్రువులు ఎవ‌రో త‌న నోటితో తాను తేల్చిచెప్పేశాడు.. ఆ శ‌త్రువుల స‌మాజంలో పేద‌రికాన్ని పెంచి పోషిస్తున్న వారే.. ఈ పేదరికాన్ని పెంచి పోషిస్తున్న వారే అన్ని ర‌కాల సామాజిక రుగ్మ‌త‌ల‌కి కార‌ణ‌మ‌న్న‌ది నిర్వివాదాంశం.. త‌మ కోట‌ల‌కి బీట‌లు వార‌కుండా ఉండేందుకు పేద‌ల్ని పేద‌ల‌గానే ఉంచ‌డ‌మొక్క‌టే కాదు., అవినీతిని పెంచి పోషించ‌డంతో పాటు అన్ని ర‌కాల ఆకృత్యాల‌కు కార‌ణ‌బూతులుగా నిలుస్తున్నారు.. రాజ‌కీయ‌, ఆర్ధిక‌, అంగ‌బ‌లాల్ని పెంచి పోషిస్తున్నారు.. వీరు చాలా బ‌ల‌మైన శ‌త్రువులు.. కానీ వీరికంటే బ‌లం ఉన్న వారు వీరి చేతిలో అణ‌చివేత‌కి గుర‌వుతున్న అణ‌గారిన వ‌ర్గాల ప్ర‌జ‌లు.. సంఖ్యా బ‌లంలో వీరిలో రెండో వంతు మాత్ర‌మే.. అయితే ఆంజ‌నీయ‌డిలా వారి శ‌క్తి వారికి తెలియ‌దు.. అందుకే స‌మస‌మాజ స్థాప‌న‌కి, అన్ని వ‌ర్గాల‌ని క‌లిపి ఐక్యపోరాటం చేసేందుకు న‌డుం బింగించాడు ఈ అంజ‌నీపుత్రుడు..

పంద్రాగ‌స్టు సాక్షిగా ఆవిష్కృత‌మైన ప‌వ‌న్ విజ‌న్‌..

స‌మాజంలో పేద‌రికాన్ని పెంచి పోషిస్తున్న వారిని జ‌న‌సేన పార్టీకి ప్ర‌ధాన వ‌ర్గ శ‌త్రువులుగా ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. వాళ్లంతా ఎవ‌రో కూడా చెప్పుకొచ్చారు.. స‌మాజంలో పేద‌రికాన్ని పెంచి పోషిస్తున్న వారు అవినీతి ప‌రులు., పేద‌రికంలో ఉన్న‌వారిని ప‌ట్టించుకోకుండా అవినీతికి పాల్ప‌డే ప్ర‌తి ఒక్క‌రిని జ‌న‌సేన వ‌ర్గ శ‌త్రువులుగా భావిస్తుంద‌న్నారు.. మ‌హిళ‌ల‌కి ర‌క్ష‌ణ ఇవ్వ‌కుండా ఉన్న వారు, చిన్నారుల‌పై ఆకృత్యాలు చేసే వారినీ కూడా వ‌ర్గ శ‌త్రువులుగా తెలిపారు.. వారు పాల‌కులు అయినా., నాయ‌కులు అయినా.. అధికారులు అయినా.. ఎవ‌రైనా జ‌న‌సేన‌కి శ‌త్రువులేనని తేల్చేశారు..
ప‌వ‌న్ అనే నేను రాజ‌కీయాల్లోకి ఎందుకొచ్చానంటే..?
మువ్వ‌న్నెల ప‌తాకం సాక్షిగా తాను రాజ‌కీయాల్లోకి ఎందుకు వ‌చ్చాన‌నే విష‌యాన్ని సూటిగా చెప్పేశారు.. వేల కోట్లు సంపాదించ‌డం నా ల‌క్ష్యం కాదు.. తా త‌ర్వాత మా అబ్బాయి.. త‌ర్వాత మ‌నుమ‌డు అధికారంలో ఉండాల‌న్న ఆశ‌లు త‌న‌కు లేవ‌న్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. త‌న ఒక్క‌గానొక్క ఆశ‌ను బ‌య‌ట‌పెట్టారు.. ఆ ఆశ ప్ర‌తి మ‌నిషి క‌న్నీరు తుడ‌వ‌డ‌మే.. ప్ర‌తి క్ష‌ణం అందుకే త‌న త‌పన అంటూ చెప్పుకొచ్చారు.. అది జ‌ర‌గాలంటే రాజ‌కీయాల్లోకి కొత్త ర‌క్తం రావాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. మీ పార్టీలో పెద్ద నాయ‌కులు లేరు అనే వారికీ బ‌దులిచ్చేశారు.. కొత్త‌వాళ్ల‌ని తీసుకువ‌స్తాం అంటూ.. అణ‌చివేత‌కి గురైన వారికే ఆగ్ర‌హం ఉంటుంద‌న్న జ‌న‌సేనుడు., ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలిసిన వారు రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆకాంక్షించారు.. రాజ‌కీయా్ల్లోకి కొత్త నాయ‌క‌త్వం రావాలి.. కొత్త ర‌క్తం కావాలి.. అదే స‌మ‌యంలో జ‌వాబుదారీ త‌న‌మూ రావాల‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చారు.. నాయ‌కులు ప్ర‌జాక్షేత్రం నుంచి రావాల‌న్న త‌న ఆకాంక్ష‌ని వెలిబుచ్చారు..

త‌న ప్ర‌సంగంలో ఉభ‌య తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల త‌న‌యుల‌ను ప్ర‌స్థావించారు.. లోకేష్ ముఖ్య‌మంత్రి అయ్యేందుకు అనుభ‌వం ఏది..? అని ప్ర‌శ్నించిన జ‌న‌సేనుడు., కేటీఆర్‌కి అయితే ప్ర‌జ‌ల్లోంచి గెలిచి పోరాడిన అనుభ‌వం ఉంద‌న్నారు.. లోకేష్‌కి అలాంటి అనుభ‌వం ఎక్క‌డుంద‌ని ప్ర‌శ్నించారు.. ఆదిలాబాద్‌లో గిరిజ‌న తండాల‌కు వెళ్లినా, అర‌కు గిరిజ‌న గ్రామాల‌కు వెళ్లినా అక్క‌డ మ‌హిళ‌లు, వృద్దులు వేల కోట్ల ఆస్తులు అడ‌గ‌డం లేద‌న్న ఆయ‌న‌., తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు మాత్ర‌మే కావాల‌ని అడుగుతున్నార‌న్నారు.. అవికూడా పాల‌కులు ఇవ్వ‌డం లేద‌ని స్వ‌తంత్ర దినోత్స‌వం సాక్షిగా నిల‌దీశారు..

తాను మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ విషయంలో తెలంగాణాకు సంబంధించి కూడా ప్రస్తావించి ఉంటే పూర్తి సంతృప్తితో ఉండేవాణ్ణ‌న్న ఆయ‌న‌., చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్ విషయాలు అందరికీ సంబంధించినవన్నారు.. ఇవి జాతీయ స్థాయిలో వర్తించేవన్న జ‌న‌సేనుడు., ఢిల్లీలో అత్యాచార ఘటన జరిగితేగానీ నిర్భయ చట్టం రాలేదన్న విష‌యాన్ని గుర్తు చేశారు.. మహిళా రక్షణకు సంబంధించిన చట్టాలు రావాలన్నా, వారి సమస్యలపై చర్చించాలన్నా సభల్లో వారికి తగిన రిజర్వేషన్ ఇవ్వాలని సూచించారు. అవకాశం ఇస్తేనే ఆడపడుచులకి తమ వాదన వినిపించే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.. ఒక టీడీపీ ఎమ్మెల్యే మహిళా అధికారిపై దాడి చేస్తారు, మంత్రి అచ్చెన్నాయుడు మహిళా ఉద్యోగిపై ఒత్తిడి తీసుకువస్తారంటూ ప‌చ్చ పాల‌కుల ఆకృత్యాల‌ను ఎండ‌గ‌ట్టారు.. మహిళలకు రాజకీయ స్థానం కల్పిస్తేనే ఈ వ్యవస్థలో మార్పు తీసుకురాగల‌మ‌ని భ‌ర‌త‌మాత సాక్షిగా నొక్కివ‌క్కాణించారు..

తానెప్పుడూ కులానికి వంత‌పాడ‌న‌న్న ఆయ‌న‌., మాన‌వ‌త్వ‌మే త‌న‌కుల మ‌ని చాటిచెప్పారు.. అన్ని కులాల మ‌ధ్య ఐక్య‌త తీసుకురావాల‌న్న జ‌న‌సేన విధానాన్ని పున‌రుద్ఘాటించారు.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ విషయంలో వారికి సంబంధించిన నిధులు వారికే వెళ్లేలా చూడాలని డిమాండ్ చేశారు.. కులాల మధ్య వైరుధ్యాలను సయోధ్యతో సర్దుబాటు చేయాలన్నారు.. సమాజంలోని ఆచార వ్యవహారాలు, ఆహారపుటలవాట్లు, ఇలా ప్ర‌తి విష‌యంలో రాజ‌కీయ జోక్యం ఎందుకంటూ నిల‌దీశారు.. గోవధ విషయంలో ఎందుకు రాజకీయమ‌న్న ఆయ‌న‌., బీఫ్ తినడం ఓ ఆహారపుటలవాటు అభివ‌ర్ణించారు.. శాకాహారం తినే గుజరాత్ రాష్ట్రంలో గోద్రా ఘటన జరగడాన్ని ప్ర‌స్థావించిన జ‌న‌సేనుడు ఆహారపుఅల‌వాట్ల‌కి., హింసకీ సంబంధం ఉండదన్నారు.. ముస్లింలను మైనారిటీలు అనడం కూడా నాకు నచ్చ‌ద‌ని తేల్చేశారు..

కొస‌మెరుపు ఏంటంటే.. ఇన్ని అంశాల మీద స్ప‌ష్ట‌త ఇచ్చాక‌., శ‌త్రువులు ఎవ‌రో తాను చెప్ప‌కున్నా., ఇప్ప‌టికే కుప్ప‌లు తెప్ప‌లుగా కారాలు మిరియాలు నూరేస్తూ ఉంటారు.. అదే స‌మ‌యంలో ప్ర‌జాస్వామ్యంలో అతిశ‌క్తివంత‌మైన ప్ర‌జాబ‌లం జ‌న‌సేనుడి వెనుక చేరిపోతుంద‌న్న విష‌యాన్ని కూడా ఆ వ‌ర్గాలు గ‌మ‌నించాల‌న్న‌ది విశ్లేష‌కుల వాద‌న‌..

Share This:

2,163 views

About Syamkumar Lebaka

Check Also

స్థానిక ఎన్నిక‌ల్లోనూ జీరో బ‌డ్జెట్ -జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

రాబోయే రోజుల్లో జ‌న‌సేన పార్టీ ఓ స్ప‌ష్ట‌మైన విజ‌న్‌తో ముందుకు వెళ్తుంద‌ని సిబిఐ మాజీ జేడీ, విశాఖ ఎంపి అభ్య‌ర్ధి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 − three =