Home / జన సేన / పోయిన న‌మ్మ‌కాన్ని జ‌న‌సేన అధినేత బ‌తికించారు.. మా కోసం పోరాడారు- DCI ఉద్యోగులు..

పోయిన న‌మ్మ‌కాన్ని జ‌న‌సేన అధినేత బ‌తికించారు.. మా కోసం పోరాడారు- DCI ఉద్యోగులు..

లాభాల్లో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్‌ని ప్ర‌యివేటు ప‌రం చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడు., ఆ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా పోరుబాట ప‌ట్టిన ఆ సంస్థ ఉద్యోగులు., మ‌ద్ద‌తు కోసం ఎంతో మందిని సంప్ర‌దించారు.. రాష్ట్ర ప్ర‌భుత్వం సాయం చేయ‌లేమ‌ని ముందే చేతులెత్తేయ‌గా, ప్ర‌తిప‌క్ష పార్టీ కూడా నోరు మెద‌ప‌లేదు.. కార‌ణం మోడీ నిర్ణ‌యం మోడీ తీసుకున్న‌ద‌న్న భ‌యం కావ‌చ్చు.. డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఉద్యోగుల మాట‌ల్లో చెప్పాలంటే ప్ర‌తి రాజ‌కీయ నాయ‌కుడి ఇంటి మెట్లు ఎక్కి దిగాం.. ఎంపిని క‌లిసినా, ఎమ్మెల్యేల‌ని క‌ల‌సినా, మంత్రుల్ని క‌ల‌సినా ఉప‌యోగం క‌నిపించ‌లేదు. అలాంటి స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌మ‌ను విజ‌య తీరాల‌కు చేర్చే నావ‌లా క‌నిపించారు..

డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ప్ర‌యివేటీక‌ర‌ణ వ్య‌వ‌హారం.. కొన్ని వంద‌ల మంది ఉద్యోగుల స‌మ‌స్య‌.. ఓ ఉద్యోగి ప్రాణం కూడా బ‌లిగొన్న స‌మ‌స్య.. ఈ స‌మ‌స్య జ‌న‌సేన గ్యారేజ్‌కి వ‌చ్చిన‌ప్పుడు., లాభాల్లో ఉన్న సంస్ధ‌ని, దేశ భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల‌తో ముడిప‌డి ఉన్న స‌మ‌స్య‌ని ప్ర‌యివేటు చేతుల్లోకి ఇవ్వ‌డాన్ని జ‌న‌సేనాని తీవ్రంగా వ్య‌తిరేకించారు.. విశాఖ వ‌చ్చి, మీ పోరాటంలో పాలు పంచుకుంటాన‌ని చెప్పారు… మామూలుగానే ఓ స‌మ‌స్య‌పై జ‌న‌సేన అధినేత మాట్లాడితే, అది కోట్లాది మందికి చేరుతుంది.. అయినా చెప్పిన‌ట్టుగానే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గ‌త డిసెంబ‌ర్ 6వ తేదీన డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఉద్యోగులు చేప‌ట్టిన నిర‌వ‌ధిక నిర‌స‌న‌లో పాల్గొన్నారు.. అదే వేదిక నుంచి ప్ర‌ధాని మోడీకి ఓ లేఖాస్త్రాన్ని సంధించారు.. డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్‌ని ఎందుకు ప్ర‌యివేటీక‌రించ కూడదో వివ‌రిస్తూ, నిర్ణ‌యాన్ని పునఃస‌మీక్షించుకోమ‌ని కోరుతూ..

జ‌న‌సేన అధినేత సూచ‌న త‌ర్వాత DCI ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై వెంట‌నే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసినా., కాస్త ఆల‌స్యంగా ప్ర‌క‌టించింది కేంద్రం.. ప్ర‌యివేటీక‌ర‌ణ నిర్ణ‌యంపై కేంద్రం వెన‌క్కి త‌గ్గింది.. DCI ఉద్యోగుల‌కి న్యాయం చేయాల‌న్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ క‌ల నెర‌వేరింది.. అయితే ఉద్దానం ఎపిసోడ్ గానీ, ప్ర‌త్యేక హోదా పోరాటం విష‌యంలో గానీ, ముందు నుంచి పోరాటం చేస్తోంది మేమంటే మేము అని డ‌బ్బాలు కొట్టుకున్న టీడీపీ-వైసీపీలు, ఈ వ్య‌వ‌హారంలో మాత్రం నోరెత్త‌లేక‌పోయాయి..

టీడీపీ-వైసీపీలు నోరెత్త‌లేక పోయాయి అనే కంటే, DCI ఉద్యోగులు నోరెత్త‌కుండా చేశారు అనొచ్చు.. స‌హాయం కోసం వెళ్తే త‌మ‌ను ప‌ట్టించుకోని పార్టీల‌కి బుద్ది వ‌చ్చేలా., ఈ విజ‌యం జ‌న‌సేన అధినేత చ‌ల‌వే అన్న విష‌యం బ‌హిర్గ‌త ప‌రుస్తూ, కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ ఆయ‌న ఫోటో ఉన్న పోస్ట‌ర్‌ని పెట్టుకుని మ‌రీ మీడియా సమావేశం నిర్వ‌హించారు.. పూర్తిగా న‌మ్మ‌కం స‌న్న‌గిల్లిన స‌మ‌యంలో జ‌న‌సేనాని త‌మ‌ను ఆద‌కున్నార‌ని, ఆయ‌న‌కి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నామ‌ని ప్ర‌క‌టించారు..

ఎప్ప‌టిలాగే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఫోటో ఉండ‌డంతో ప‌చ్చ మీడియా, ప్ర‌తి ప‌చ్చ మీడియా రెండూ డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఉద్యోగులు నిర్వ‌హించిన ప్రెస్ మీట్‌కి ముఖం చాటేశాయి.. పాపం ఈ రాజ‌కీయాలు ఏమీ తెలియ‌ని ఓ లోక‌ల్ టీవీ DCI ఉద్యోగుల ప్రెస్ మీట్‌ని ప్ర‌సారం చేయ‌గా., ఇప్పుడు అది సోష‌ల్ మీడియాలో వీర వైర‌ల్ అవుతోంది.. అదీ జ‌న‌సేనుడి చ‌ల‌వే..

Share This:

3,047 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 2 =