Home / జన సేన / పోరాట‌యోధుల క‌ల‌లు సాకారం కావాలి.. జ‌న‌సేనుడి తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ సందేశం..

పోరాట‌యోధుల క‌ల‌లు సాకారం కావాలి.. జ‌న‌సేనుడి తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ సందేశం..

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి నాలుగు వ‌సంతాలు పూర్త‌యిన సంద‌ర్భంగా యావ‌త్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ శుభాకాంక్ష‌లు తెలిపారు.. ఉత్త‌రాంధ్ర పోరాట యాత్ర‌లో ఉన్న జ‌న‌సేనాని., ఓ ప్ర‌క‌ట‌న ద్వారా త‌న సందేశాన్ని పంపారు.. కోట్ల మంది ఆశ‌య సాధ‌న ఫ‌లితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం నాలుగో ఆవిర్భావ దినోత్స‌వ సంబ‌రాలు చేసుకుంటున్న శుభ‌త‌రుణంలో తెలంగాణ ప్ర‌జ‌ల‌కి శుభాకాంక్ష‌లు తెలిపారు.. ఆరున్న‌ర ద‌శాబ్దాల పోరాటంతో సిద్ధించిన ఈ రాష్ట్రం సుసంప‌న్నం కావాలంటే ఆంద‌రూ క‌ల‌సిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సూచించారు.. వంద‌ల మంది పోరాట యోధులు త‌మ ప్రాణాల్ని తృణ‌ప్రాయంగా త్యాగం చేసి తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరిపోశార‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.. ఆ వీరుల త్యాగాల‌ను ఎల్ల‌వేళ‌లా గుర్తు చేసుకుంటూ వారి క‌ల‌ల‌ని సాకారం చేయాల్సిన బాధ్య‌త పాల‌కుల‌పై ఉంద‌న్నారు.. తెలంగాణ రాష్ట్రం పాడిపంట‌ల్లో, ప‌రిశ్ర‌మ‌ల్లో ఉపాధి, ఉద్యోగ క‌ల్ప‌న‌లో ముందుకి వెళ్తూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు స‌మాన అభివృద్ది సాధించాల‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆకాంక్షించారు..

Share This:

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేన పార్టీ నూత‌న కార్యాల‌యం ప్రారంభం.. ఇక్క‌డి నుంచే పాల‌నా వ్య‌వ‌హారాలు..

జ‌న‌సేన పార్టీ ప‌రిపాల‌నా కార్యాల‌యం కొత్త భ‌వ‌నానికి మారింది.. హైద‌రాబాద్ మాదాపూర్‌లోని ఓ భ‌వంతిలో నూత‌న కార్యాల‌యం ప్రారంభ‌మైంది.. శుక్ర‌వారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × 3 =

%d bloggers like this: