Home / సేన సేవ / పోరాడండి.. సాధించండి.. నేను.. నాతో పాటు జ‌న‌సేన అండ‌గా ఉంటాము..

పోరాడండి.. సాధించండి.. నేను.. నాతో పాటు జ‌న‌సేన అండ‌గా ఉంటాము..

పోరాడితే పోయేది లేదు బానిస సంకెళ్లు మిన‌హా అన్న మ‌హాక‌వి శ్రీశ్రీ.. అమ్ముల‌పొది నుంచి జాలువారిన విప్ల‌వ క‌విత్వం అక్క‌డ ప్ర‌స్థావ‌నార్హం.. స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు పోరాటం చేయాలి.. విజ‌యం సాధించాలి.. మ‌ధ్య‌లో ముళ్లు, పొద‌ల్ని తాత్కాలిక అడ్డంకిలుగా మాత్ర‌మే భావించాలి.. ఇది జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ థియ‌రీ.. ఆయ‌న మాట‌ల్లో అస‌లే చీక‌టి., పైగా గాడాంధ‌కారం.. రోడ్డేమో గోతులు., అయినా గుండెల నిండా ధైర్యం ఉంది.. అని నిత్యం చెప్పే జ‌న‌సేనుడు., ఇటీవ‌ల తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న ఆత్మ‌హ‌త్య‌ల‌పై స్పందించారు..

బ‌లిదానాలు బాధాక‌ర‌మంటూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన ఆయ‌న‌., స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు దానిపై పోరాడాల‌ని సూచించారు.. పోరాడి సాధించుకోవాల‌ని పిలుపు నిచ్చారు.. ఆ క్ర‌మంలో తాను., జ‌న‌సేన అండ‌గా ఉంటామంటూ ప్ర‌తి ఒక్క‌రికీ భ‌రోసా ఇచ్చారు..

ఇక ఓయూలో విద్యార్ధి, విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఉద్యోగి మ‌ర‌ణాలు ఆయ‌న్ని క‌ల‌చివేయ‌గా., ఉద్యోగి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు జ‌న‌సేనాని స్వ‌యంగా బ‌య‌లుదేరారు.. ఇక ఓయూ మృతుడు ముర‌ళీ ప‌రిస్థితి ఏంటా అనుకుంటున్నారా.. అత‌ని వ్య‌వ‌హారాన్ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సీరియ‌స్‌గానే తీసుకున్నారు.. ప్ర‌స్తుతం ఓయూలో పోలీస్ ఆంక్ష‌లు త‌న ప‌ర్య‌ట‌న‌కు అడ్డంకి అయ్యాయంటూ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.. పోలీస్ ఆంక్ష‌లు స‌డ‌లించాక స్వ‌యంగా వెళ్లి వారి కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తాన‌ని తెలిపారు.. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ముర‌ళీ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు.. యువ‌త‌లో రాజ‌కీయ ప‌క్షాలు ఆశ‌లు రేకెత్తించి., వాటిని అమ‌లు చేయ‌క‌పోవ‌డ‌మే ఇలాంటి దుష్ప‌రిణామాల‌కి కార‌ణ‌మ‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రిచారు..

యువ‌త నిరాశ‌, నిర్వేదానికి దూరంగా ఉండాల‌న్నారు.. మీ విలువైన ప్రాణాలు మీ త‌ల్లిదండ్రుల‌కి క‌డుపు శోకాన్ని మిగులుస్తాయ‌న్నారు.. ఇచ్చిన హామీలు అమ‌లు చేయడం ప్ర‌భుత్వాల విధి అని ప‌వ‌న్ గుర్తు చేశారు.. ఇలాంటి త‌ప్పిదాలు జ‌ర‌గ‌కుండా చూడాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌న్నారు..

Share This:

870 views

About Syamkumar Lebaka

Check Also

తిత్లీ బాధితుల‌కి జ‌న‌సేన ఊర‌ట‌.. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో చురుగ్గా..

చేతిలో అధికారం లేదు.. చేతినిండా డ‌బ్బు లేదు.. కానీ చేయాల‌న్న మ‌న‌సు మాత్రం ఉంది.. నాయ‌కుడు అందించిన స్ఫూర్తి గుండెల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × four =