Home / జన సేన / పోలింగ్‌, రీ పోలింగ్ ముగిశాయి.. పోస్ట‌ల్ బ్యాలెట్ మాత్రం ఇంకా తెరిచే ఉంది..

పోలింగ్‌, రీ పోలింగ్ ముగిశాయి.. పోస్ట‌ల్ బ్యాలెట్ మాత్రం ఇంకా తెరిచే ఉంది..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోరు ఏప్రిల్ 11న ముగిసిన పోలింగ్‌తో పూర్త‌యిపోయింద‌ని పార్టీలు లెక్క‌లు వేసుకునే ప‌నిలో ఉన్నాయి.. అయితే పోలింగ్‌, రీ పోలింగ్‌తో ఓట్ల ప్ర‌క్రియ ముగిసిపోలేదు.. అభ్య‌ర్ధుల గెలుపు ఓట‌ముల‌ను నిర్ధేశించే స‌మ‌యం కౌంటింగ్‌కు ఒక రోజు ముందు వ‌ర‌కు అంటే మే 22 వ‌ర‌కు ఉంది.. బ‌రిలో ఉన్న అభ్య‌ర్ధుల‌కు ప్ర‌తి ఓటు కీల‌క‌మే.. ఒక్క ఓటు విజ‌యాన్ని దూరం చేసే అవ‌కాశాలు కూడా లేక‌పోలేదు.. అయితే పోలింగ్ ముగిసిపోయాక‌., ఈ సోదంతా ఎందుకు అనుకుంటున్నారా..? పోలింగ్ అయితే ముగిసింది గానీ, పోస్ట‌ల్ బ్యాలెట్ ఇంకా తెరిచే ఉంది.. ఒక్కో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి సుమారు రెండు వేల నుంచి ఆరు వేల వ‌ర‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు ఉంటాయి.. లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి అయితే ఈ సంఖ్య 15 వేల‌కు పై మాటే.. పోస్ట‌ల్ బ్యాలెట్ అంటే ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో భాగ‌స్వాములుగా ఉన్న ఉద్యోగుల ఓట్లు అన్న మాట‌.. పోలింగ్ సంద‌ర్భంగా విధులు నిర్వ‌హించేందుకు ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లే ప్ర‌భుత్వ ఉద్యోగులు.. అంటే టీచ‌ర్లు, రెవెన్యూ యంత్రాంగం త‌దిత‌ర సిబ్బంది.. త‌మ సొంత ఊళ్ల‌లో పోలింగ్ రోజు ఓటు హ‌క్కు వినియోగించుకునే అవ‌కాశం ఉండ‌దు.. వీరు ఆ హ‌క్కును పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునే అవ‌కాశం ఉంటుంది.. ఈ పోస్టల్ బ్యాలెట్‌ను నేరుగా త‌మ ప్రాంతాల్లో ఉన్న త‌హ‌సీల్దార్ కార్యాల‌యాల వ‌ద్ద ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్కుల్లో గానీ, పోస్ట్ ద్వారా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌చ్చు.. అయితే పోలింగ్‌కు ముందు నుంచి మొద‌ల‌య్యే ఈ పోస్ట‌ల్ బ్యాలెట్ ప్ర‌క్రియ పోలింగ్ ముగిశాక కూడా కొన‌సాగుతుంది.. కౌంటింగ్‌కు ఒక రోజు ముందు వ‌ర‌కు ఈ పోస్ట‌ల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకోవ‌చ్చు.. రెండు వేల‌లోపు మెజారిటీ ఉన్న స్థానాల్లో ఈ పోస్ట‌ల్ బ్యాలెట్ విజ‌యాన్ని తారు మారు చేసే అవ‌కాశాలు కూడా లేక‌పోలేదు..

అందుకే ప్ర‌తి జ‌న‌సేన కార్య‌క‌ర్త చివ‌రి రోజు వ‌ర‌కు.. చివ‌రి ఓటు వ‌ర‌కు గాజుగ్లాసు ఖాతాలో చేరేలా ప‌ని చేయాల‌ని పార్టీ కోరుతోంది.. ఈ పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు ఎమ్మెల్యే, ఎంపి అభ్య‌ర్ధుల‌కు విడివిడిగా వేయాల్సి ఉంటుంది.. ఎమ్మెల్యే అభ్య‌ర్ధికి వేసే ఓటు పింక్ క‌ల‌ర్ క‌వ‌ర్‌లోనూ, ఎంపి అభ్య‌ర్ధికి వేసే ఓటు గ్రీన్ క‌ల‌ర్ క‌వ‌ర్‌లోనూ పెట్టి గ‌మ్ అతికించి బ్యాలెట్‌లో గానీ, పోస్ట్ ద్వారా గాని పంపాల్సి ఉంటుంది.. కౌంటింగ్ రోజు ముందుగా ఈ పోస్ట‌ల్ బ్యాలెట్‌నే లెక్కిస్తారు.. జ‌న‌సేన పార్టీకి ఉద్యోగుల నుంచి విప‌రీతంగా మ‌ద్ద‌తు ల‌భించింద‌న్న వార్త‌ల నేప‌ధ్యంలో, ప‌లు నియోక‌వ‌ర్గాల్లో వంద‌ల సంఖ్య‌లో పోస్ట‌ల్ బ్యాలెట్ ఇప్ప‌టికీ వినియోగించుకోవాల్సి ఉంది.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ప్ర‌తి ఉద్యోగ‌స్థుడి ఇంటికీ వెళ్లి మ‌రీ పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా ఓటు హ‌క్కు వినియోగించుకున్నారో లేదో అడిగి తెలుసుకుని, ఒక వేళ ఎవ‌రైనా పోస్ట‌ల్ బ్యాలెట్ పంపాల్సి ఉంటే., అవి పంపించ‌డం ద్వారా ఓటు హ‌క్కు వినియోగించుకునేలా చూడాలి.. 2014లో ఓ అభ్య‌ర్ధి కేవ‌లం 12 ఓట్ల తేడాతో ప‌రాజ‌యం కొని తెచ్చుకున్న సంద‌ర్భం ఉంది.. అంతే కాదు పీఆర్పీ స‌మ‌యంలో కూడా అతి త‌క్కువ మెజారిటీతో 40కి పైగా సీట్లు ప్ర‌త్య‌ర్ధుల‌కు స‌మ‌ర్పించుకోవాల్సి వ‌చ్చింది.. ఈ పోస్ట‌ల్ బ్యాలెట్ మీద దృష్టి సారిస్తే బ‌హూశా అలాంటి ప‌రిస్థితి వ‌చ్చి ఉండేది కాదు..

గ్రామ, మండ‌ల, నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ప‌ని చేస్తున్న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు త‌మ త‌మ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు పోస్ట‌ల్ బ్యాలెట్ వినియోగించుకున్నారో లేదో చెక్ చేసి, ఆ ఓటు జ‌న‌సేన ఖాతాలో చేరేలా చ‌ర్య‌లు తీసుకోవాలి.. మ‌రో ఐదు రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది.. ఐదేళ్ల క‌ష్టాన్ని చేజారనీయ‌కుండా జాగ్ర‌త్త ప‌డండి.. మే 23 మ‌న‌దే అవుతుంది..

Share This:

970 views

About Syamkumar Lebaka

Check Also

ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్‌ల‌ను ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌

పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మావేశాల అనంత‌రం కృష్ణా జిల్లాకి సంబంధించి రెండు పార్ల‌మెంట్ సెగ్మెంట్‌ల ప‌రిధిలోని ఆరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌ఛార్జ్‌ల‌ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × 4 =