Home / జన సేన / పోల‌వ‌రం నిర్మాణాన్ని ప‌రిశీలించిన జ‌న‌సేనాని.. నిర్వాసితుల కోసం గ‌ళం..

పోల‌వ‌రం నిర్మాణాన్ని ప‌రిశీలించిన జ‌న‌సేనాని.. నిర్వాసితుల కోసం గ‌ళం..

పోల‌వ‌రం గోల ర‌గిలిన వేళ‌., ప్రాజెక్టు ప‌నులు ముందుకా., వెన‌క్కా అన్న మీమాంస మ‌ధ్య జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రిశీలించారు.. కోస్తా జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న‌., ప‌నులు జ‌రుగుతున్న తీరుని పరిశీలించేందుకు అక్క‌డికి వెళ్లారు.. డ్యాం పైన‌., కాప‌ర్ డ్యాం నిర్మాణానికి సంబంధి అనుమానం ఉన్న ప్ర‌తి అంశాన్ని ఆయ‌న త‌నిఖీలు జ‌రిపి మ‌రీ అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు.. శిభిరాల్లోని నిర్వాసితుల్ని ప‌లుక‌రించారు.. హిల్ వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టుకి సంబంధించిన అంశాల‌ను ప‌రి శీలించారు.. ప్రాజెక్టు ప‌రిశీల‌న ఒక్క రోజులో పూర్త‌య్యే ప‌ని కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. ఖ‌ర్చు., వివ‌రాల‌తో శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు..

అనంత‌రం జ‌రిగిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ., ప్రాజెక్టు పనుల్ని ద‌గ్గ‌రుండి మ‌రీ చూడాల‌ని ఉందంటూ మ‌న‌సులో మాట‌ను భ‌య‌ట‌పెట్టారు.. ప్ర‌తి అంశాన్ని తెలుకోవాల‌న్న కోరిక ఉన్నా ప‌రిస్థితులు అనుకూలిండం లేద‌న్నారు.. ప‌నుల‌న్నీ ద‌గ్గ‌రుండి చూడాల‌న్న కోరిక క‌లిగినా., సెక్యూరిటీ సంబంధిత ఇబ్బందుల నేప‌ధ్యంలో వెన‌క్కి మ‌ర‌ల‌డం త‌ప్ప‌ని ప‌రిస్థితి ఉంద‌న్నారు..

త‌న మ‌న‌సుకి కిందికి వెళ్లి చూడాల‌న్న కోరిక ఉన్నా., అభిమానులు ఎక్కువ‌గా ఉండ‌డంతో., పోలీసులు వారించిన‌ట్టు తెలిపారు.. నిర్వాసితులు, పున‌రావాసం అనే అంశాన్ని కూడా జ‌న‌సేన అధినేత ప‌రిశీలించారు.. మ‌రోసారి తాను పోల‌వ‌రం వ‌చ్చే నాటికి పున‌రావాస చ‌ర్య‌లు మెరుగ్గా ఉండాలని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాంక్షించారు..

ఇళ్లు, భూములు కోల్పోయిన ప్ర‌తి ఒక్క‌రికీ అండ‌గా నిలుస్తాన‌ని తేల్చి చెప్పారు.. కేంద్రం లెక్క‌ల్లో33 వేల కోట్ల వ్య‌వ‌సాయ నిధులు ఏమ‌య్యాయ‌ని ప్ర‌శ్నించారు., ఆ మొత్తం ఆ డబ్బు ఏ నాయ‌కుడి వ‌ద్ద‌కు వెళ్లినా్టు తెలిసినా పోరాటం చేస్తూనే ఉంటామ‌న్నారు.. తాను ఏ పార్టీకీ వ్య‌తిరేకం కాద‌ని ., ప్ర‌జా సంక్షేమ‌మే ధ్యేయంగా శాంతియుత పోరాటం చేస్తున్నాన‌న్న ఆయ‌న‌., ఇక నిత్యం ప్ర‌జ‌ల్లోనే తిరిగేదంటూ హాయీ
ఇళ్లు, భూములు కోల్పోతున్న వారికి తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. రూ. 33 వేల కోట్లను నిర్వాసితులకు ప్రకటించినా, ఆ డబ్బు తమ వద్దకు రాలేదని బాధితులు చెప్పడంతో, ఆ డబ్బు ఏ నాయకుడి వద్దకు వెళ్లినట్టు తెలిసినా తాను పోరాడుతానని అన్నారు.. విశాఖ టూ పోల‌వ‌రం వ‌యా రాజ‌మండ్రి ఆయ‌న ఇంటెన్ష‌న్ ఏంటో ఖ‌చ్చితంగా చెప్పేశారు.. తాను ఎవ‌రి ప‌క్ష‌మూ కాదు., కేవ‌లం ప్ర‌జాప‌క్ష‌మేన‌ని తేల్చేశారు.. ప్ర‌భుత్వాలు కూడా స‌హేతుక‌మైన జ‌న‌సేనాని డిమాండ్స్‌కి స్పందిస్తున్నాయి..

Share This:

721 views

About Syamkumar Lebaka

Check Also

డ‌ల్లాస్‌లో ప్ర‌వాస‌గ‌ర్జ‌నకి జ‌న‌సేన కీ నేత‌ల కిక్‌. అమెరికా అదిరిప‌డే రీతిలో స‌భ ఉండాల‌ని పిలుపు.

డ‌ల్లాస్ వేదిక‌గా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన జ‌న‌సేన ప్ర‌వాస గ‌ర్జ‌న అమెరికా చ‌రిత్ర‌లోనే న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న స్థాయిలో ఉండాల‌ని పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 + eleven =