Home / జన సేన / పోల‌వ‌రం వ‌ద్ద‌ గోదావ‌రి న‌దిని ప‌రిశీలించిన జ‌న‌సేన అధినేత‌.. రూపురేఖ‌ల‌పై అధ్య‌య‌నం..

పోల‌వ‌రం వ‌ద్ద‌ గోదావ‌రి న‌దిని ప‌రిశీలించిన జ‌న‌సేన అధినేత‌.. రూపురేఖ‌ల‌పై అధ్య‌య‌నం..

స్వ‌త‌హాగా ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుడు అయిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., పోరాట‌యాత్ర‌లో భాగంగా పోల‌వ‌రం వ‌ద్ద గోదావ‌రి న‌దిపై అధ్య‌య‌నం చేశారు. ఆదివారం సాయంత్రం, సోమ‌వారం ఉద‌యం రెండు ప‌ర్యాయాలు గోదావ‌రిలో ఆయ‌న ప‌డ‌వ మీద ప్ర‌యానం చేశారు.. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం త‌ర్వాత జీవ‌న‌ది రూపు రేఖ‌లు ఎలా మార‌నున్నాయి.. అనే అంశంపై జ‌న‌సేనాని దృష్టి సారించారు.. ముఖ్యంగా ప‌డ‌వ ప్ర‌యాణంలో ప్ర‌వాహ ఉదృతిని ఆయ‌న ప‌రిశీలించారు.. ప‌డ‌వ నుంచే ప‌ట్టిసీమ ప్రాజెక్ట్‌ని ప‌రిశీలించిన ప‌వ‌న్‌., ప్రాజెక్టు నిర్మాణం, ప‌ని తీరుల‌ని అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం వేళ‌లో ప్ర‌వాహ ఉదృతికి, ఉద‌యం వేళ‌లో ఉండే ప్ర‌వాహ ఉదృతికి తేడాని ఆస‌క్తిగా గ‌మ‌నించారు..

గోదావ‌రి మ‌ధ్య‌లోని ఇసుక తెన్నెల మీద కాసేపు న‌డ‌చిన జ‌న‌సేన అధినేత‌, అక్క‌డ ఇసుక‌ని ఆస‌క్తిగా ప‌రిశీలించారు. ఏరు మ‌ధ్య‌లోని సువిశాల‌మైన ఇసుక తెన్నెపై దాదాపు కీలోమీట‌రు పొడుగున ఆయ‌న న‌డ‌క సాగింది.. ముఖ్యంగా ప‌రివాహ‌క ప్రాంతంలో ఉన్న ఇసుక‌, మ‌ధ్య‌లో ఉన్న ఇసుకకి తేడాని ఆయ‌న ప‌రిశీలించారు.. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న నేప‌ధ్యంలో., ప్ర‌స్తుతం గోదావ‌రి ఎలా ఉంది..? ప్రాజెక్టు పూర్త‌య్యాక గోదావ‌రి రూపు రేఖ‌లు ఎలా మార‌నున్నాయి..? అనే అంశాల‌పై లోతుగా అధ్య‌య‌నం చేశారు..

స‌హ‌జ ప్ర‌వాహాన్ని అడ్డుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చే లాభ‌న‌ష్టాల‌ను కూడా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్థానికుల‌ని అడిగి తెలుసుకున్నారు.. ఇసుక దోపిడి అంశాన్ని కూడా స్థానిక నాయ‌కుల‌ని అడిగి తెలుసుకున్నారు.. పోల‌వ‌రం నిర్మాణం పూర్త‌య్యి., ప్ర‌వాహానికి అడ్డుక‌ట్ట వేస్తే, ఇసుక దోపిడి మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌న్నా అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.. ఇలాంటి ప‌రిస్థితులు ప‌ర్యావ‌ర‌ణానికి ప్ర‌మాదక‌రంగా ప‌రిణ‌మించే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న ఆందోళ‌న‌ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.. ఇసుక దోపిడి వ‌ల్ల భూగ‌ర్బ జ‌లాల స్థాయిలు ప‌డిపోవ‌డంతో పాటు వ‌ర‌ద‌ల స‌మ‌యంలో న‌దీ ప్ర‌వాహాలు నియంత్ర‌ణ కోల్పోయే ప్ర‌మాదం కూడా ఆయ‌న వ‌ద్ద ప్ర‌స్థావ‌న‌కి వ‌చ్చింది.. గోదావ‌రి పాయ‌ల్లో ప‌డ‌వ ప్ర‌యాణంతో జ‌న‌సేన అధినేత ఇంకా ఎన్నో అంశాల‌పై అధ్య‌య‌నం చేశారు..

Share This:

1,275 views

About Syamkumar Lebaka

Check Also

బ‌ల‌స‌ల‌రేవు వంతెన సాధ‌న‌కు జ‌న‌సేనాని మ‌ద్ద‌తు.. ఇంత‌కీ ఆ వంతెన స్టోరీ ఏంటంటే..?

బ‌ల‌స‌ల‌రేవు వంతెన‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌తో ప్ర‌పంచం దృష్టికి వ‌చ్చిన మ‌రో అప‌రిష్కృత‌ ప్ర‌జా స‌మ‌స్య‌.. శ్రీకాకుళం జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen − 1 =