Home / ఎడిటోరియల్స్ / ప్రజా సింహం వేట మొద‌లుపెట్టింది.. రాజ‌కీయ వంచ‌కులారా రోజులు లెక్క‌పెట్టుకోండిక‌..

ప్రజా సింహం వేట మొద‌లుపెట్టింది.. రాజ‌కీయ వంచ‌కులారా రోజులు లెక్క‌పెట్టుకోండిక‌..

రాజ‌కీయం అంటే ఏంటి..? ఓట్లు.. సీట్ల‌.. నోట్లు ఖ‌ర్చుపెట్ట‌డ‌మా..? ప‌విత్ర దేవాల‌యం లాంటి చ‌ట్ట‌స‌భ‌లో త‌న్నుకోవ‌డ‌మా..? ప్ర‌తి నిత్యం ప్ర‌జ‌ల గురించి ఆలోచించే ఓ నాయ‌కుడి దృష్టిలో మాత్రం రాజ‌కీయం అంటే ప్ర‌జా సేవ‌.. ప్ర‌జ‌ల‌కి ఏ క‌ష్టం వ‌చ్చినా., వారి ద‌గ్గ‌రికి వెళ్లి., స‌మ‌స్య‌ను తెలుసుకుని., అధ్య‌య‌నం చేసి., దానికి ప‌రిష్కారం వెత‌క‌డం.. ఆ ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్య‌లు తీసుకునేలా ప్ర‌భుత్వాల‌పై, పాల‌కుల‌పై ఒత్తిడి తీసుకురావ‌డం.. అలాంటి రాజ‌కీయ నాయ‌కుడు దేశంలో ఎక్క‌డైనా ఉన్నాడా..? ఒక్క‌డైనా ఉన్నాడా..? అని జ‌నం వెతికిన‌ప్పుడు., వారికి దొరికిన ఏకైక స‌మాధానం జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. అవును ప్ర‌తి తెలుగు వాడు గ‌ర్వంగా చెప్పుకునే పేర‌ది.. ఎందుకంటే తాను ఒక్క‌డే కానీ., ఓ దేశం జెండాకి ఉన్నంత పొగ‌రు ఆయ‌న సొంతం.. రాజ‌కీయాల కోసం అడ్డ‌దిడ్డంగా డ‌బ్బులు సంపాదించ‌డు.. సినిమాల్లో న‌టించి వ‌చ్చిన డ‌బ్బుని ప్ర‌జ‌ల కోసం ఖ‌ర్చు చేస్తారు.. అదే రాజ‌కీయం అని ఆయ‌న న‌మ్ముతారు..

తాను ఎంచుకున్న మార్గంలో త‌ప్పు ఉంటే., త‌న ఈ నిర్ణ‌యం త‌ప్పు అని ప్ర‌జ‌ల ఎదుట త‌ల‌వంచే ధైర్యం ఉన్న ఏకైక నాయ‌కుడు కూడా జ‌న‌సేనుడే.. తాను ప‌ట్టిన కుందేటికి మూడేకాళ్ల‌ని వాధించే కుహ‌నా రాజ‌కీయ శ‌క్తుల ఆలోచ‌న‌ల‌కి ఏ మాత్రం అంద‌ని వాడు.. అంద‌రివాడు అయ‌న‌.. అవును గ‌తంలో ప్ర‌భుత్వాల‌కి మ‌ద్ద‌తు ప‌లికిన‌ప్పుడు., వారికి ఓట్లేయ‌మ‌ని చెప్పిన‌ప్పుడు.. ఆయ‌న‌కి తెలియ‌దు.. వారు ప్ర‌జ‌ల నెత్తిన చేతులు పెడ‌తార‌ని., నిర్ల‌క్ష్యంతో ప్ర‌జ‌ల ప్రాణాలు తీస్తార‌ని.. వారు చేసిన ప‌నికి మ‌ద్ద‌తిచ్చిన పాపానికి., ఆ పాపంలో త‌న‌కూ భాగం ఉంద‌ని ఒప్పుకున్న ధైర్య‌శాలి..

ఎప్పుడో క‌న‌బ‌డ‌తాడు.. ఏదో చెబుతాడు.. మ‌ళ్లీ వెళ్లి సినిమాలు తీసుకుంటాడు.. అని విమ‌ర్శిస్తారు.. కొంద‌రు.. కానీ ఎప్పుడో క‌న‌బ‌డినా., ఎన్ని స‌మ‌స్య‌లు ఆయ‌న క‌నుచూపుతో., నోటి మాట‌తో., ఒక ప్రెస్ నోట్‌తో ప‌రిష్కార‌మ‌య్యాయి.. అవుతూనే ఉన్నాయి.. ఇక ఆ ఛాన్స్ కూడా ఇవ్వ‌కుండా.. ఇక స‌మ‌స్య‌ల‌పై దండ‌యాత్ర‌కు జ‌న‌సేన నాయ‌కుడు జ‌నం మ‌ధ్య‌కు క‌దిలాడు.. మూడు విడ‌త‌ల యాత్ర‌లో భాగంగా., తొలి ప‌దం క‌దిపారు.. ప్ర‌కంప‌న‌లు రేపారు.. మ‌రో మూడు రోజులు యాత్ర మిగిలిఉంది.. ఇప్ప‌టికే విమ‌ర్శ‌కుల‌కి సైతం మ‌తి చెడిపోయింది..

ఉద‌య‌మే.. విశాఖ‌లో అడుగుపెట్టారు.. జ‌న సునామీ మ‌ధ్య ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ని దుయ్య‌బ‌ట్టేందుకు క‌దిలారు.. మొద‌లుపెట్ట‌డ‌మే., ప్ర‌స్థానం ఎక్క‌డ మొద‌లైందో., అక్క‌డే మొద‌లుపెట్టారు.. త‌న మాట‌పై న‌మ్మిక‌తో మీరు ఓట్లేసి గెలిపించిన ఎంపిలు, ఎమ్మెల్యేలు త‌ప్పించుకోవ‌చ్చు.. వారి కోసం ఓట్ల‌డిగిన తాను మాత్రం త‌ప్పించుకోన‌ని తేల్చి చెప్పారు.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన రోజు ఏ మాటైతే చెప్పారో., అదే ఇప్పుడూ చెబుతున్నారు.. మీరు ఓట్లేయండి.. మీ త‌రుపున నేత‌ల్ని నేను నిల‌దీస్తాను.. ఆ మాట‌కి క‌ట్టుబ‌డే., జ‌వాబుదారీ త‌నంతో., ప్ర‌జ‌ల ముందుకి వ‌చ్చారు..

డ్రెడ్జింగ్ కార్పోరేష‌న్ ప్ర‌యివేటీక‌ర‌ణ అంశంపై ప్ర‌శ్నించేందుకు వ‌చ్చిన ఆయ‌న‌.. ముక్కు సూటి ప్ర‌శ్న‌లు కేంద్రానికి వేశారు.. లాభాల్లో ఉన్న సంస్థ‌ని ప్ర‌యివేటు ప‌రం చేయాల‌ని చూస్తున్నారు.. ఎందుకు చేయ‌రాదో ప్ర‌ధానికి లేఖ రాస్తా..? ఎందుకు చేస్తున్నారో మీరు బ‌దులిస్తారా అంటూ విసిరిన ప్ర‌శ్న‌., హ‌స్తిన పెద్ద‌ల సీట్ల కింద ప్ర‌కంప‌న‌లు రేపింది.. జ‌నం జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా పోరాడుతున్న స‌మ‌యంలో., ఏ నాయ‌కుడూ ప్ర‌జ‌ల్ని ప‌ట్టించుకోవ‌డం లేదు.. కాబ‌ట్టి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇప్పుడున్న ఏ ఒక్క నాయ‌కుడికీ ఓట్ల‌డిగే హ‌క్కు లేదని ఢంకా భ‌జాయించారు.. ప్ర‌జ‌ల్ని, వారి క‌ష్టాల్ని ప‌ట్టించుకునే మీకు ఓట్ల‌డిగే హ‌క్కు ఉందా అంటూ నిల‌దీశారు.. ఇంత నేరుగా అడిగే ద‌మ్ము ఎవ‌రికి ఉంది.. ప్ర‌తి ప‌క్షం అంటే., అధికారంలో ఉన్న ప్ర‌త్య‌ర్ధిని తిట్ట‌డం కాదు.. ఉన్న స‌మ‌స్య‌ని ఎత్తిచూప‌డం.. దానికి ప‌రిష్కార మార్గాలు అన్వేషించి., ఎందుకు చేయ‌ర‌ని పాల‌కుల్ని నిల‌దీయ‌డం.. ఇదే ఆయ‌న‌కి తెలిసిన రాజ‌కీయం..

విశాఖ జ‌న‌సంద్ర‌మై ఎగిసిపడిన వేళ‌.. ఇంకో స్ప‌ష్ట‌త కూడా ఇచ్చారు.. ఏదైనా అడిగే ధైర్య నాకుంది.. భ‌యం లేదు.. కేవ‌లం ప్రాణం మాత్ర‌మే ఉంది.. మీ(ప్ర‌జ‌ల‌)కోసం జైలుకెళ్తా., దెబ్బ‌లు తింటా.. ర‌క్తం కారుస్త‌తా.. వెన‌క్కి మాత్రం త‌గ్గ‌ను.. ఇది హెచ్చ‌రికే.. తీవ్ర స్థాయిలో చేసిన హెచ్చ‌రికే.. ప్ర‌జ‌ల ఓట్ల‌తో గెలిచి., రెండు ప‌క్షాలు చేస్తున్న క‌ప‌ట రాజ‌కీయాల‌కు ఇది హెచ్చ‌రికే.. దీన్ని తేలిగ్గా తీసుకుంటే., జ‌న‌సేన అధినేత బ‌లం తెలుసుకునే రోజు., ప్ర‌త్య‌క్షంగా వీక్షించే రోజు ఎదురొస్తుంది.. అది ఎదురొచ్చిన రోజు ఖ‌చ్చితంగా తెలుస్తుంది.. చేసిన త‌ప్పేంటో..

పోటీ చేస్తే గెలిచే స‌త్తా ఉన్నా., ఎందుకు పోటీ చేయ‌లేదు..? ఎందుకు ఇత‌ర పార్టీల‌కి మ‌ద్ద‌తిచ్చాను..? అన్న ప్ర‌శ్న‌ల‌తో ఇచ్చిన బ‌దులు., మ‌రో చెగువేరా పుట్టాడా అన్న‌ట్టు ఉన్నాయి.. సిఎం..సిఎం అన్న నినాదాలు., అభిమానుల‌కి ఆనందాన్నిచ్చినా., తాను మాత్రం ప‌ద‌వుల కోసం రాజ‌కీయాల్లోకి రాలేద‌ని తేల్చేశారు.. తన అంత‌ర్గ‌తాన్ని బ‌య‌ట‌పెట్టారు..

డ్రెడ్జింగ్ కార్పోరేష‌న్ ఉద్యోగి ఆత్మ‌హ‌త్య విష‌యం వ‌చ్చిన‌ప్పుడు., ఎవ‌రో చేసిన త‌ప్పుకి ఎవ‌రో శిక్ష అనుభ‌విస్తున్నార‌న్నారు.. ఇది స‌రైన విధానమా..? ఇలా జ‌ర‌గొచ్చా..? అంటూ దిక్కులు పిక్క‌టిల్లే స్థాయిలో ప్ర‌శ్న‌ల వర్షం కురిపించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., డిసిఐ ఉద్యోగుల త‌రుపున ప్ర‌ధానికి రాసే లేఖ‌కి స్పందించ‌కుంటే., బీజేపీ ప‌త‌నం విశాఖ నుంచే మొద‌ల‌వుతుంద‌ని హెచ్చ‌రిక చేశారు.. ప్ర‌జ‌ల కోసం క‌దిలిన నాయ‌కుడు., ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న కోసం క‌దిలిన నాయ‌కుడు., తొలి పంజా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై విసిరారు.. లొంగితేనే రాష్ట్రం వైపు తొంగిచూసే ప‌రిస్థితి అయినా ఉంటుంది.. ప్ర‌జ‌ల కోసం చేస్తున్న వేట‌లో ఆ పంజా రుచి చూసేది క‌మ‌ల‌మే..

Share This:

1,393 views

About Syamkumar Lebaka

Check Also

ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలే టార్గెట్‌.. ఓట్లు వేయ‌మ‌ని అడిగిన చోటే నిల‌దీస్తున్న జ‌న‌సేనాని..

అడుగ‌డుగునా వైఫ‌ల్యాలు.. ప్ర‌జ‌ల్ని మోసం చేస్తూ.. దోపిడీ చేస్తున్న పాల‌నా వ్య‌వ‌స్థ‌.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగిన ప్ర‌తి సారీ అదే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 2 =