Home / జన సేన / ప్ర‌జ‌ల‌కి ఇబ్బంది క‌ల‌గ‌ని రీతిలో శాంతియుత నిర‌స‌న తెల‌పండి-పార్టీ శ్రేణుల‌కి జ‌న‌సేనుడి పిలుపు..

ప్ర‌జ‌ల‌కి ఇబ్బంది క‌ల‌గ‌ని రీతిలో శాంతియుత నిర‌స‌న తెల‌పండి-పార్టీ శ్రేణుల‌కి జ‌న‌సేనుడి పిలుపు..

కేంద్ర బ‌డ్జెట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి నిధుల కేటాయింపు విష‌యంలో అన్యాయం జ‌రిగింద‌న్న కార‌ణంగా., అందుకు నిర‌స‌న‌గా వివిధ రాజ‌కీయ ప‌క్షాలు గురువారం ఏపీ బంద్‌కు పిలుపునిచ్చాయి.. ఈ బంద్‌కు జ‌న‌సేన పార్టీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.. బంద్‌లు, నిర‌స‌న‌ల‌కి తాను వ్య‌తిరేకంగా కాద‌ని., త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మాత్ర‌మే చేయాల‌ని మీడియా స‌మావేశంలో తెలిపిన ఆయ‌న‌., గురువారం జ‌రిగే బంద్ ప్ర‌త్యేక ప‌రిస్థితులు ఉన్న నేప‌ధ్యంలో శాంతియుత పోరాటానికి జ‌న‌సేన పార్టీ త‌రుపున మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు..

అనంత‌రం పార్టీ కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న రూపంలోనూ, కార్య‌క‌ర్త‌ల‌కి మెస్సేజ్ రూపంలోనూ బంద్‌కి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన విష‌యాన్ని తెలియ‌జేశారు.. రాష్ట్ర ప్ర‌జ‌ల అసంతృప్తి ఆవేద‌న‌ను ప్ర‌భుత్వాల‌కు తెల‌ప‌డానికి ఉద్దేశించిన ఈ బంద్‌లో ప్ర‌జ‌ల‌కి ఇబ్బంది క‌ల‌గ‌ని రీతిలో శాంతియుతంగా చేప‌ట్టాల‌ని జ‌న‌సైనికుల‌కి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సూచించారు..

గ్రామాలు, మండ‌ల కేంద్రాలు, జిల్లా స్థాయిల్లో ప్ర‌త్యేక ప‌రిస్థితుల నేప‌ధ్యంలో జ‌రుగుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ బంద్‌కి జ‌న‌సేన పార్టీ శ్రేణులు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌వ‌చ్చు.. అయితే జ‌న‌సైనికుల నిర‌స‌న వ‌ల్ల ప్ర‌జ‌లు ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌రాదు.. కేవ‌లం శాంతియుత నిర‌స‌న మాత్ర‌మే తెలపాల‌న్న‌ది జ‌న‌సేన పార్టీ అధినేత ఉద్దేశం.. ఒక‌వేళ బంద్‌కి పిలుపునిచ్చిన మిగిలిన పార్టీల కార్య‌క‌ర్త‌లు ఎక్క‌డైనా దుందుడుకుగా ప్ర‌వ‌ర్తించినా., జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు మాత్రం సంయ‌మ‌నం పాటించాల్సిందిగా మ‌న‌వి.. ఏ సంద‌ర్బంలోనూ కోపావేశాల్ని ద‌రిచేర‌నీయ‌వ‌ద్దని మ‌న‌వి.. జ‌న‌సేన శ్రేణుల క్ర‌మ‌శిక్ష‌ణ మిగిలిన పార్టీల‌కి స్ఫూర్తిదాయ‌కంగా నిలిచేలా బంద్‌ని విజ‌య‌వంతం చేస్తార‌ని కోరుతున్నాం..

Share This:

About Syamkumar Lebaka

Check Also

ప‌లాస రోడ్ల‌పై పారిన ప‌చ్చ క‌న్నీరు.. ప్ర‌జా సేవ పాప‌మంటున్న తెలుగు త‌మ్ముళ్లు..

తెలుగు త‌మ్ముళ్లకి ప‌చ్చ కావ‌రం రాను రాను ముదిరిపోతోంది.. ఎన్నిక‌ల స‌మ‌యంలో నోటికి వ‌చ్చిన హామీల‌న్నీ ఇచ్చేసి, అధికారంలోకి వ‌చ్చాక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 + one =

%d bloggers like this: