Home / జన సేన / ప్ర‌తి అడుగులో హోదాని తాక‌ట్టుపెట్టారు.. ఇప్పుడు జ‌నం ముందు నాట‌కాలాడుతున్నారు-అవిశ్వాసంపై జ‌న‌సేనాని..

ప్ర‌తి అడుగులో హోదాని తాక‌ట్టుపెట్టారు.. ఇప్పుడు జ‌నం ముందు నాట‌కాలాడుతున్నారు-అవిశ్వాసంపై జ‌న‌సేనాని..

పార్ల‌మెంటులో అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఘాటుగా స్పందించారు.. వ్య‌క్తిగ‌త లాభాల కోసం మూడున్న‌ర ఏళ్లు స్పెష‌ల్ కేట‌గిరి స్టేట‌స్‌కి తూట్లు పొడిచి ఈ రోజు వ్య‌ర్ధ‌మైన ప్ర‌సంగాలు చేసి ప్ర‌యోజం ఏమిటంటూ టీడీపీ నాయ‌క‌త్వంపై విరుచుకుప‌డ్డారు… ద‌శాబ్దాల అనుభ‌వం ఉన్న నాయ‌కుల‌కి కేంద్రం వంచ‌న తెలియ‌టానికి ఇన్ని సంవ‌త్స‌రాలు ప‌ట్టిందంటే మేము న‌మ్మాలా..? అంటూ ప‌వ‌న్ నిల‌దీశారు..

కొత్త‌గా వ‌చ్చిన జ‌న‌సేన పార్టీ కేంద్రం ”స్పెష‌ల్ కేట‌గిరీ స్టేట‌స్” ఇవ్వ‌దు అని గ్ర‌హించి తిరుప‌తి స‌భ‌లో రెండున్న‌రేళ్ల క్రితం చెబితే., ఆ రోజు బీజేపీని వెన‌కేసుకొచ్చార‌ని జ‌న‌సేనాని ఆరోపించారు.. అంద‌రూ గ‌గ్గొలు పెడుతున్నా పాచిపోయిన ల‌డ్లు లాంటి స్పెష‌ల్ ప్యాకేజీ తీసుకుని క‌ళ్ల‌కి అద్దుకుని మ‌రీ తీసుకున్న వారు.. మమ్మ‌ల్ని తిట్టి అనుభ‌వ‌రాహిత్యం అన్న విమ‌ర్శ‌లు చేసిన వారు, బీజేపీ నాయ‌కుల‌కి స‌న్మానాలు చేసిన వారు… ఈ రోజున జ‌రిగిన మోసం తెలుసుకోవ‌డానికి ఇన్ని సంవ‌త్స‌రాలు ప‌ట్టిందంటే మేము న‌మ్మాలా..? ‘AP ప్ర‌జ‌లు- టీడీపీ నాయ‌కుల‌కి ఎలా క‌నిపిస్తున్నారు’..? అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా నిల‌దీశారు..

స్వ‌లాభం కోసం ప్ర‌త్యేక హోదా విష‌యంలో తెలుగుదేశం పార్టీ కేంద్రంతో రాజీ ప‌డి, ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని కోల్పోయింద‌ని ప‌వ‌న్ మండిప‌డ్డారు.. టీడీపీ నేత‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకునే అవ‌కాశాన్ని కోల్పోయార‌న్నారు.. ప్ర‌తి అడుగులో ప్ర‌త్యేక హోదాని బీజేపీ స‌ర్కారుకి తాక‌ట్టు పెట్టి, టీడీపీ ఇప్పుడు కంటి తుడుపు చ‌ర్య‌లు చేప‌ట్టిందంటూ మండిప‌డ్డారు.. జ‌నాన్ని మోసం చేయ‌డానికి మ‌రోసారి రాజ‌కీయ డ్రామాలు మొద‌లు పెట్టార‌ని జ‌న‌సేన అధినేత ఎద్దేవా చేశారు..

Advertisement..

Share This:

1,108 views

About Syamkumar Lebaka

Check Also

క‌వాతు బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న కాదు.. బాధ్య‌త‌గా ఉండ‌మ‌ని హెచ్చ‌రిక‌-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీ క‌వాతు సూప‌ర్ స‌క్సెస్‌తో ఓ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతుంటే., జ‌న‌సేనాని మాత్రం త‌న బాధ్య‌త‌ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 + 8 =