Home / ఎడిటోరియల్స్ / ప్ర‌తి స‌మ‌స్య‌కీ ఆయ‌నే స‌మాధానం.. జ‌న‌సేనుడి ఖాతాలో మ‌రో విజ‌యం..

ప్ర‌తి స‌మ‌స్య‌కీ ఆయ‌నే స‌మాధానం.. జ‌న‌సేనుడి ఖాతాలో మ‌రో విజ‌యం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉన్న స‌మ‌స్య‌ల‌న్నీ క‌ట్ట‌గ‌ట్టుకుని జ‌న‌సేన పార్టీ ఆఫీస్‌కి చేరిపోతున్నాయి.. జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌మ స‌మ‌స్య‌పై నాలుగు మాట‌లు మాట్లాడితే చాలు.. ఇక మా స‌మ‌స్య తీరిన‌ట్టేన‌ని జ‌నం ఫిక్స్ అయిపోయారు.. కార‌ణం జ‌నం కోస‌మే పుట్టిన జ‌న‌సేనుడు., ఏ స‌మ‌స్య ముట్టుకున్నా., ఇట్టే ప‌రిష్కారం అయిపోతోంది.. ఆయ‌న చెప్పిన‌ట్టు నిజంగా మంత్ర‌దండ‌మే ఉందా అన్న అనుమానం కూడా వ‌స్తుంది.. అది కేవ‌లం స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే మంత్ర‌దండ‌మే.. ఆయ‌న చేసే ప‌నిలో నిబ‌ద్ద‌తే ఆయ‌న్ని విజ‌యాలకి కార‌ణం.. ఓ స‌మ‌స్య‌పై పోరాటం చేసేప్పుడు., దానికి ఖ‌చ్చితంగా రాజ‌కీయ ల‌బ్ది అనే ప‌దం జ‌త‌చేయ‌రాదు.. ప్ర‌జ‌ల‌కి మేలు జ‌రిగిందా లేదా..? అన్న‌ది మాత్ర‌మే చూడాలి.. ఇక స‌మ‌స్య ప‌రిష్కారానికి ఉన్న అవ‌కాశాల‌నూ ప‌రిశీలించాలి.. ప్ర‌జ‌ల ప‌క్షాన న్యాయం ఉంటే., స‌మ‌స్య‌కు ప‌రిష్కార మార్గం వెత‌కాలి.. దాన్ని ప్ర‌భుత్వం ముందు పెట్టి ప్ర‌శ్నించాలి.. అవునా.. జ‌న‌సేన అధినేత ఇంత క‌స‌ర‌త్తు చేస్తున్నారా..? అనుకుంటున్నారా.. అవునుమ‌రి.. ఓ స‌మ‌స్యను ఆయ‌న లేవ‌నెత్తారు అంటే ఖ‌చ్చితంగా దానికి ప‌రిష్కార‌మార్గం ఆయ‌న వ‌ద్ద ఉంద‌నే అర్ధం..

అందుకే ప్ర‌భుత్వాలు జ‌న‌సేనాని చెప్ప‌గానే చేసేస్తున్నాయి.. చేయ‌క‌పోతే ప్ర‌జా కోర్టులో ఆయ‌న వేసే ప్ర‌శ్న‌ల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.. తాజాగా జ‌న‌సేన అధినేత ఖాతాలో మ‌రో స‌మ‌స్యకు స‌మాధానం ల‌భించింది.. నిన్న‌గాక మొన్న అయ్యా మ‌మ్మ‌ల్ని రైతులుగా గుర్తించ‌డం లేదు అంటూ జ‌న‌సేన గ్యారేజ్‌కి వ‌చ్చిన క‌డియం న‌ర్స‌రీ పెంప‌కం దారుల స‌మ‌స్య తీరిపోయింది.. ప్ర‌భుత్వం వారిని రైతులుగా గుర్తించింది.. వారి ప్ర‌ధాన కోరిక ఉచిత విద్యుత్ అందించేందుకు ముందుకు వ‌చ్చింది.. అంతే కాదు రైతుల‌కి అందుతున్న రుణ‌మాఫి సౌక‌ర్యాన్ని కూడా అందించేందుకు ఓకే చెప్పేసింది.. నాలుగు రోజుల క్రితం తూర్పుగోదావ‌రి జిల్లా క‌డియం న‌ర్స‌రీ రైతులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని క‌ల‌సిన సంద‌ర్బంలో., త‌మ‌ని న‌ర్స‌రీ రైతుల‌గా కాక‌., వ్యాపార‌స్తులుగా చూస్తున్నార‌ని ., వివిధ డిపార్ట్‌మెంట్ల అధికారులు ఇబ్బంది పెడుతున్నార‌ని కోర‌గా.. వీరి స‌మ‌స్య‌పై ఆయ‌న సానుకూలంగా స్పందించారు..

వెంట‌నే పార్టీ ప‌రిపాల‌నా కార్యాల‌యం నుంచి ప్ర‌భుత్వానికి కొన్ని సూచ‌న‌లు చేశారు.. ఆసియాలోనే అతిపెద్ద న‌ర్స‌రీ హ‌బ్‌గా ఉన్న క‌డియం రైతుల‌కి ప్రోత్సాహ‌కాలు అందించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను జ‌న‌సేనాని గుర్తు చేశారు.. అక్క‌డ హార్టిక‌ల్చ‌ర్ యూనివ‌ర్శిటీ ఏర్పాటు చేయ‌డంతో పాటు ముందు వారిని రైతులుగా గుర్తించి., ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రైతుల‌కి అందుతున్న అన్ని ప్రోత్సాహ‌కాలు.. ఉచిత విద్యుత్‌, రుణ‌మాఫీ లాంటివి అందించాల‌ని డిమాండ్ చేశారు.. క‌డియం న‌ర్స‌రీ పెంప‌కందారుల కోరిక‌లో న్యాయం ఉంద‌ని ఆయ‌న గ‌ట్టిగా చెప్పారు..

రెండు రోజుల్లోనే విద్యుత్‌శాఖ సిఎండి నుంచి ఉచిత విద్యుత్‌కి సంబంధించిన ఉత్త‌ర్వులు విడుద‌ల అయ్యాయి.. ఇప్ప‌టికే స‌మ‌స్య‌ల చిట్టాతో జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం చుట్టూ తిరిగే వారి సంఖ్య పెరిగిపోయింది.. అంద‌రి నోటా ఒక‌టే మాట‌.. సామి నువ్వు గ‌ట్టిగా అనుకో సామి.. అయిపోద్ది.. ఇది మాట కాదు.. న‌మ్మ‌కం.. తెలుగు రాష్ట్రాల్లో జ‌న‌సేనానిపై జ‌నానికి నానాటికీ పెరుగుతున్న న‌మ్మ‌కం.. వారు స‌మ‌స్య‌లు తీసుకువ‌స్తున్నారు.. ఆయ‌న ప‌రిష్క‌రిస్తున్నారు.. మ‌రి అందులో త‌ప్పేముంది…

Share This:

2,746 views

About Syamkumar Lebaka

Check Also

డ‌ల్లాస్‌లో ప్ర‌వాస‌గ‌ర్జ‌నకి జ‌న‌సేన కీ నేత‌ల కిక్‌. అమెరికా అదిరిప‌డే రీతిలో స‌భ ఉండాల‌ని పిలుపు.

డ‌ల్లాస్ వేదిక‌గా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన జ‌న‌సేన ప్ర‌వాస గ‌ర్జ‌న అమెరికా చ‌రిత్ర‌లోనే న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న స్థాయిలో ఉండాల‌ని పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three + eight =