Home / జన సేన / ప్ర‌తీక్ష‌ణం ప్ర‌జాప‌క్ష‌మే జ‌న‌సేన భావ‌జాలం.. ప్ర‌జ‌ల‌కు కావ‌ల్సిందే విధానం.. మెగా ఫ్యాన్స్ మీట్‌లో ప‌వ‌న్‌..

ప్ర‌తీక్ష‌ణం ప్ర‌జాప‌క్ష‌మే జ‌న‌సేన భావ‌జాలం.. ప్ర‌జ‌ల‌కు కావ‌ల్సిందే విధానం.. మెగా ఫ్యాన్స్ మీట్‌లో ప‌వ‌న్‌..

 

జ‌న‌సేన పార్టీ చేరిక‌ల ఘ‌ట్టం విశాఖ నుంచి హైద‌రాబాద్‌కి చేరింది.. అక్క‌డ ప‌దుల సంఖ్య‌లో వ‌చ్చి చేరితే., ఇక్క‌డ వంద‌ల సంఖ్య‌లో వ‌చ్చి జ‌న‌సేనుడితో పార్టీ కండువాలు క‌ప్పుకున్నారు.. ఇక్క‌డ పార్టీలో చేరిన వారంతా మెగా ఫ్యామిలీకి చెందిన అభిమానులు , అభిమాన సంఘాల నాయ‌కులు.. గ‌చ్చిబౌలి ఎస్‌.క‌న్వెన్ష‌న్‌లో మెగా అభిమానుల ఆత్మీయ క‌ల‌యిక పేరిట ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ., ఉభ‌య తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మెగా ఫ్యాన్స్ వ‌చ్చి., జ‌న‌సైనికులుగా మారిపోయారు.. అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్‌. స్వామినాయుడు, తెలంగాణ చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు నందకిషోర్, జనరల్ సెక్రటరీ బి.విల్సన్ బాబు, జంట నగరాల చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ అహ్మద్, ఆంధ్రప్రదేశ్ చిరంజీవి యువత అధ్యక్షుడు కె.రామకృష్ణ,తమిళనాడు చిరంజీవి యువత అధ్యక్షుడు కె.నగేష్, కర్ణాటక చిరంజీవి యువత అధ్యక్షుడు శ్రీ బి.జి.నాగేంద్ర, అఖిలభారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.రవీంద్ర బాబు, టైకూన్ శ్రీనివాస్ తదితరులకు పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..

అనంత‌రం మాట్లాడిన జ‌న‌సేనాని తాను ఇప్ప‌టికీ చిరంజీవి గారి అభిమానుల్లో ఒక్క‌డిన‌న్నారు.. అందుకే త‌న పేరుతో ప్ర‌త్యేకంగా అభిమాన సంఘం ఏర్పాటు చేయ‌లేద‌ని తెలిపారు. తాను చిరంజీవి అభిమానినే కాబ‌ట్టి జ‌న‌సేన పార్టీ చిరంజీవి అభిమానుల‌దేన‌న్నారు.. జ‌న‌సేన పార్టీ ప్ర‌స్తుతం ఓ యుద్ధం మొద‌లు పెట్టింద‌న్న ఆయ‌న‌., ఒక విత్తు మొల‌కెత్తి చెట్టుగా మారే క్ర‌మంలో ప‌డిన‌న్ని క‌ష్టాలు ఇక్క‌డా ప‌డాల్సి ఉంటుంద‌న్నారు.. ఒక భావ‌జాలంతో కూడిన యుద్ధాన్ని చేయ‌నున్నామ‌ని చెప్పిన జ‌న‌సేనాని., ఏ పార్టీ అధికారంలో ఉన్నా భావ‌జాలం మాత్రం బ‌తికే ఉండాల‌న్నారు.. అంద‌రికీ అర్ధ‌మ‌య్యే రీతిలో జ‌న‌సేన భావ‌జాల‌న్ని వివ‌రించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., అది కేవ‌లం అధికారం కోస‌మే అన్న‌ట్టు ఉండ‌రాద‌న్నారు.. ముందుగా మీరు ప్ర‌జ‌ల‌కి ఏం చేయ‌గ‌ల‌ర‌న్న విష‌యాన్ని చెప్పాల‌ని ఆయ‌న సూచించారు.. యువ‌త‌కి ఏం చేయ‌గ‌ల‌రు..? రైతులు, మ‌హిళ‌ల అభ్యున్న‌తికి ఏం చేయ‌గ‌ల‌రో చెప్పాల‌న్నారు.. ఇంత మంది ప్రేమాభిమానాల‌తో జ‌న‌సేన పార్టీలో చేరినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌కి బాధ్య‌త‌తో కూడిన రాజ‌కీయ పార్టీల అవ‌స‌రం ఉంద‌న్న ప‌వ‌న్‌., పార్టీల విధానాలు ప్ర‌జ‌ల మ‌ధ్య సామ‌ర‌స్యం పెంచే విధంగా ఉండాల‌న్నారు..

త‌న‌కు చిరంజీవిగారు ఒక్క‌రే హీరో అన్న జ‌న‌సేనాని, ఆయ‌న సినిమాల్లోకి రాక‌ముందు అమితాబ్ బ‌చ్చ‌న్ గారిని ఇష్డ‌ప‌డేవాణ్ణ‌న్నారు.. ఈ మ‌ధ్య‌నే సైరా షూటింగ్‌లో అమితాబ్ ఉన్నార‌ని అన్న‌య్య పిలిస్తే వెళ్లానన్నారు. అన్న‌య్య అంటే త‌న‌కు చిన్న‌నాటి నుంచి ఒక విధ‌మైన ఆరాధ‌నా భావం ఉంద‌న్నారు.. చిన్న‌నాటి నుంచి ఆయ‌న మీద మాట‌ప‌డితే ఊర‌కునే వాడిని కాద‌న్నారు.. విజేత సినిమా స‌మ‌యంలో నువ్వేమ‌వుతావ‌ని అన్న‌య్య అడిగితే., నీకు పెక్యూరిటీగా ఉందామ‌నుకుంటున్నాన‌ని చెప్పాన‌న్నారు.. ఇప్ప‌టికీ ఆయ‌న‌పై అదే గౌర‌వం , అదే ప్రేమ ఉన్నాయ‌న్నారు.. ప్ర‌జా రాజ్యంలో ఆయ‌న నాయ‌క‌త్వంలో ప‌నిచేస్తాన‌ని చెప్పిన తాను., ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్టించుకునే వారు క‌న‌బ‌డ‌కే, జ‌న‌సేన పార్టీని స్థాపించిన‌ట్టు తెలిపారు.. ప్ర‌జ‌ల్ని, నాయ‌కుల్ని వేరు చేసి చూడాల‌న్న ప‌వ‌న్‌., నాయ‌కులు చేసే పాల‌సీల వ‌ల్ల ప్ర‌జ‌ల మ‌ధ్య స్ప‌ర్ధ‌లు రాకూడ‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. స‌మాజంలో జ‌రుగుతున్న దోపిడిలు త‌న‌కు చాలా బాధ క‌లిగిస్తాయ‌న్న జ‌న‌సేనాని., అఖ‌రిశ్వాస వ‌ర‌కు ఆ స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డాల‌న్న ల‌క్ష్యంతోనే రాజ‌కీయ పార్టీ పెట్టిన‌ట్టు చెప్పారు..

రాజ‌కీయాల్లోకి రావ‌డం వెనుక మ‌రో బ‌ల‌మైన కార‌ణాన్ని ప‌వ‌న్ వివ‌రించారు.. త‌మ్ముడు హిట్ త‌ర్వాత ఫంక్ష‌న్ వ‌ద్దు, ఆ ఖ‌ర్చుతో ఓ మంచి ప‌ని చేద్దామ‌నుకున్నాన‌ని చెప్పారు.. న‌ల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లో ఆర్వో ప్లాంట్ పెడ‌దామంటే, స్థానిక నాయ‌కులు మీరెందుకు వ‌చ్చారు, మీకేం ప‌ని అన్న అడ్డంకులు వ‌చ్చాయ‌ని తెలిపారు.. ఆనాడే రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో మార్పు చేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చాన‌న్న ప‌వ‌న్‌., జ‌న‌సేన కేవ‌లం స‌త్యాన్ని న‌మ్మిన పార్టీ అని చెప్పారు.. జ‌న‌సేన భావ‌జాలం ప్ర‌జ‌ల‌ప‌క్షం, ప్ర‌జ‌ల‌కి ఏమి కావాలో అదే నా విధానం, ఏం చేసినా ప్ర‌జా సంక్షేమం కోస‌మే చేస్తాన‌న్నారు..

తాను యువ‌త‌ని రెచ్చ‌గొట్ట‌ను ముందు ఉండి పోరాటం చేస్తాన‌న్నారు.. విశాఖ రైల్వే జోన్ విష‌యంలో అదే చెప్పాన‌ని తెలిపారు.. ప్ర‌జ‌లు క్షేమంగా ఉండాల‌న్న జ‌న‌సేనాని, నన్ను న‌మ్మి నా వెంట న‌డ‌వండి.. బాధ్య‌తాయుతంగా, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన రాజకీయాలు నిర్వ‌హిస్తాన‌న్నారు..

కార్య‌క్ర‌మానికి జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తోట చంద్ర‌శేఖ‌ర్‌, రాజకీయ వయ్వహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం, పార్టీ కోశాధికారి రాఘవయ్య, పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, జనసేన తెలంగాణ ఇంఛార్జి శంకర్ గౌడ్, సేవాదళ్ ఇంచార్జ్ రియాజ్, పార్టీ నాయకులు ఏ.వి.రత్నం, ఎం.కృష్ణారావు, పార్థసారథి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు..

Share This:

1,622 views

About Syamkumar Lebaka

Check Also

పెనుగొండ‌ని శ్రీ వాస‌వీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ‌గా మారుస్తాం-జ‌న‌సేనాని..

జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చాక పెనుగొండ ఊరి పేరును ‘శ్రీ వాస‌వి క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ’గా మారుస్తామ‌ని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × 5 =