Home / పవన్ టుడే / ప్ర‌త్యేక‌హోదా కోసం నేను ఎందుకు రోడ్డెక్కకూడ‌దో చెప్పండి..? కేంద్ర‌, రాష్ట్రాల‌కు జ‌న‌సేనాని సూటి ప్ర‌శ్న‌..

ప్ర‌త్యేక‌హోదా కోసం నేను ఎందుకు రోడ్డెక్కకూడ‌దో చెప్పండి..? కేంద్ర‌, రాష్ట్రాల‌కు జ‌న‌సేనాని సూటి ప్ర‌శ్న‌..

img-20170127-wa0059

ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం.. పార్టీ పెట్ట‌డానికి కార‌ణం.. టీడీపీ, బీజేపీల‌కు ఎందుకు మ‌ద్ద‌తిచ్చాను.. మూడేళ్ల పాల‌న త‌ర్వాత కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై త‌న అభిప్రాయం ఏంటి.. ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ఉత్త‌రాది పాల‌కుల చిన్న‌చూపు లాంటి అంశాల‌ను జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మీడియా ముఖంగా ముక్కుసూటిగా స్ప‌ష్టం చేశారు.. ప్ర‌త్యేక‌హోదా కోసం తాను ఎందుకు రోడ్డెక్క కూడ‌దో మీడియా ముఖంగా మీరూ చెప్పాల‌ని కేంద్ర‌, రాష్ట్రాల్లోని పాల‌కుల్ని ప్ర‌శ్నించారు.. త‌న‌పై, ఉద్య‌మంపై విమ‌ర్శ‌లు చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ కౌంట‌ర్ ఇచ్చిన జ‌న‌సేనుడు., పాల‌నాప‌ర‌మైన లోపాల‌ను ఎత్తిచూపారు..

img-20170127-wa0069

ద‌శాబ్దాలుగా ప‌రిష్క‌రించాల్సిన స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించ‌కుండా., ప్ర‌తి స‌మ‌స్య‌ను గోటితో పోయేదాన్ని గొడ్డ‌లి వ‌ర‌కు తెస్తున్న అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌పై పోరాడేందుకే తాను జ‌న‌సేన పార్టీ స్థాపించాన‌న్నారు.. ప‌దివిలోకి రాక‌ముందు ఆకాశంలో చంద్రుణ్ణి భూమ్మీద‌కి తెప్పిస్తాం అని చెప్ప‌డం., గెలిచాక కుంటి సాకులు చెప్ప‌డం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు.. భిన్న‌కులాలు, భిన్న‌మ‌తాల‌ను గౌర‌వించ‌కుండా ప్ర‌భుత్వాల్ని న‌డ‌ప‌లేర‌ని సూచించారు..

img-20170127-wa0067

గ‌త ఎన్నిక‌ల్లో తాను టీడీపీ, బీజేపీల‌కు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డానికి కార‌ణం కూడా అదేన‌ని జ‌న‌సేనాని స్న‌ష్టం చేశారు.. ప‌దేళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌తి స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేసింద‌ని., గోటితో పోయే విష‌యాన్ని గొడ్డ‌లి వ‌ర‌కు తెచ్చింద‌ని ఆరోపించారు.. కొత్త వ్య‌క్తి ప్ర‌ధాని అయితే., కొత్త ఆలోచ‌న‌లు చేస్తార‌ని., గుజ‌రాత్‌ని పాలించిన‌ట్టే దేశాన్ని పాలిస్తార‌ని భావించాన‌ని., టీడీపీ గ‌త అనుభ‌వాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకి వెళ్తుంద‌ని భావించిన‌ట్టు జ‌న‌సేనాని తెలిపారు.. వారిచ్చిన మాట త‌ప్పార‌న్నారు.. ప్ర‌శ్నిస్తే.. రాజ‌కీయానుభం లేదంటున్నారు.. నాలుగు రాష్ట్రాల్లో త‌న‌తో ప్ర‌చారం చేయించుకున్న‌ప్పుడు త‌న రాజ‌కీయానుభవం గుర్తుకు రాలేదా అంటూ బీజేపీ నేత‌ల్ని నిల‌దీశారు..

img-20170127-wa0066

మూడేళ్ల పాల‌న పూర్త‌య్యాక‌., ప‌రిస్థితులు చూస్తే.. ప్ర‌జ‌లు మీ నుంచి కోరుకున్న‌ది జ‌ర‌గ‌డం లేదు.. పూణే పిల్మ్ ఇనిస్టిట్యూట్ వ్య‌వ‌హారం ద‌గ్గ‌ర్నుంచి డీమోనిటైజేష‌న్ వ‌ర‌కు ప్ర‌తి విష‌యంలో మోడీ, బీజేపీ నేత‌లు ఒంటెద్దు పోక‌డ‌ల‌కి పోతున్నార‌ని ప‌వ‌న్ మండిప‌డ్డారు.. ప్ర‌తి విష‌యంలో బీజేపీ తీరు అలాగే ఉంద‌న్నారు.. త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టుకి సంబంధించి అంత‌పెద్ద గొడ‌వ జ‌ర‌గ‌డానికి కార‌ణం., త‌మ సంప్ర‌దాయాన్ని కాపాడుకోవాల‌న్న ల‌క్ష్యం ఒక్క‌టే కాదు.. బీజేపీపై త‌మిళ యువ‌త‌కున్న కోసం., ఈ రూపంలో బ‌య‌టికి వ‌చ్చింద‌ని జ‌న‌సేనాని స్ప‌ష్టం చేశారు..

img-20170127-wa0063

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూడా ఓ మినీ బీజేపీలా త‌యారైంద‌న్నారు.. ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారంలో వెంక‌య్య‌నాయుడుగారు ఐదేళ్లు కాదు ప‌దేళ్లంటే., చంద్ర‌బాబు 15 ఏళ్లు కావాల‌న్నారు.. అంద‌ర్నీ న‌మ్మించి ఓట్లువేయించుకుని., ఇప్ప‌డు హోదా గ‌తించిన అధ్యాయం అంటున్నారు.. ప్ర‌జ‌లు అస‌లు మీకు ఎలా క‌న‌బ‌డుతున్నార‌ని ప‌వ‌న్ నిల‌దీశారు.. వెంక‌య్య‌నాయుడు గారు స్వ‌ర్ణ‌భార‌తి ట్ర‌స్టుపై పెట్టిన మ‌న‌సు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పెడితే బాగుండేద‌న్నారు.. మూడేళ్ల‌లో ఇన్ని రకాలు మాట‌లు మారిస్తే జ‌నం మిమ్మ‌ల్ని న‌మ్మే ప‌రిస్థితి లేద‌న్నారు.. ప్ర‌త్యేక హోదా ప్ర‌సాదిస్తామంటారు.. ప్ర‌సాధించేందుకు మీరేమైనా దేవుళ్లా అని ప్ర‌శ్నించారు.. మేం ఈ దేశ ప్ర‌జ‌లం., అధికార మ‌దంలో నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు నాలుక మ‌డ‌తేసి మాట్లాడితే., చూస్తూ ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు..

img-20170127-wa0060

చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు ఎందుకు చేయ‌డం లేదు అన్న ప్ర‌శ్న‌కు., ఈ ప్రెస్ మీట్‌లో బ‌దులు దొరికింది.. చంద్ర‌బాబుకి స‌పోర్ట్ చేయ‌డానికి ఆయ‌న పాల‌నానుభ‌వ‌మే కార‌ణ‌మ‌న్నారు.. ఆ త‌ర్వాతా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకునే ప్ర‌తి విష‌యాన్ని ఎత్తిచూప‌లేద‌న్నారు.. ఓట్ ఫ‌ర్ నోట్ కేసులో., మిగిలిన అంశాల‌పై తాను ప్ర‌శ్నించ‌క‌పోవ‌డానికి కార‌ణం., అది ఆయ‌నొక్క‌రే చేసిన త‌ప్పుకాద‌ని భావించ‌డ‌మేన‌న్నారు.. మీరు ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారంలో మీరు కేంద్రాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేదు.. అది మీరు నైతికంగా చేస్తున్న త‌ప్పు అంటూ జ‌న‌సేనుడు దుయ్య‌బ‌ట్టారు.. హోదా వ‌ల్ల బెనిఫిట్ ఏంటి అంటున్నారు.. ముందు డిమోనిటైజేష‌న్ నా గొప్పే అన్న మీరు ఆ త‌ర్వాత ఐదు ర‌కాలుగా ఎందుకు మాట‌మార్చార‌ని నిల‌దీశారు.. 15 ఏళ్లు కావాల‌న్న మీరు ఎందుకు కాంప్ర‌మైజ్ అయ్యారు..? ఎవ‌రు మిమ్మ‌ల్ని ఇబ్బంది పెట్టారు..? ఈ విష‌యాలన్నీ ప్ర‌జ‌ల‌కి చెప్పాల్సిన బాధ్య‌త మీపై ఉంద‌ని చంద్ర‌బాబుని నిల‌దీశారు..

img-20170127-wa0062

ప్ర‌త్యేక ఉద్య‌మంపై సుజ‌నా చౌద‌రి, రాయ‌పూడి వ్యాఖ్య‌ల‌పైనా ఘాటుగా స్పందించారు.. ఈ ఇద్ద‌రితో త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి విభేదాలు లేవ‌న్న ఆయ‌న‌., ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో మాత్రం తాను విభేదిస్తాన‌ని తేల్చిచెప్పారు.. యువ‌త త‌మ హ‌క్కుల కోసం పోరాడుతుంటే., సుజ‌నా చౌద‌రిగారు జ‌ల్లిక‌ట్టు స్ఫూర్తితో పందుల పందాలు నిర్వ‌హించుకోమ‌న్నారు.. ఏ స్ఫూర్తితో మీరు బ్యాంకు రుణాలు ఎగ్గొట్టారో చెప్పాల‌న్నారు.. రాయ‌పాటి నిర్మిస్తున్న పోల‌వ‌రం అడుగ‌డుగునా అవ‌క‌త‌వ‌క‌లేన‌న్న ఆయ‌న‌., ఈ ఇద్ద‌రి అవ‌క‌త‌వ‌క‌ల‌పై క‌మిటీతో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు..

img-20170127-wa0064

ఇవాళ ప్ర‌త్యేక హోదా కోసం జ‌రిగిన ఉద్య‌మం ఏ పార్టీకో సంబంధించింది కాద‌న్నారు.. యువ‌త స్వ‌చ్చందంగా ముందుకు వ‌చ్చింద‌న్నారు.. వారికి ఎందుకు అనుమ‌తివ్వ‌లేద‌ని నిల‌దీశారు.. క‌నీసం గంట‌యినా అనుమ‌తి ఇవ్వాల్సింద‌న్నారు..ఇవాళ మీరు ఉదృతిని మాత్ర‌మే ఆప‌గ‌లిగారు.. వాయిదా మాత్ర‌మే వేయ‌గ‌లిగార‌ని ప‌వ‌న్ హెచ్చ‌రించారు.. ప్ర‌త్యేక హోదా కోసం తాను ప్ర‌జ‌ల త‌రుపున, ప్ర‌జ‌ల‌తో క‌లిసి ఎందుకు రోడ్డెక్క‌కూడ‌దో మీడియా ముఖంగా చెప్పాల‌ని కేంద్ర‌, రాష్ట్ర పాల‌కుల‌కి జ‌న‌సేనాని స‌వాలు విసిరారు.. ఉద్య‌మాల విష‌యంలో కేంద్రం తీరుని దుయ్య‌బ‌ట్టారు.. మీరు స‌మ‌స్య ప‌రిష్కారంపై దృష్టి సారించ‌డం లేద‌ని., పోలీసుల‌తో పోరాటాల్ని కంట్రోల్ చేద్దామ‌ని మాత్ర‌మే చూస్తున్నారు.. ఇది మంచిది కాద‌ని హెచ్చ‌రించారు..

ఇక ఉత్త‌రాది, ద‌క్షిణాది అంటూ తాను చేసిన వ్యాఖ్య‌లు తాను పొర‌పాటున చేసిన‌వి కాద‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు.. 12 గంట‌ల్లో రాష్ట్రాన్ని విభ‌జించార‌ని., మ‌రి ఎప్ప‌టి నుంచో యూపీ లాంటి ఉత్త‌రాధి రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉన్నా., ఎందుకు విడ‌గొట్ట‌రని నిల‌దీశారు.. మీ ప‌ట్టు త‌గ్గుతుంద‌నే ఉత్త‌రాది రాష్ట్రాల‌ను విభ‌జించ‌డం లేదా అని దుయ్య‌బ‌ట్టారు.. ఢిల్లీలో కాలుజారి ప‌డినా క‌వ‌ర్ చేసే ఉత్త‌రాది మీడియా., నాలుగ కోట్ల మంది హ‌క్కుల కోసం పోరాడుతుంటే ఎందుకు ప‌ట్టించుకోర‌ని ప్ర‌శ్నించారు.. మేం హిందీని గౌర‌విస్తాం.. మా భాష‌ల్ని కూడా మీరు గౌర‌వించాల‌ని డిమాండ్ చేశారు.. ఉత్త‌రాది, ద‌క్షిణాది వ్యాఖ్య‌ల‌పై వెన‌క్కి త‌గ్గేది లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు..

 

Share This:

1,587 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 + seven =