Home / పోరు బాట / ప్ర‌త్యేక హోదా అంటే ఏంటి..? ట‌్విట్ట‌ర్‌లో జ‌న‌సేనానికి ప్ర‌శ్న‌ల వ‌ర్షం..!

ప్ర‌త్యేక హోదా అంటే ఏంటి..? ట‌్విట్ట‌ర్‌లో జ‌న‌సేనానికి ప్ర‌శ్న‌ల వ‌ర్షం..!

img-20161018-wa0015img-20161018-wa0016
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా.. రాష్ట్ర విభ‌జ‌న ద‌గ్గ‌ర్నుంచి తెలుగు ప్ర‌జ‌ల‌కి ఈ మాట సుప‌రిచిత‌మే. ఇప్ప‌డు ఆ హోదా కోసం జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గొంతెత్త‌డంతో., ఎవ‌రినోట చూసినా ఇదే అంశం నానుతోంది.. అయితే చాలా మందికి ఈ ప్ర‌త్యేక హోదా అంటే ఏంటో., దాని వ‌ల్ల వ‌న‌గూరే లాభాలు ఏంటో తెలియ‌దు. ఇదే అంశాన్ని వంద‌లాది మంది ట్విట్ట‌ర్‌లో ప‌వ‌ర్‌స్టార్‌ని అడిగి తెలుసుకోవాల‌ని భావిస్తూ మెస్సేజ్‌లు పెడుతున్నారు.. స్పెష‌ల్ స్టేట‌స్ అంశంపై ప్ర‌జ‌లకు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు కొన్ని మీటింగ్‌లు పెట్టండి, ఓ గంట మీడియా స‌మావేశం పెట్టి వివ‌రించండి అంటూ సూచ‌న‌లు చేస్తున్నారు.. అందుకే జ‌న‌సేనాని త‌రుపున ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్ దాని చుట్టూ తిరుగుతున్న రాజ‌కీయాంశాల‌పై ప‌వ‌న్‌టుడే ఓ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది..

SCS.. స్పెష‌ల్ కేట‌గిరీ స్టేట‌స్‌.. 1969లో ఐద‌వ ఆర్థిక సంఘం ఈ విధానాన్ని ప్ర‌తిపాధించ‌గా., దాన్ని రాజ్యాంగంలో చేర్చారు.. ఐదు అంశాల ఆధారంగా రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక హోదా క‌ల్పించాల‌ని ఆ స‌మ‌యంలో నిర్ణ‌యించారు.. కొండ‌లు-అడ‌వులు-క‌ఠిన‌మైన ప‌రిస్థితులు గ‌ల భూభాగాలు., జ‌న‌సాంధ్ర‌త అతిత‌క్కువ‌గా ఉన్న లేక గిరిజ‌న జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న ప్ర‌దేశాలు, స‌రిహ‌ద్దు రాష్ట్రాలు, ఆర్ధికంగా, మౌలికంగా వెనుక‌బ‌డిన, ఆయా ప‌రిస్థితుల్ని మెరుగుప‌ర్చ‌డానికి వీలులేని రాష్ట్రాలు ఈ హోదాని క‌ల్పించాలంటూ జాతీయ అభివృద్ది మండ‌లి మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది.. మొత్తం 11 రాష్ట్రాలు ప్ర‌స్థుతం ఈ హోదానే అనుభ‌విస్తున్నాయి.. జమ్మూ కాశ్మీర్, అస్సాం, నాగాలాండ్‌ల‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌ల‌కు ఈ హోదా ఉంది..

ప్ర‌త్యేక హోదా ఉన్న రాష్ట్రాల‌కు కేంద్రం నుంచి భారీగా నిధులు స‌మ‌కూర‌డంతో పాటు భారీగా రాయ‌తీలు వ‌ర్తిస్తాయి.. రాష్ట్రాల‌కు కేంద్రం నుంచి వ‌చ్చే 30 శాతం సాధార‌ణ స‌హాయంతో పాటు ప్ర‌జ‌ల త‌ల‌స‌రి ఆధాయం, ఆర్ధిక స్థితిగ‌తుల ఆధారంగా అద‌నంగా 70 శాతం వ‌ర‌కు భ‌రిస్తుంది. ఎక్సేజ్‌, క‌స్ట‌మ్స్ లాంటి ప‌న్నుల నుంచి పూర్తి మిన‌హాయింపు ద‌క్కుతుంది. భారీ ఎత్తున ఆదాయ‌పు ప‌న్ను రాయితీలు ల‌భిస్తాయి.. దీంతో పాటు కేంద్ర ప్ర‌ణాళికా సంఘం ప్రాయోజిత ప‌థ‌కాల ద్వారా భారీ ఎత్తున నిధులు స‌మ‌కూరుతాయి.. ప్ర‌త్యేక ప్రాజెక్టులు ద‌క్కుతాయి.. రాష్ట్రాలు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకుని కేవ‌లం 10 శాతం నిధులు భ‌రిస్తే మిగిలిన మొత్తం కేంద్ర‌మే స‌మ‌కూరుస్తుంది.. ఇలా ప్ర‌త్యేక హోదా ద‌క్కిన రాష్ట్రాలు వేగంగా అభివృద్ది చెంద‌డానికి అవ‌కాశాలు ఉంటాయి.. ప‌న్నుల రాయితీల వ‌ల్ల భారీ ఎత్తున ప్ర‌యివేటు పెట్టుబ‌డులు సైతం త‌ర‌లివ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి.. దీని వ‌ల్ల స్థానికుల‌కి ఉద్యోగాలు రావ‌డంతో పాటు ప్ర‌జ‌ల ఆర్ధిక, సామాజిక స్థితిగ‌తుల్లో గ‌ణ‌నీయ‌మైన మెరుగుద‌ల న‌మోద‌వుతుంది..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా అంశం విష‌యానికి వ‌స్తే.. రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా ఆంంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్ధికంగా వెనుక‌బాటుకి లోన‌వుతున్న కార‌ణంగా ఐదేళ్ల పాటు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ఆనాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్ పార్ల‌మెంటు సాక్షిగా హామీ ఇచ్చారు.. అప్ప‌ట్లో విప‌క్షంలో ఉన్న బీజేపీ నేత వెంక‌య్యనాయుడు ఏకంగా ఐదేళ్లు చాల‌దు, ప‌దేళ్లు కావాల‌ని డిమాండ్ చేశారు. అయితే ఈ ప్ర‌త్యేక హోదా అంశాన్ని విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌ర్చ‌లేదు.. అందుకు రాజ్యాంగ స‌వ‌ర‌ణ అవ‌స‌ర‌మ‌ని భావించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ మాట హామీతో స‌రిపెట్టింది.. ఇప్పుడు బీజేపీ స‌ర్కారు అదే రాజ్యాంగాన్ని అడ్డుగా చూపి., ప్ర‌త్యేక హోదా అంశాన్ని దాదాపు ప‌క్క‌కు నెట్టేసింది. రాజ్యాంగ స‌వ‌ర‌ణ సాధ్యంకాని విష‌యం కాన‌ప్ప‌టికీ., ఏపీకి ఇస్తే మ‌రికొన్ని రాష్ట్రాల నుంచి అదే డిమాండ్ వ‌స్తుంద‌న్న‌ది కేంద్రం చూపిస్తున్న సాకు. అప్ప‌ట్లో రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఇలాంటి సాకులే కేంద్రం చూపింది. ఒక రాష్ట్రాన్ని విడ‌దీస్తే., మ‌రో 10 రాష్ట్రాల్లో అదే డిమాండ్ ఉంద‌ని., వాటినీ విడ‌దీయాల‌ని క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెప్పింది.. మ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విడిపోయి రెండున్న‌రేళ్లు ద‌గ్గ‌ర‌ప‌డుతోంది.. ఆ త‌ర్వాత ఎన్ని రాష్ట్రాలు విడ‌గొట్టారు.. స్పెష‌ల్ కేట‌గిరీ స్టేట‌స్ అంశం కూడా అంతే. కేవ‌లం రాజ‌కీయ కార‌ణాల వ‌ల్లే ప్ర‌త్యేక హోదా ప‌క్క‌దోవ ప‌ట్టింది.. మైకులు విర‌గ్గొట్టేలా క‌బుర్లు చెబుతున్న నేత‌ల్లారా, మీ ర‌క్తంలో నీతి, నిజాయితీ ఉంటే కేంద్రంపై పోరాడండి., ఆంధ్రుల హ‌క్కును సాధించండి..

Share This:

2,145 views

About Syamkumar Lebaka

Check Also

పార్టీలుగా పోటీప‌డ‌దాం.. ప్ర‌జాస‌మ‌స్య‌ల విష‌యంలో ఒక్క‌ట‌వుదాం-జ‌న‌సేన‌

జ‌న‌సేన పార్టీ పుట్టుక ల‌క్ష్యం ఏంటి అనే విష‌యం ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద పోరాటం చేసిన ప్ర‌తి సారీ బ‌హిర్గ‌త‌మ‌వుతూనే …

One comment

  1. Pawan kalyan must explain all these in a open meeting, and he should not come out once in three months , we need continuous involvement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × one =