Home / పవన్ టుడే / ప్ర‌త్యేక హోదా వ‌చ్చే వ‌ర‌కు జ‌న‌సేన పోరాటం ఆగ‌దు.. బెజ‌వాడ రౌండ్ టేబుల్ భేటీలో జ‌న‌సేన ఉద్ఘాట‌న‌..

ప్ర‌త్యేక హోదా వ‌చ్చే వ‌ర‌కు జ‌న‌సేన పోరాటం ఆగ‌దు.. బెజ‌వాడ రౌండ్ టేబుల్ భేటీలో జ‌న‌సేన ఉద్ఘాట‌న‌..

img-20170125-wa0055 img-20170125-wa0056

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా కోసం యువ‌త చేప‌ట్టిన శాంతియుత నిర‌స‌న‌పై ఆంక్ష‌ల నేప‌ధ్యంలో బెజ‌వాడ వేదిక‌గా అఖిల‌ప‌క్షం నిర్వ‌హించిన రౌండ్ టేబుల్ స‌మావేశంలో జ‌న‌సేన పార్టీ త‌న వాద‌న‌ను బ‌లంగా వినిపించింది.. స‌మావేశంలో పాల్గొన్న జ‌న‌సేన పార్టీ కోశాధికారి రాఘ‌వ‌య్య‌, మిడియా విభాగం హెడ్ హ‌రిప్ర‌సాద్‌., పార్టీ నేత పి.హ‌రిప్ర‌సాద్‌లు పార్టీ విధానాన్ని ప్ర‌క‌టించారు.. జ‌న‌సేన పార్టీకి ప్ర‌జాస్వామ్యంపై పూర్తిగా విశ్వాసం ఉంద‌ని నేత‌లు తెలిపారు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీలిచ్చి., ప్ర‌జ‌ల్ని మోసం చేసే పాల‌కుల్ని ప్ర‌శ్నించేందుకే జ‌న‌సేన పార్టీ పుట్టింద‌ని మీడియా విభాగం హెడ్ హ‌రిప్ర‌సాద్ తెలిపారు.. ప్ర‌జ‌లు ఎక్క‌డ స‌మ‌స్య‌ల్లో ఉంటే., అక్క‌డ జ‌న‌సేన పార్టీ ఉంటుంద‌ని., ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాటం చేపేందుకు పార్టీ పుట్టింద‌ని స్ప‌ష్టం చేశారు.. అలా ప్ర‌శ్నించ‌డం., ప్ర‌జ‌ల త‌రుపున పోరాడ‌టాన్ని అభివృద్ది నిరోధ‌కం అని విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని., జ‌న‌సేన పార్టీకి విధానాల‌పై ఓ నిబ‌ద్ద‌త ఉంద‌ని తెలిపారు..

img-20170125-wa0098 img-20170125-wa0057

ప్ర‌భుత్వానికి ఎప్పుడు స‌హ‌క‌రించాలో., ఎప్పుడు ఎదురుప‌డాలో జ‌న‌సేన పార్టీకి తెలుస‌ని పార్టీ ప్ర‌తినిధులు పున‌రుద్ఘాటించారు.. తెలంగాణ వ‌చ్చే వ‌ర‌కు ఎలాంటి ఉద్య‌మం అయితే జ‌రిగిందో., ప్ర‌త్యేక హోదా వ‌చ్చే వ‌ర‌కు జ‌న‌సేన పార్టీ అలాంటి ఉద్య‌మ‌మే చేస్తుంద‌ని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు..

img-20170125-wa0106

వెంక‌య్య‌నాయుడు లాంటి నేత‌లు ప్ర‌త్యేక హోదా విష‌యంలో ప్ర‌జ‌ల‌కి ఆశ చూపి., అధికారంలోకి వ‌చ్చాక మోసం చేశార‌ని అభిప్రాయ‌ప‌డ్డ జ‌న‌సేన నేత‌లు., పార్ల‌మెంటు సాక్షిగా ఐదేళ్లు కాదు ప‌దేళ్లు కావాలంటూ ఆశ‌పెట్టార‌న్నారు.. ఇప్పుడు గ‌డ‌చిపోయిన క‌థ అంటూ మాట్లాడుతున్నార‌ని., ప్ర‌త్యేక హోదా అంశాన్ని గ‌డ‌చిపోయిన క‌థ‌గా మారిస్తే., అదే వారి రాజ‌కీయాలకు ముగింపు క‌థ అవుతుంద‌ని హెచ్చ‌రించారు..

img-20170125-wa0103

హోదా కోసం మాట్లాడితే జైలుకు పంపిస్తామ‌ని బెధిరించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌న్న వామ‌ప‌క్ష నేత‌లు., ప్ర‌జాస్వామ్య ప‌ద్ద‌తిలో చేయాల‌నుకుంటున్న నిర‌స‌న‌కు అడ్డుత‌గులుతూ భ‌య‌భ్రాంతుల‌కి గురిచేయ‌డాన్ని ఖండించారు..

Share This:

894 views

About Syamkumar Lebaka

Check Also

నిజ‌మైన స‌ర్వే చేద్దాం రండి.. ప‌చ్చ‌-ప్ర‌తి ప‌చ్చ‌(సాక్షి) మీడియాల‌కి ఓపెన్ ఛాలెంజ్‌..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వేడి రాజుకున్న నేప‌ధ్యంలో.. స‌ర్వేలంటూ మీడియా హ‌డావిడి మొద‌లుపెట్టింది.. తెలంగాణ‌లో ప‌రిస్థితులు ఎలా వున్నా., ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో …

2 comments

  1. We are with you pavan kalyan
    Meeru oka vyakti kaadu Shakti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × three =