Home / పోరు బాట / ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు జ‌న‌సైనికుడి సైకిత్‌యాత్ర‌..

ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు జ‌న‌సైనికుడి సైకిత్‌యాత్ర‌..

img-20170101-wa0126 img-20170101-wa0131 img-20170101-wa0132

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేస్తున్న పోరాటానికి మ‌ద్ద‌తుగా ఓ జ‌న‌సైనికుడు సైకిల్ ఎక్కాడు.. సైకిల్ ఎక్క‌డం అంటే టీడీపీలో చేర‌డం కాదండోయ్‌.. జ‌నానికి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు., నాయ‌కుల‌కి క‌నువిప్పు క‌లిగించేందుకు సైకిల్‌పై ఓ మారాథాన్ యాత్ర చేప‌ట్టాడు.. తిరుప‌తి నుండి హైద‌రాబాద్ వ‌ర‌కు ఇ.వెంక‌టర‌మ‌ణ అనే జ‌న‌సైనికుడు ఈ సంక‌ల్ప‌యాత్ర‌కు పూనుకున్నాడు.. జ‌న‌సేనాని సంక‌ల్ప‌బ‌లంతో రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా రావాల‌న్న‌దే త‌న ఆకాంక్ష అంటున్నారు వెంక‌ట‌ర‌మ‌ణ‌..

img-20170101-wa0123

త‌న సంక‌ల్ప యాత్ర‌కు సిద్ధం చేసిన సైకిల్‌పై జ‌న‌సేన పార్టీ సింబ‌ల్‌తో పాటు అమ‌రుడైన జ‌న‌సైనికుడు వినోద్ రాయ‌ల్ పేరుని., జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పేరుని వేయించుకున్నారు.. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అనే నినాదాన్ని ప్ర‌చురించారు.. మార్గం మ‌ధ్య‌లో ఎలాంటి ఆటంకాలు క‌లుగ‌కుండా తోడుగా జెండాపైక‌పిరాజును వెంట‌బెట్టుకున్నారు..

ప్ర‌త్యేక హోదాతో త‌మ‌కు ల‌బ్ది చేకూరుతుంద‌ని ప్ర‌తి ఆంధ్రుడు భావిస్తుంటే., వారి ఓట్ల‌తో గెలిచిన నాయ‌కులు మాత్రం., ప్యాకేజీ చాలు అంటున్నారు.. అస‌లు ప్ర‌జ‌ల ఆకాంక్ష నెర‌వేర్చాల‌న్న చిత్త‌శుద్ది నాయ‌కుల్లో ఎంత ఉంద‌న్న‌ది ఇక్క‌డే తెలుస్తోంది.. ఇలాంటి నాయ‌కుల్నా మ‌నం ఎన్నుకున్న‌ది అని జ‌నం సిగ్గుప‌డుతున్నారు.. ఏదో ఒక రోజు ఖ‌చ్చితంగా మీ అంద‌రికీ బుద్ది చెప్పితీరుతారు..

Share This:

551 views

About Syamkumar Lebaka

Check Also

వైసీపీ అడ్డంగా దోచేస్తే..టీడీపీ చ‌ట్ట‌బ‌ద్దంగా దోచేస్తోంది-త‌ణుకులో జ‌న‌సేనుడి ఫైర్‌..

అవినీతిలేని పాల‌న‌, ఆడ‌ప‌డుచుల‌కి వ్య‌క్తిగ‌త‌-ఆర్ధిక భ‌ద్ర‌త అనే అంశాలకు జ‌న‌సేన పార్టీ ఎంత‌టి ప్రాధాన్య‌త ఇస్తుందో ఆ పార్టీ అధినేత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × three =

%d bloggers like this: