Home / జన సేన / ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం రాష్ట్ర బంద్‌కి జ‌న‌సైన్యం రెఢీ.. అఖిల‌ప‌క్షంతో రోడ్ల పైకి..

ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం రాష్ట్ర బంద్‌కి జ‌న‌సైన్యం రెఢీ.. అఖిల‌ప‌క్షంతో రోడ్ల పైకి..

ప్ర‌త్యేక హోదా భిక్ష కాదు.. ఆంధ్రుల హ‌క్కు.. అంటూ జ‌న‌సేన అధినేత పెట్టిన పొలికేక‌., నాడు ఎవ్వ‌రికీ ప‌ట్టి ఉండ‌క‌పోవ‌చ్చు.. ఆ నాడు రాష్ట్రంలోని పార్టీల‌కి అది రాజ‌కీయ అంశంగా క‌న‌బ‌డి ఉండ‌క‌పోవ‌చ్చు.. కానీ నిరంత‌ర రాజ‌కీయ ప్ర‌స్థానానికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నాంది ప‌లికిన వేళ ప్ర‌జ‌ల్ని మోసం చేస్తూ వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ వెన్నులో వ‌ణుకు మొద‌ల‌య్యింది.. ఆ వ‌ణుకు ఏఎఫ్‌సీ ఎర్పాటు నాటికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టేలా చేసింది.. ఇప్పుడు ప్ర‌జాప్ర‌యోజ‌నాల ప‌ట్ల మీకు నిబ‌ద్ధ‌త ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టండి అన్న జ‌న‌సేనాని పిలుపుతో కుహ‌నా రాజ‌కీయ శ‌క్తుల‌కి, ప్రజా వంచ‌క పార్టీల‌కి నిద్ర‌లేని రాత్రుల‌ని మిగులుస్తూ వ‌స్తోంది.. రాష్ట్రంలో తొలిసారి అధికార పార్టీ బంద్ అంటోంది.. త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ని సైతం రోడ్డెక్కించి నిర‌స‌న తెలిపేలా చేస్తోంది.. ప్ర‌తిప‌క్షాల‌ను నిత్యం నిర‌స‌న‌ల్లో మునిగి తేలేలా చేస్తోంది..

జ‌న‌సేన బ‌లం ఎంత అని వెట‌కారాలు చేసిన వారికి, జ‌న‌సేన అధినేత నోటి వెంట వ‌చ్చిన ఒక్క మాట బ‌లం రాష్ట్ర రాజ‌కీయాల్ని కుదిపేసేంత‌., దేశ ప్ర‌ధానితో నిరాహార దీక్ష చేయించేంత అని ప్ర‌తి సైనికుడు గ‌ర్వంగా చెప్పుకునేంత అని తెలిసిపోయింది.. తాజాగా ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి పిలుపు మేర‌కు ఏప్రిల్ 16 సోమ‌వారం రాష్ట్ర బంద్‌కి పిలుపునివ్వ‌గా, అఖిల‌ప‌క్షంతో పాటు జ‌న‌సేన అధినేత సైతం బంద్‌కి మ‌ద్ద‌తు పలికారు.. దీంతో మ‌రోసారి రోడ్ల పైకి వ‌చ్చేందుకు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు స‌మాయ‌త్తం అయ్యారు.. రాష్ట్ర వ్యాప్తంగా అఖిల‌ప‌క్ష నాయ‌కుల‌తో క‌ల‌సి రోడ్లెక్కేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు..

ప్ర‌జ‌ల్ని ఇబ్బంది పెట్ట‌కుండా శాంతియుత నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌న్న‌ది జ‌న‌సేన పార్టీ అభిమ‌తం.. బంద్ అంటే రోడ్ల‌పై తిరిగే వారిని అడ్డుకోవ‌డం., అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు ఆటంకం క‌లిగించ‌డం వంటి ప‌నులు చేయ‌రాదు.. ఉద‌యం నుంచి రోడ్ల‌పైకి వ‌చ్చి పూర్తి శాంతిమార్గంలో నిర‌స‌న తెల‌పాలి.. అస‌లు మ‌న వేలితో మ‌న క‌న్ను పొడుచుకునే విధానానికి జ‌న‌సేన వ్య‌తిరేక‌మే అయినా., కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల నేప‌ధ్యంతో, త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో చేస్తున్న ఈ నిర‌స‌న‌ల్ని ప్ర‌జ‌లు అర్ధం చేసుకుంటార‌ని జ‌న‌సేనాని భావిస్తున్నారు.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు రోడ్డెక్క‌డం మొద‌లు పెట్టిన ద‌గ్గ‌ర్నుంచి నిర‌స‌న‌ల్లో మిగిలిన పార్టీల జెండాలు సంఖ్యా బ‌లం లేక వెల‌వెలబోతున్నాయి.. దీంతో చాలా చోట్ల జ‌న‌సేన ప‌తాకాలు దొర‌క‌కుండా చేసే ప‌రిస్థితులు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి..

జ‌నం స‌మ‌స్య‌ల కోసం నిరంత‌ర పోరాటం చేస్తున్న జ‌న‌సేన‌కి జ‌నం మ‌ద్ద‌తు ఉంది.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కి జెండా అవ‌స‌రం కూడా లేదు.. త‌మ పార్టీ అధినేత పిలుపే త‌మ‌కు అన్నీ అన్న‌ది వారి భావ‌న‌.. అదే ధైర్యంతో సోమ‌వారం బంద్‌ను విజ‌య‌వంతం చేసేందుకు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు రాష్ట్ర వ్యాప్తంగా స‌న్నాహాలు చేసుకుంటున్నారు.. జ‌న‌సేన పోరాటం ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు తీర్చాల‌ని కోరుతూ..

Share This:

1,502 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × three =