Home / జన సేన / ప్ర‌త్య‌ర్ధులు ఓట్ల లెక్క‌ల్లో ఉన్నారు.. ఆయ‌న ప్ర‌జ‌ల కోసం పోరు మొద‌లెట్టారు..

ప్ర‌త్య‌ర్ధులు ఓట్ల లెక్క‌ల్లో ఉన్నారు.. ఆయ‌న ప్ర‌జ‌ల కోసం పోరు మొద‌లెట్టారు..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చెప్పిన ప్ర‌తి మాట‌ను అభ్య‌ర్ధులు తూచా త‌ప్ప‌కుండా పాటించేస్తున్నారు.. పోరాట యాత్ర‌లో , ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న ప‌ర్య‌టించిన ప్ర‌తి ప్రాంతంలో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి హామీ ఇచ్చారో., ఆ హామీల‌కు అనుగుణంగా అభ్య‌ర్ధులు అడుగులు వేస్తున్నారు.. కృష్ణాజిల్లా అవ‌నిగ‌డ్డ‌లో జ‌రిగిన జ‌న‌సేన ఎన్నిక‌ల శంఖారావం స‌భ‌లో ప‌వ‌న్ స్థానిక అభ్య‌ర్ధి ముత్తంశెట్టి కృష్ణారావును ప‌రిచ‌యం చేస్తూ.. ఓ మాట అన్నారు.. అవ‌నిగ‌డ్డ‌లో ముత్తంశెట్టిని క‌ట్టి పారేస్తాను.. అవ‌నిగ‌డ్డ అభివృద్ధి ప‌రిచే బాధ్య‌త అప్ప‌గిస్తున్నా., మీకు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా., ప‌రిష్క‌రిస్తాడు అని చెప్పారు.. ఇక్క‌డ మూడు ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్ధులు గెలుపు కోసం త‌మ వంతు ప్ర‌య‌త్నాలు తాము గ‌ట్టిగానే చేశారు.. పోలింగ్ ముగిసింది.. టీడీపీ అధిష్టానం స్టాండ్‌కు త‌గ్గ‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుంటే., వైసీపీ అభ్య‌ర్ధి ఓ నాలుగు రోజులు విజ‌యోత్స‌వాలు చేసుకుని సైలెంట్ అయిపోయారు.. గెలుపు ఓట‌ముల‌కు సంబంధించి లెక్క‌లు మొద‌లు పెట్టారు.. మీ ఊర్లో ఎన్ని ఓట్లు ప‌డ్డాయి.. మా ఊర్లో ఎన్ని ఓట్లు పడ్డాయి అంటూ క‌న‌బ‌డిన వారిన‌ల్లా ఎంక్వ‌యిరీ చేసే ప‌నిలోనే ఉన్నారు..

జ‌న‌సేన అభ్య‌ర్ధి ముత్తంశెట్టి మాత్రం పోలింగ్ ముగిశాక మొద‌టి మూడు రోజులు అవ‌నిగ‌డ్డ‌లో క‌న‌బ‌డ‌లేదు.. ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలో అనారోగ్యానికి గురికావ‌డంతో వైద్య చికిత్స కోసం వెళ్లారు.. అనంత‌రం తిరిగి వ‌చ్చి నియోజ‌క‌వ‌ర్గం మీద ప‌డ్డారు.. నియోజ‌క‌వ‌ర్గం మీద ప‌డ‌డం అంటే., ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇచ్చిన మాట మేర‌కు స్థానిక స‌మ‌స్య‌ల్ని అంచ‌నా వేసే ప‌నిలో ప‌డ్డారు.. త‌న దృష్టికి వ‌చ్చిన స‌మ‌స్య‌ల మీద అధ్య‌య‌నం జ‌రుపుతూ, ప‌రిష్కారం కోసం పోరాటం మొద‌లుపెట్టారు.. గ్రామ స్థాయి నుంచి ఉన్న‌తాధికారుల వ‌ర‌కు ఎలాంటి వారితో అయినా మాట్లాడే స‌త్తా ఉన్న ముత్తంశెట్టి., తీర ప్రాంత గ్రామాల్లో మంచినీటి క‌ట‌క‌ట మీద యుద్ధం ప్ర‌క‌టించారు.. ముఖ్యంగా కోడూరు మండ‌లం చివ‌రి గ్రామాల్లో., రామ‌చంద్ర‌పురం, బ‌స‌వ‌న్న‌పాలెం లాంటి గ్రామాల్లో గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కం కింద ఇవ్వాల్సిన మినిమం నీటిని ఇవ్వ‌డం లేదు.. మే నెల రాక ముందే రెండు రోజుల‌కు ఒక సారి కుటుంబానికి రెండు బిందెల నీరు మాత్ర‌మే ఇస్తున్నారు.. మంచినీటి కోసం తీర‌ప్రాంత వాసులు తీవ్ర‌మైన దుర్భ‌ర ప‌రిస్థితులు అనుభ‌విస్తున్నార‌న్న విష‌యం తెలియ‌గానే., స్థానిక జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల స‌హ‌కారంతో మంచినీటి ట్యాంక‌ర్లు పంపారు.. అంత‌టితో ఆగ‌లేదు.. ఆర్‌డ‌బ్ల్యూఎస్ అధికారుల‌కు త‌మ బాధ్య‌త గుర్తు చేశారు.. నిబంధ‌న‌ల మేర‌కు గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా స్కీం ద్వారా ఇవ్వాల్సిన నీటిని విడుద‌ల చేయ‌ని ప‌క్షంలో ట్యాంక‌ర్ల‌తో నీటిని స‌ర‌ఫ‌రా చేయాలి.. అదే విష‌యాన్ని స్థానిక డిఈ దృష్టికి తీసుకువెళ్ల‌గా., నిధులు లేవంటూ ఆయ‌న చేతులెత్తేశారు..

వెంట‌నే ముత్తంశెట్టి క‌లెక్ట‌ర్ దృష్టిని అవ‌నిగ‌డ్డ తీర ప్రాంతా వాసుల స‌మ‌స్య‌ను తీసుకువెళ్లారు.. స‌మ‌స్య యుద్ధ ప్రాతిప‌ధిక‌న ప‌రిష్కారించ‌ని ప‌క్షంలో క‌లెక్ట‌రేట్ ఎదుట నిర‌స‌న‌కు దిగుతామ‌ని హెచ్చ‌రించారు..

ఇక పార్టీకి సంబంధించి కార్య‌క్ర‌మాలు కూడా ముమ్మ‌రం చేశారు.. గెలుపు-ఓట‌మి అనే అంశాలు ప‌క్క‌న పెట్టి., అన్ని మండ‌లాల్లోకార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు.. పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసే క్ర‌మంలో యాక్టివిటీ కూడా ముమ్మ‌రం చేశారు..

Share This:

602 views

About Syamkumar Lebaka

Check Also

కేంద్ర బ‌డ్జెట్ నిరాశ ప‌ర్చింది.. ఏపీ స‌ర్కారు స్ప‌ష్ట‌త తీసుకోవాలి-జ‌న‌సేన పార్టీ

కేంద్ర బ‌డ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని జ‌న‌సేన పార్టీ ముఖ్య‌నేత మాదాసు గంగాధ‌రం స్ప‌ష్టం చేశారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 + ten =