Home / పెన్ పోటు / ప్ర‌త్య‌ర్ధుల‌కి తిక్కెక్కిస్తున్న ప‌వ‌న్ లెక్క‌.. వ్య‌తిరేక క‌థ‌నాల‌తో బొంకుతున్న సాక్షి గొంతు..

ప్ర‌త్య‌ర్ధుల‌కి తిక్కెక్కిస్తున్న ప‌వ‌న్ లెక్క‌.. వ్య‌తిరేక క‌థ‌నాల‌తో బొంకుతున్న సాక్షి గొంతు..

నాక్కాస్త తిక్కుంది.. కానీ దానికి ఓ లెక్కుంది.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాలో ఫేమ‌స్ డైలాగ్ ఇది.. అవును ఆయ‌న వేసే ప్ర‌తి అడుగుకీ ఓ ఖ‌చ్చిత‌మైన లెక్క ఉంది.. ఇదే ఇప్పుడు పొలిటిక‌ల్ ప్ర‌త్య‌ర్ధుల‌కి తిక్కెక్కించే అంశం.. సాధార‌ణంగా త‌మ‌కు చేత‌కానిది., సాధ్యం కానిదీ ఎదుటివారు చేస్తే జ‌ల‌సీ ఫీల‌వ‌డం ప‌రిపాటి.. ఇప్పుడు జ‌న‌సేనానిని చూసి.. ప్ర‌త్య‌ర్ధులు ఇదే జ‌ల‌స్ ఫీల‌వుతున్నారు.. చెప్ప‌ద‌లుచుకున్న‌ది సూటిగా చెప్ప‌డం., స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం స్ప‌ష్ట‌మైన వైఖ‌రితో పోరాడ‌టం.. ప్ర‌త్య‌ర్ధి ఎవ‌రైనా అద‌ర‌క‌పోవ‌డం, బెధ‌ర‌క‌పోవ‌డం.. ఈ క్వాలిటీస్ అన్నీ ప‌వ‌న్‌ని ప్ర‌జ‌ల‌కు చేరువ చేస్తుంటే., ఏం చేయాలో అర్ధం కాక పాల‌కులే చేష్ట‌లుడిగి చూసే ప‌రిస్థితి.. అది మిగిలిన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల్ని కూడా కాస్త కంగారు పెడుతున్న అంశ‌మే.. ముఖ్యంగా కంగారు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీలో కాస్త ఎక్కువ‌గా క‌న‌బ‌డుతోంది.. త‌న‌కు ద‌క్కాల్సిన ఇమేజ్ రాబోయే కాలంలో కాబేయే రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధికి ద‌క్క‌డాన్ని ఆ పార్టీ అధినాయ‌క‌త్వం స‌హించ‌లేక‌పోతోంది.. ప్ర‌స్తుతం ఏపీ పాలిటిక్స్‌లో అబేధ్య‌మైన శ‌క్తిగా ప‌రిణ‌మించిన జ‌న‌సేనాని., ప్ర‌తి విష‌యంలో క్రిస్ట‌ల్ క్లియ‌ర్‌గా ఉన్నారు.. దీంతో వైసీపీ అధినేత‌కు గాని, ఆ పార్టీ నేత‌ల‌కు గానీ ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం ద‌క్క‌డం లేదు.. దీంతో త‌మ‌కు చేత‌నైన ప‌ని., చేతిలో ఉన్న ప‌ని అదే ఎల్లో రాత‌ల మీడియాతో బుర‌ద చ‌ల్లించే ప‌నిని మొద‌లుపెట్టింది.. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల్ని ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌ల జీతాలు ఇచ్చి పెట్టుకున్న‌ది ఇందుకే అని నిత్యం చాటి చెబుతూనే ఉంది..

hqdefaultమొన్న రామ‌చంద్ర‌మూర్తి, నిన్న కొమ్మినేనితో ప‌వ‌న్ ప్ర‌స్థానంపై ఇంకు చ‌ల్లించే ప్ర‌య‌త్నం చేశారు.. వ‌య‌సు మ‌ళ్లిన వారి రాత‌ల్లో ప‌స‌..ఫ‌స‌.. రెండూ లేక‌పోవ‌డంతో జ‌నం పెద్ద‌గా రిసీవ్ చేసుకోలేదు.. దీంతో ఇప్పుడు ఆ అవ‌కాశాన్ని మ‌రో సీనియ‌ర్ పాత్రికేయుడు దేవుల‌ప‌ల్లి అమ‌ర్‌కి అప్ప‌గించారు.. మిగిలిన ఇద్ద‌రితో పోలిస్తే.., అమ‌ర్ త‌న‌కు అప్ప‌గించిన ప‌నినిఇ కాస్త స‌మ‌ర్ధంగానే నిర్వ‌ర్తించారు.. కానీ ఆ రాత‌లు ప‌వ‌న్ ఇమేజ్‌ని ఏ మేర‌కు దెబ్బ‌తీస్తాయ‌న్న‌దే ఇక్క‌డ అస‌లు పాయింటు..

అమ‌ర్‌గారు ప‌వ‌న్ రాజ‌కీయ ప్ర‌స్థానం గురించి కొన్ని స్ప‌స్ట‌మైన ప్ర‌శ్న‌లు సంధించారు.. రాజ‌కీయాల్లో ప్ర‌వేశించాలంటే అంత‌ర్మ‌ధ‌నం జ‌ర‌గాల‌న్నారు.. లేక‌పోతే ప‌రిస్థితుల ప్ర‌భావం వ‌ల్ల బ‌ల‌వంతంగా లాగ‌బ‌డాలి అని సెల‌విచ్చారు.. అంత‌ర్మ‌ధ‌నం అంటే అర్ధం ఏంటి..? తాను రాజ‌కీయాల్లోకి ఎందుకు వ‌స్తున్నాను..? ఏ ప‌రిస్థితులు అందుకు దారితీశాయి..? అనే అంశాల‌పై స్ప‌ష్ట‌త ఉంటే స‌రిపోదా..? ప‌రిస్థితులచే బ‌ల‌వంతంగా లాగ‌బ‌డాలి అన్నారు.. అంటే రాజ‌కీయ నాయ‌కుడిగా ఉన్న ఏ తండ్రో..తాతో కాలం చేస్తే., ఏ మాత్రం స్ప‌ష్ట‌త లేకున్నా.. ఇష్టం లేకున్నా.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చేయ‌డ‌మా.. అది వార‌స‌త్వా రాజ‌కీయం కాదా.. ఓ నేత మృతిచెందితే.. ఆ స్థానం భ‌ర్తీ చేసే అవ‌కాశం కేవ‌లం ఆ వ్య‌క్తి కుటుంబానికే ఉంటుందా..? జెండాలు మోసేవారు.. జీవితాంతం జెండాలే మోయాల‌ని ఏ రాజ్యాంగం చెబుతోంది.. వీట‌న్నింటికీ మీ వ‌ద్ద బ‌దులుందా అమ‌ర్‌జీ..?

ఇక మిగిలిన ప్ర‌శ్న‌ల విష‌యానికి వ‌ద్దాం.. ఏ అంశం ప్రాతిప‌ధిక‌గా ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు..? ఏ కార‌ణంతో పార్టీని స్థాపించారు..? నేటి నీతిమాలిన రాజ‌కీయ వ్యవ‌స్థ ప్ర‌క్షాళ‌ణ అనే అంశం జ‌న‌సేనాని ప్రాతిప‌ధిక‌.. పార్టీ స్థాపించ‌డానికి కార‌ణం కూడా ఇంచుమించు అదే.. నిత్యం నీటిమూట‌ల్లాంటి మాట‌లు చెబుతూ., ప్ర‌జ‌ల్ని వంచ‌న చేస్తున్న నాయ‌కుల‌పై.., ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌న‌సేన పార్టీని స్థాపించారు.. మూడో క్వ‌శ్చ‌న్‌.. ఇదే కీల‌క‌మైంది.. ఆయ‌న ఎవ‌రివైపు.. ప్ర‌తి మీటింగ్‌లో చాలా స్ప‌ష్టంగా చెబుతున్నా ప‌వ‌న్ చెబుతున్నా సీనియ‌ర్ పాత్రికేయులైన మీకు విన‌బ‌డ‌క‌పోవ‌డం గ‌ర్హ‌నీయం.. ఆయ‌నది అధికార‌ప‌క్ష‌మూ కాదు.. విప‌క్ష‌మూ కాదు.. ప్ర‌జాప‌క్షం.. ఏ పార్టీకి ప‌వ‌న్ ప‌క్ష‌పాతి కాదు.. కేవ‌లం ప్ర‌జ‌ల ప‌క్ష‌పాతి.. మ‌రో ప్ర‌శ్న ఆయ‌న ల‌క్ష్యం ఏంటి..? అదీ సుస్ప‌ష్ట‌మే.. ఎక్క‌డ స‌మ‌స్య ఉంటే అక్క‌డ తానుండ‌డం.. ఆ స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో ఆనందం వెతుక్కోవ‌డం.. ప్ర‌త్య‌ర్ధి ఎవ‌రైనా గెలిచే వ‌ర‌కు పోరాడ‌టం.. ఇదే జ‌న‌సేనాని ల‌క్ష్యం..

అమ‌ర్‌గారి సాక్షీ పాత్రికేయంలో మిగిలిన అంశాల విష‌యానికి వ‌స్తే.. ఏ అంశంలోనూ స్ప‌ష్ట‌త లేద‌న్నారు.. స్న‌ష్ట‌త అంటే ఏంటి..? కాల్ మ‌నీ వ్య‌వ‌వ‌హారంపై చ‌ర్చ‌కు డిమాండ్ చేసి., మ‌ద్య‌పానంపై మాట్లాడ‌ట‌మా..? లేక ఏ అంశంపై స్ప‌ష్ట‌త‌లేక వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగ‌డ‌మా..? రెండున్న‌రేళ్లు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌లేద‌ని సెల‌విచ్చారు.. రాజ‌ధాని భూముల వ్య‌వ‌హారం ద‌గ్గ‌ర నుంచి నిన్న మొన్న‌టి అక్వా ఫుడ్ పార్క్ వ‌ర‌కు ప‌వ‌ర్‌స్టార్ చేసిందేంటి.. మీ రాత‌ల‌కి డ‌బ్బిస్తున్న మీ నాయ‌కుడు ఎంత పాకులాడినా స్పందించ‌ని పాల‌కులు., జ‌న‌సేనాని ఒక్క‌మాట చెప్ప‌గానే స్పందిస్తున్నారేంటి అన్న అక్క‌సా ఇది.. ప్ర‌త్యేక హోదా కోసం డే వ‌న్ నుంచి పోరాడుతున్న మీ నాయ‌కుడితో క‌ల‌వ‌మ‌ని మ‌రో ఆఫ‌ర్ ఇచ్చారు.. ఇన్నాళ్లూ పోరాడుతున్నా స్పంద‌న‌లేని పాల‌కులు ప‌వ‌న్ ప్ర‌శ్నించ‌గానే న‌ష్ట‌నివార‌ణా చ‌ర్య‌లు మొద‌లు పెట్టారు.. ప్యాకేజీ అంటూ ఏదో చేసే ప్ర‌య‌త్నం చేశారు.. అది చూసి మిగిలిన విప‌క్షాలు(లోక్‌స‌త్తా, వామ‌ప‌క్షాలు) ఈ విష‌యంలో జ‌న‌సేనానితో క‌ల‌సి అడుగులు వేసేందుకు ముందుకు వ‌చ్చారు.. అంటే ఆయ‌న‌లో విష‌యం ఉంద‌ని వారంతా న‌మ్మారు.. అలాంట‌ప్పుడు అంద‌రితో పాటు మీ జ‌గ‌న్ కూడా ప‌వ‌న్‌తో క‌లిసి అడుగు వేసే ప్ర‌య‌త్నం చేయొచ్చుక‌దా..? మీకు.. మీ ఓన‌ర్‌కీ ఫైన‌ల్‌గా కావ‌ల్సింది ప్ర‌జాక్షేమ‌మే అయితే., మీరే ముందుకి రావ‌చ్చుగా.. హోదా కోసం ఎవ‌రితోనైనా క‌లిసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు జ‌న‌సేనాని ప్ర‌క‌టించారు.. మ‌రి మీరు ఎందుకు ముందుకు రావ‌డం లేదు..

downloadఅస‌లు సాక్షి వేదిక‌గా నిత్యం జ‌న‌సేనానికి వ్య‌తిరేకంగా వ‌స్తున్న వ‌రుస క‌థనాల్లో ఆంత‌ర్యం ఏంటి..? మిగిలిన మీడియా మొత్తంలో ఎవ‌రికీ రాని సందేహాలు మీకే ఎందుకు వ‌స్తున్నాయి..? ప‌వ‌న్ ఇమేజ్ లెక్క‌.. మీకు.. మీ యాజ‌మాన్యానికీ తిక్కెక్కిస్తోందా..? దాన్ని ప్ర‌జ‌ల‌పై రుద్దాల‌నుకుంటున్నారా.. ఓ అబ‌ద్దాన్ని ప‌ది మంది నిజం అన్నా అది నిజం కాదు.. అది గుర్తుపెట్టుకోండి.. పాత్రికేయంలో క‌నీస విలువ‌ల‌కి ప్రాధాన్య‌త ఇవ్వండి..
ఇక ప‌త్తిత్తు క‌బుర్లు చెబుతున్న దేవుల‌ప‌ల్లి అమ‌ర్‌గారి విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న ఆయ‌న‌గారి బ్యాచ్ పాత్రికేయం, యూనియ‌న్ ముసుగులో చేసిన అరాచ‌కాలు అన్నీ ఇన్నీకాదు.. ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్‌గా, యూనియ‌న్ అధ్య‌క్షుడిగా చేసిన దందాలు అంద‌రికీ ఎరుకే.. కొంత‌కాలం చంద్ర‌బాబు చెంత‌న‌., కొంత‌కాలం వైఎస్ పంచ‌నా చేరి., ఎన్ని భూములు కొల్ల‌గొట్టారో., ఎన్నిసెటిల్మెంట్లు చేశారో లెక్కలేద‌ని సాటి మీడియా మిత్రులే చెప్పుకుంటుంటారు.. మీ బుద్ది తెలిసి రెండు రాష్ట్రాల్లో ముఖ్య‌మంత్రులు ఇప్పుడు మిమ్మ‌ల్ని దూరం పెట్టిన విష‌యం కూడా లోక‌విధిత‌మే.. అలాంటి మీరు నీతికి, నిబ‌ద్ద‌త‌కి మారుపేరైన ప‌వ‌న్‌పై సాక్షీ గొంతేసుకు ప‌డితే ఎవ‌రు వింటారు.. ఎవ‌రు న‌మ్ముతారు..

Share This:

2,127 views

About Syamkumar Lebaka

Check Also

ఈ ఎన్నిక‌లు పార‌ద‌ర్శ‌క‌మేనా.? పార్టీ కామ‌న్ సింబ‌ల్ ఇండిపెండెంట్‌కి ఇస్తారా.?

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ తీరు ప‌ట్ల స‌ర్వ‌త్ర అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.. అయితే అనుమానాల్ని నివృత్తి చేసే ప్ర‌య‌త్నాలు మాత్రం …

One comment

  1. Superrrrrrrrrrrrrr

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − eight =