Home / జన సేన / ప్ర‌త్య‌ర్ధుల మ‌తిపోగోడుతున్న జ‌న‌సేనుడి చాణ‌క్యం.. జ‌న‌సేనుడా బ‌హుప‌రాక్‌!!! అంటున్న మేధావులు

ప్ర‌త్య‌ర్ధుల మ‌తిపోగోడుతున్న జ‌న‌సేనుడి చాణ‌క్యం.. జ‌న‌సేనుడా బ‌హుప‌రాక్‌!!! అంటున్న మేధావులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాతుకుపోయి ఉన్న రెండు పెద్ద పార్టీల‌కి కంటిలో న‌లుసుగా మారిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., త‌న రాజ‌కీయ చాణ‌క్యంతో మ‌రోసారి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌న‌సులు దోచుకున్నార‌న్న‌ది నిర్వివాదంశం.. ముఖ్యంగా కుల రిజ‌ర్వేష‌న్లు లాంటి సున్నిత‌మైన అంశాల్లో రాజ‌కీయాల్లో ఖాక‌లు తీరిన ప్ర‌త్య‌ర్ధులు ఏం మాట్లాడాలో అర్ధం కాక‌, రోజుకో మాట‌తో కాలం గ‌డుపుతుంటే., తానొప్ప‌క‌, ఎదుటివారిని నొప్పింప‌క త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతూ ఔరా అనిపిస్తున్నారు.. ద‌శాబ్దాల అనుభ‌వం ఉన్న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల్ని ప‌వ‌న్ ఎదుర్కొంటారా అన్న అనుమానం ప్ర‌జ‌ల్లో ముఖ్యంగా త‌ట‌స్థులు, మేధావి వ‌ర్గంలో క‌లిగిన‌ప్పుడు., ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంపై అవిశ్వాసం పెట్ట‌మంటూ ఓ స‌ల‌హా ఇచ్చి మొట్ట‌మొద‌టి సారి త‌న వ్యూహ‌ప్ర‌తివ్యూహాల స‌త్తా చాటారు.. ప‌వ‌న్‌ని సైద్ధాంతికంగా ఎదుర్కోన‌లేక వ్య‌క్తిగ‌త దాడుల‌కి దిగిన సంద‌ర్బంలో మౌనం వ‌హించి., ఎక్క‌డ త‌గ్గాలో త‌న‌కి మాత్ర‌మే తెలుసున‌ని చాటుకున్నారు..

తాజాగా గ‌త కొద్ది రోజులుగా కుల‌ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్ల అంశం తెర‌మీద‌కి వ‌చ్చిన సంద‌ర్బంలో ముఖ్యంగా కాపు రిజ‌ర్వేష‌న్ల అంశంలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఆవేశంతో త‌ప్పులో కాలేయ‌డం., న‌ష్ట‌నివార‌ణార్ధం వెంట‌నే యూట‌ర్న్ తీసుకోవ‌డం వంటి వివాదాస్ప‌ద అంశాలు., జ‌న‌సేనుడి స్పంద‌న ఎలా వుండ‌బోతోంద‌న్న చ‌ర్చ‌కు తెర‌తీసింది.. అయితే కుల ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్లు, అదీ కాపు రిజ‌ర్వేష‌న్ల అంశంపై స్పందిస్తే.. కుల ముద్ర వేయ‌డానికి ప్ర‌త్య‌ర్ధులు క‌త్తులు సిద్ధం చేయడం., మాట్లాడ‌కుంటే కుల‌ద్రోహి అనే ముద్ర వేసేందుకు తెర‌వెనుక మంత్రాంగం న‌డ‌ప‌డం చ‌క‌చ‌కా జ‌రిపోయాయి.. ఆ త‌రుణంలో ప‌వ‌న్ విసిరిన షెడ్యూల్ 9 అస్త్రం, ఇంత అనుభ‌వం ఉన్న త‌మ‌కు ఎందుకు ఆ ఆలోచ‌న రాలేదంటూ ప్ర‌త్య‌ర్ధులు త‌మ‌ను తాము తిట్టుకునేలా చేసింది.. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే ప్ర‌త్య‌ర్ధుల‌కి ఎంతో జ‌ఠిలంగా క‌నిపిస్తున్న స‌మ‌స్య‌ల్ని., ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మంచినీళ్లు తాగినంత తేలిక‌గా ప‌రిష్కార మార్గం చూపుతూ ప‌రిస్థితుల్ని త‌న‌వైపు తిప్పుకుంటున్నారు.. ప్ర‌తి సారీ ఇలాగే జ‌రుగుతుండ‌డంతో ప్ర‌త్య‌ర్ధి శిభిరాల‌కి త‌ల‌బొప్పి క‌డుతోంది..

ఇదంతా ఒక ఎత్త‌యితే ప్ర‌జ‌ల‌కి కూడా ఒక విష‌యం స్ప‌ష్టంగా అర్ధం అయిపోయింది.. సైద్ధాంతిక ప‌రంగా కుల‌మ‌తాల‌కి అతీతంగా రాష్ట్రంలోని ప్ర‌తి పౌరుడికీ న్యాయం చేయ‌గ‌ల స‌త్తా ఉన్న ఏకైక నాయ‌కుడు, ఎలాంటి స‌మ‌స్య‌కి అయినా ప‌రిష్కారం చూప‌గ‌ల లీడ‌ర్ ఒక్క ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాత్ర‌మేన‌న్న న‌మ్మ‌కం జ‌నంలో బ‌ల‌ప‌డిపోతోంది.. దీంతో పోరాట యాత్ర‌లో ఉన్న జ‌న‌సేనుడికి జ‌నం జేజేలు కొడుతున్నారు.. ప‌రిస్థితులు ఇలాగే కొన‌సాగితే మీడియా చెబుతున్న జ‌న‌సేన టార్గెట్ 90 కాస్త 100 దాట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.. అటు మేధావి వ‌ర్గం ఇప్ప‌టికే జ‌న‌సేన ఖాతాలో చేరిపోగా., త‌ట‌స్థులు కూడా త‌లుపులు తెరుచుకు ముందుకి వ‌స్తున్నారు.. జ‌న‌సేన వెంట న‌డిచేందుకు..

Share This:

3,636 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × four =