Home / జన సేన / ప్ర‌భుత్వం-అధికారులు స్పందించాలి.. కానీ జ‌న‌సేవ‌కు జ‌న‌సేన మాత్ర‌మే స్పందిస్తోంది..

ప్ర‌భుత్వం-అధికారులు స్పందించాలి.. కానీ జ‌న‌సేవ‌కు జ‌న‌సేన మాత్ర‌మే స్పందిస్తోంది..

వేస‌వి ఎండ‌లు ముదురుతున్న క్ర‌మంలో బెజ‌వాడ ప‌రిస‌రాల్లో అగ్నిప్ర‌మాదాల ముప్పు కాస్త ఎక్కువ‌గానే పొంచి ఉంటుంది.. పూరిళ్ల‌కు, ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశాలు ఉన్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై అధికారులు ముంద‌స్తుగానే ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల్సి ఉంది.. అయితే ఇక్క‌డ మాత్రం ప్ర‌మాదం జ‌రిగినా యంత్రాంగం ప‌ట్టించుకునే స్థితిలో లేదు.. స్థానిక భ‌వానీపురం హ‌రిజ‌నవాడ‌లో గ‌త‌వారం ప్ర‌మాదం జ‌రిగితే., క‌నీసం రికార్డు చేసుకునేందుకు కూడా అధికారులు ఆ ప్రాంతానికి రాలేదు.. ప్ర‌మాదం విద్యుత్ షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్ల జ‌రిగింద‌ని నిర్ధార‌ణ అయినా., బాధితుల‌కి సాయం అందించేందుకు ప్ర‌భుత్వ‌మూ ముందుకి రాలేదు..

కానీ విష‌యం తెలుసుకున్న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు క‌దిలారు.. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో రోడ్డున ప‌డిన బాధితుల‌ని ప‌రామ‌ర్శించి త‌క్ష‌ణ సాయం అందించారు.. విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన జ‌న‌సేన‌ నాయ‌కుడు అజ‌య్‌వ‌ర్మ ఠాకూర్ బాధిత మ‌హిళ పులివ‌ర్తి చిన్నారికి త‌క్ష‌ణ సాయం కింద 5 వేల రూపాయిలు అంద‌జేశారు.. దెబ్బ‌తిన్న ఇంటి మ‌ర‌మ్మ‌త్తుల నిమిత్తం మ‌రో రెండు వేల రూపాయిలు అంద‌జేశారు.. ప్ర‌భుత్వ యంత్రాంగం తీరు ప‌ట్ల ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు.. క‌ష్టాల్లో ప్ర‌జ‌ల్ని ఆదుకోవాల్సిన అధికారులు ముఖం చాటేస్తే ఎలా అంటూ ప్ర‌శ్నించారు.. త‌క్ష‌ణ‌మే స్పందించి బాధితుల‌కి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేసిన అజ‌య్‌వ‌ర్మ‌, స్పందించ‌కుంటే ఏం చేయాలో కూడా త‌మ‌కు తెలుస‌ని హెచ్చ‌రించారు..

క‌ష్టాల్లో ఉన్నార‌ని తెలుసుకుని వెళ్లి మ‌రీ ప‌లుక‌రించి బాధితుల‌కి త‌క్ష‌ణ సాయం అందించిన జ‌న‌సైనికులు., ఏ అవ‌స‌రం వ‌చ్చినా అండగా ఉంటామ‌ని భ‌రోసా ఇవ్వ‌గా., క‌ష్టాల్లో ఉన్న త‌మ‌ను గుర్తించి, ప‌ట్టించుకున్న జ‌న‌సేన‌కు జీవిత‌కాలం అండ‌గా ఉంటామ‌ని జ‌నం భ‌రోసా ఇస్తున్నారు..

Share This:

1,545 views

About Syamkumar Lebaka

Check Also

చేయి చేయి క‌లిపిన ఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌సైనికులు.. సాటి జ‌న‌సైనికుడికి ఆప‌న్న‌హ‌స్తం..

భావ‌న వెంక‌టేష్‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వీరాభిమాని.. భ‌గ‌త్‌సింగ్ విద్యార్ధి విభాగం స‌భ్యుడు.. చిన్నత‌నంలోనే త‌ల్లిదండ్రుల్ని కోల్పోయిన వెంక‌టేష్‌కి అనుకోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − ten =