Home / జన సేన / ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యమే గిరిజ‌నుల ఉసురు తీసింది.. లాంచీ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై జ‌న‌సేన అధినేత ఫైర్‌..

ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యమే గిరిజ‌నుల ఉసురు తీసింది.. లాంచీ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై జ‌న‌సేన అధినేత ఫైర్‌..

గోదావ‌రి లాంచీ ప్ర‌మాద ఘ‌ట‌న గుండె బ‌రువెక్కించింది..
ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యానికి గురిజ‌నులు బ‌లికావాలా..
దుర్ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు హ‌డావిడి చేస్తే స‌రా..?
స‌మ‌స్య‌కి శాశ్విత ప‌రిష్కార మార్గాలు ఎక్క‌డ‌..?
స‌హాయ కార్య‌క్ర‌మాల్లో జ‌న‌సేన శ్రేణులు..

గోదావ‌రి న‌దిలో లాంచీ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఘాటుగా స్పందించారు.. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం గిరిజ‌నుల పాలిట శాపం కావ‌ద్దు అంటూ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.. ఈ ఘ‌ట‌న‌లో స‌ర్క‌రు, సంబంధిత శాఖ‌ల ఉద్యోగుల నిర్ల‌క్ష్య వైఖ‌రి స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతోందంటూ దుయ్య‌బ‌ట్టారు.. ప్ర‌మాదానికి గురైన లాంచీకి అనుమ‌తి లేదంటే, లోపం ఎవ‌రిదంటూ ప్ర‌శ్నించారు.. జ‌వాబుదారీ త‌నం లేని పాల‌నా విధానాలే అమాయ‌కులైన గిరిపుత్రుల జ‌ల‌స‌మాధికి కార‌ణమ‌న్నారు.. దుర్ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు హ‌డావిడి చేసే పాల‌కులు, ఇలాంటి స‌మ‌స్య‌ల‌కి శాశ్విత ప‌రిష్కారాలు చూపాల‌న్నారు.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కి పాల‌న కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమిత‌మా అంటూ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు..

నిత్యావ‌స‌రాలు, వైద్యం, విద్య‌ల‌తో పాటు ఏ చిన్న ప‌ని ఉన్నా గిరిజ‌నులు న‌దిలోనే ప్ర‌యాణాలు చేస్తూ ఇబ్బందులు ప‌డుతున్నార‌న్న ఆయ‌న‌, పోల‌వ‌రం నిర్వాసితులు అధికారుల ప్ర‌ద‌క్ష‌ణ‌లు చేసి తిరిగి వెళ్తూ ప్రాణాలు కోల్పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని జ‌న‌సేనాని అన్నారు.. గోదావ‌రి లాంచీ ప్ర‌మాద ఘ‌ట‌న గురించి తెలియ‌గానే త‌న గుండెలు బ‌రువెక్కాయ‌న్నారు.. మృతుల కుటుంబాల‌కి సానుభూతి తెలియ‌జేసిన ప‌వ‌న్‌., బాధిత కుటుంబాల‌కి త‌గిన ప‌రిహారం ఇచ్చి ఆదుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు..

కృష్ణా న‌ది బోటు ప్ర‌మాద ఘ‌ట‌న మ‌రుగున ప‌డ‌క ముందే ఈ ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.. ఘ‌ట‌న వివ‌రాలు తెలియ‌గానే, బాధిత కుటుంబాల‌కి అండ‌గా నిలవాల‌ని, స‌హాయ కార్య‌క్ర‌మాల్లో పాలు పంచుకోవాల‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కి ఆయ‌న సూచించారు..

జ‌న‌సేన అధినేత ఆదేశాల‌తో ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కి చెందిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు దేవీప‌ట్నం లాంచి ప్ర‌మాద ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని అక్క‌డ ప‌రిస్థితిని స‌మీక్షించారు.. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో మ‌హిళా కార్య‌క‌ర్త‌లు సైతం పాలుపంచుకున్నారు.. ప్ర‌తిక్ష‌ణం పార్టీ కార్యాల‌యానికి అప్‌డేట్స్ ఇస్తూ వ‌చ్చారు.. బాధితుల‌కి ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు..

లాంచీ ప్ర‌మాదంలో మృతుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెర‌గ‌డానికి కార‌ణాలు కూడా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఆరా తీశారు.. వాస్త‌వానికి లాంచీలో ప్ర‌యాణిస్తున్న అంద‌రికీ ఈత వ‌చ్చు.. అయితే ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం కుర‌వ‌డం వ‌ల్ల‌, లాంచీలోని సిమెంటు బ్యాగులు త‌డ‌వ‌కుండా త‌లుపులు పూర్తిగా మూసేశారు.. దీంతో ఇంత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వ‌చ్చింది.. ఈ విష‌యాన్ని బాధితుల నుంచి తెలుసుకున్న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పార్టీ కార్యాల‌యానికి స‌మాచారం ఇచ్చారు.. సాయంత్రం వ‌ర‌కు ఘ‌ట‌నాస్థ‌లిలోనే ఉండి బాధితుల‌కి త‌మ‌వంతు ఓదార్పు ఇచ్చారు..

Share This:

2,186 views

About Syamkumar Lebaka

Check Also

ఆంధ్రా ప్యారెస్‌లో అడుగ‌డుగునా జ‌న‌సేనానికి బ్రహ్మ‌ర‌ధం ప‌ట్టిన జ‌నం..

అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకునేందుకు తెనాలి బ‌య‌లుదేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు మ‌రపురాని జ్ఞాప‌కంలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 + thirteen =