Home / పోరు బాట / ప్ర‌మాదాల నివార‌ణ‌కు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోరా..? విద్యాశాఖ మంత్రికి విశాఖ జ‌న‌సైన్యం లేఖాస్త్రం..

ప్ర‌మాదాల నివార‌ణ‌కు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోరా..? విద్యాశాఖ మంత్రికి విశాఖ జ‌న‌సైన్యం లేఖాస్త్రం..

ఎప్పుడూ చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకోవ‌డ‌మేనా..? ప‌్ర‌మాదాల నివార‌ణ‌కు ముంద‌స్తు జాగ్ర‌త్తలు ఉండ‌వా..? ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించే చ‌ర్య‌లు ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా ప్ర‌భుత్వాలు ఎందుకు తీసుకోలేవు.. పుష్క‌రాల్లో జ‌రిగిన తొక్కిస‌లాట ద‌గ్గ‌ర్నుంచి, ఫెర్రీ ప‌డ‌వ ప్ర‌మాదం.. తాజాగా య‌రాడ ఘాట్ రోడ్డులో స్కూల్ బ‌స్సుల బ్రేక్ ఫెయిల్ ఘ‌ట‌న‌.. చివ‌రి సంఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోక‌పోయినా., అభంశుభం తెలియ‌ని చిన్నారి హృద‌యాలు మృత్యువుని దాదాపు అతిద‌గ్గ‌ర‌గా చూశాయి.. సుమారు 70 మందికి పైగా చిన్నారులు గాయాల‌పాల‌య్యారు.. ఘ‌ట‌న జ‌రిగాక పోస్టుమార్టం చేయ‌డం మిన‌హా., ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌లు ఏ అంశంలో తీసుకుంటున్నారు..? ప‌దే ప‌దే ప్ర‌భుత్వాన్ని జ‌న‌సేన అధినేత ప్ర‌శ్నిస్తున్నా., బ‌దులెక్క‌డ‌..?

య‌రాడ ఘాట్ రోడ్డులో అన‌కాప‌ల్లి సిటీ ప‌బ్లిక్ స్కూల్‌కి చెందిన బ‌స్సులు బ్రేకులు ఫెయిల్ అయ్యి., అదుపుత‌ప్పి., ఒక‌దాన్ని ఒక‌టి ఢీ కొన్నాయి.. ఈ ఘ‌ట‌న‌లో 73 మంది పిల్ల‌లు గాయ‌ప‌డ‌గా., కొంద‌ర్నీ కేజీహెచ్‌లో, ఇంకొద‌ర్ని కేర్ ఆసుప‌త్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.. ఈ ఘ‌ట‌న‌ని జ‌న‌సేన పార్టీ విశాఖ విభాగం తీవ్రంగా ప‌రిగ‌ణించింది.. స్కూల్ బ‌స్సుల నిర్వ‌హ‌ణ‌, ఫిట్ నెస్ అనే అంశాల‌పై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావుని ప్ర‌శ్నించారు.. ప్ర‌యివేటు స్కూల్ యాజ‌మాన్యాలు నిబంధ‌న‌ల‌కి నీళ్లు వ‌దిలి., విద్యార్ధుల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్నాయి.. ఫిట్ నెస్ లేని బ‌స్సుల‌ని రోడ్ల‌పైకి వ‌దులుతున్నాయి.. ఇలాంటి బ‌స్సుల‌పైనా., వాటిని నిర్వ‌హిస్తున్న యాజ‌మాన్యాల‌పైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు విజ్ఞ‌ప్తి చేస్తూనే ఉన్నాం.. అయినా ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న క‌రువ‌య్యింది అంటూ., మంత్రిని నిల‌దీశారు.. ప్ర‌మాదం తాలూకు పూర్తి వివ‌రాలతో ఓ లేఖాస్త్రం సంధించారు..

ఇలాంటి ప్ర‌మాదాలు సంభ‌వించ‌డానికి ప్ర‌భుత్వ‌మే అవ‌కాశం క‌ల్పిస్తోంద‌ని., అధికారుల ధోర‌ణి మార‌కుంటే విద్యార్ధుల కోసం జ‌న‌సేన ప్ర‌త్య‌క్ష పోరాటాల సైతం సిద్ధంగా ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.. రెగ్యుల‌ర్‌గా అన్ని ప్ర‌యివేటు క‌ళాశాల‌ల్లో బ‌స్సులు బ్రేక్ చేయించారో లేదో త‌నిఖీలు నిర్వ‌హించాల‌ని సూచించారు.. స్కూల్ బ‌స్సు ప్ర‌మాదాల‌పై ఓ ప్ర‌త్యేక క‌మిటీతో విచార‌ణ జ‌రిపించాల‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు మంత్రికి రాసిన విజ్ఞాప‌న ప‌త్రంలో కోరారు.. య‌రాడ ఘాట్‌రోడ్డులో జ‌రిగిన ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన విద్యార్ధుల వైద్యానికి అయ్యే ఖ‌ర్చు పూర్తిగా ప్ర‌భుత్వ‌మే భ‌రించాల‌ని డిమాండ్ చేశారు..

విశాఖ‌లో ఘ‌ట‌న జ‌రిగింది కాబ‌ట్టి., అక్క‌డ తూతూ మంత్రంగా చ‌ర్య‌లు తీసుకోవ‌డం కాదు జ‌న‌సేన‌కి కావాల్సింది.. ఏటా విద్య‌ర్ధుల ప్రాణాలు తీస్తున్న స్కూల్ బ‌స్సుల ఫిట్‌నెస్‌ వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తోంది..

Share This:

766 views

About Syamkumar Lebaka

Check Also

కాకినాడ సెజ్‌లో జ‌న‌సేనాని.. బాధితుల వెత‌లు విన్న ప‌వ‌న్‌.. విత్ ఫోటో గ్యాల‌రీ..

కాకినాడ సెజ్‌..కేవీ రావు అక్ర‌మాల‌పై బాధితుల పోరాటానికి మ‌ద్ద‌తుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురువారం ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించారు.. యూ.కొత్త‌ప‌ల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven − two =