Home / పెన్ పోటు / ప్ర‌శ్న‌కి.. ప్ర‌శ్న.. బ‌దుల‌వ్వ‌దు సింగ్‌గోరూ.. ముందు తెలుగు నేర్చుకోండి..

ప్ర‌శ్న‌కి.. ప్ర‌శ్న.. బ‌దుల‌వ్వ‌దు సింగ్‌గోరూ.. ముందు తెలుగు నేర్చుకోండి..

తెలుగు రాదు.. అర్ధం కాదు.. వీరంతా తెలుగు రాష్ట్రాల్లో పార్టీల వ్య‌వ‌హారాలు చూసేస్తారు.. ఎవ‌రైనా విమ‌ర్శ చేస్తే., దానికి అర్ధం తెలియ‌దు.. క‌నీసం క్లియ‌ర్‌గా తెలుసుకోవాల‌ని కూడా అనుకోరు.. ప‌క్క‌న ఉన్న‌వారు ఏం చెబితే అది మాట్లాడేసి., ప్ర‌త్య‌ర్ధుల‌కి కౌంట‌ర్ ఇచ్చేశామ‌ని చంక‌లు గుద్దుకుంటారు.. నాటి కాంగ్రెస్ నుంచి నేటి బీజేపీ వ‌ర‌కు పార్టీల దుస్థితి ఇది.. నాడు కాంగ్రెస్ పార్టీని దిగ్విజ‌య్‌సింగ్ ఏపీలో అడ్ర‌స్ గ‌ల్లంతు చేసేలా చేస్తే., ఇప్పుడు బీజేపీని భ‌ష్టుప‌ట్టించేందుకు ఇంకో సింగ్‌గారు త‌యార‌య్యారు.. ఆయ‌నే సిద్దార్ధ‌నాధ్ సింగ్ బీజేపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జ్‌.. మాజీ ప్ర‌ధాని లాల్‌బ‌హ‌దూర్ శాస్త్రి గారి మ‌నుమ‌డిగా క‌మ‌ల‌ద‌ళంలో చేరిన ఈయ‌న‌గారికి వెంక‌య్య‌నాయుడిపై ఉన్న స్వామిభ‌క్తే ఏపీ వ‌ర‌కు తీసుకువ‌చ్చింది.. ఆర్ధిక న‌ష్టాల్లో ఉన్న సిద్ధార్ధ‌నాథ్‌ని మ‌న నాయుడుగారే ఆదుకున్నార‌ని టాక్‌.. అప్ప‌టి నుంచి ఆయ‌న‌కు వెంక‌య్య‌కి అనుచ‌ర‌గ‌ణంలో చేరిపోయిన సంగ‌తి బ‌హిరంగ ర‌హ‌స్యమే.. అందుకే సింగ్‌గారికి పార్టీ ఏపీ వ్య‌వ‌హారాలు అప్ప‌గించారు.. అందుకే వెంక‌య్య తానా అన‌క ముందే సిద్దార్ధ్ తందాన అనేస్తున్నారు…

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై సిద్ధార్ధ‌నాధ్‌సింగ్ ప్రేలాప‌న‌ల వెనుక ఉన్న మేట‌ర్ అది.. ఈయ‌న‌గారు జ‌న‌సేనాని ట్విట్ట‌ర్ ఫైట్‌పై స్పందించారు.. గ‌తంలో సింగ్‌గారు ప్ర‌త్యేక ప్యాకేజీకి సంబంధించి ఐదు ప్ర‌శ్న‌ల‌కి గ‌తంలోనే స‌మాధానాలు కోరారంట‌.. అనంత వేదిక‌గా జ‌రిగిన సీమాంధ్ర హ‌క్కుల చైత‌న్య స‌భ‌లో అచ్చ తెలుగులో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మీ గుట్టు మొత్తం బ‌ట్ట‌బ‌య‌లు చేశారుగా.. మ‌ర్చిపోయా మీకు తెలుగు రాద‌దు క‌దా.. మీర‌డిగిన ప్ర‌శ్న‌ల‌తో పాటు అడ‌గ‌ని వాటికి కూడా జ‌న‌సేనాని అనంత‌లో బ‌దులిచ్చేశారు.. మీరు ఆయ‌న‌పై పిచ్చి ప్రేలాప‌న‌లు పేలే ముందు ఓ ట్రూట్రాన్స్‌లేట‌ర్‌ని ద‌గ్గ‌ర పెట్టుకుని ప‌వ‌న్ ఉప‌న్యాసం పాఠం మొత్తం వినండి.. ఆ తర్వాత ఎలాగూ మీరు నోరు తెర‌వ‌లేరు..

ఇక గోవ‌ధ‌కి సంబంధించి ప‌లు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే చ‌ట్టాలు ఉన్నాయని సెల‌విచ్చారు.. ఏఏ రాష్ట్రాల్లో ఏఏ చ‌ట్టాలు ఉన్నాయో వివ‌రిస్తే భాగుండేది.. ఏటీఎంలు, బ్యాంకుల ఎదుట ప‌డిగాపులు కాచి జ‌నం ప్రాణాలు కోల్పోతున్నారు.. దానికి మీ విధానాలే కార‌ణం అని ఇంగ్లీష్‌లో ప‌వ‌న్ ట్విట్ చేస్తే., సింగ్‌గారు అధ్య‌య‌నం చేసి మాట్లాడాలంటారు.. మీరు ఇంగ్లీషులో కూడా వీకా ఏంటి..? మీరు నోట్లు ర‌ద్దు చేసింది నిజం., ఎలాంటి ముంద‌స్తు క‌స‌ర‌త్తు లేకుండా తీసుకున్న మీ పెద్ద‌ల నిర్ణ‌యం వ‌ల్ల జ‌నం ప్రాణాలు కోల్పోతున్న‌దీ నిజం.. దీనికి వేరే అధ్య‌య‌నం ఎందుకో అర్ధం కాక జ‌నం బుర్ర‌గోక్కుంటున్నారు..

అస‌లు త‌ప్పు మీది కాదులెండి… త‌మ‌కు భ‌జ‌న చేయించుకునేందుకు మిమ్మ‌ల్ని ఇక్క‌డ ఇన్‌ఛార్జ్‌గా వేయించుకున్న వెంక‌య్య‌గారిది.. జాతీయ‌స్థాయిలో చ‌క్రం తిప్ప‌గ‌ల మేథావులు ఎంతో మంది తెలుగు రాష్ట్రాల్లో ఉంటే., వారి ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీయ‌డానికి మీకు ఏపీ ఇన్‌ఛార్జ్ పోస్టు ఇచ్చార‌నుకుంటా.. తెలుగు వారంటే వెన్నెముక లేనివార‌ని మీ పార్టీ పెద్ద‌ల ఉద్దేశం క‌దా మ‌రి.. చావ‌చ‌చ్చిన నాయ‌కులు ఉండ‌బ‌ట్టే హోదాని కాస్తా చ‌ట్ట‌బ‌ద్ద‌త‌లేని ప్యాకేజీగా మార్చేశారు.. ఇంకా మీరు క‌బుర్లు చెబుతున్నారు.. మేం వింటున్నాం..

Share This:

2,005 views

About Syamkumar Lebaka

Check Also

నిజం నిప్పులాంటిది.. ఆల‌స్యం అయినా అబ‌ద్ధాన్ని ద‌హించివేస్తుంది..

సత్యమేవ జయతే అంటూ దెయ్యాలు “వేదాలు” వల్లిస్తున్నాయి? దుర్మార్గులు “సన్మార్గం” గురించి మాట్లాడుతున్నారు! ప్రస్తుత మన రాజకీయ-మీడియా పరిస్థితులు చూస్తుంటే, …

One comment

  1. It’s really true that the questions raised by Siddarthnadh Singh were already answered by PSPK in his meeting at Anantapur..

    I think Still he hadn’t listened the speech of PSPK at Anantapur meeting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

11 + 15 =