Home / పవన్ టుడే / ప‌తాక స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో కాట‌మ‌రాయుడు..

ప‌తాక స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో కాట‌మ‌రాయుడు..

img-20161020-wa0010krayadu12
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, శృతిహాస‌న్ జంట‌గా డాలీ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్న కాట‌మ‌రాయుడు\చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది.. హైద‌రాబాద్ శివార్ల‌లో ఈ చిత్రానికి సంబంధించి ప‌తాక స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద చిత్రించాల్సిన సీన్ల‌ను పూర్తి చేసే ప‌నిలో ద‌ర్శ‌కుడు ఉన్నాడు.. వ‌చ్చే నెల నుంచి జ‌న‌సేనాని కాల్షీట్లు క‌ష్ట‌త‌రం కానున్న నేప‌ధ్యంలో సాధ్య‌మైనంత వ‌ర‌కు., నెలాఖ‌రు లోపు ఆయ‌న‌కి సంబంధించిన యాక్టింగ్ పార్ట్ పూర్తి చేయాల‌ని ద‌ర్శ‌క‌,నిర్మాత‌లు భావిస్తున్నారు.. న‌వంబ‌ర్ మొద‌టి వారంలో త్రివిక్ర‌మ్ దేవుడే దిగివ‌చ్చినా చిత్రం సెట్స్ పైకి వెళ్ల నుండ‌డంతో పాటు పార్టీ ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల్లో కూడా పాల్గొనాల్సి ఉంది.. న‌వంబ‌ర్ మూడో వారంలో ఓ ప‌బ్లిక్ మీటింగ్ ప్లాన్ చేస్తున్న‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి.. ప్ర‌త్యేక హోదా సాధ‌నే ప్ర‌ధాన అజెండాగా త‌న పోరాటాన్ని కొన‌సాగించాల‌ని భావిస్తున్న ప‌వ‌ర్‌స్టార్‌., జిల్లాకో బ‌హిరంగ‌స‌భ నిర్వ‌హించేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు.. వ‌చ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో పార్టీ కార్య‌క‌లాపాల‌పై దృష్టి సారించాల‌ని భావిస్తున్న ఆయ‌న‌., సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఒప్పుకున్న మూడు సినిమాలు పూర్తి చేయాల‌నుకుంటున్నారు.. దీంతో ప‌గ‌లు, రాత్రి తేడా లేకుండా నిర్విరామంగా షూటింగుల్లో పాల్గొంటూ ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు త‌న వంతు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్నారు..

Share This:

About Syamkumar Lebaka

Check Also

గెరుడౌ ఉక్కు క‌ర్మాగార మృతుల కుటుంబాల‌కి న్యాయం చేయాలి.. జ‌న‌సేనాని డిమాండ్‌..

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రికి స‌మీపంలోని గెరుడౌ ఉక్కు ప‌రిశ్ర‌మ‌లో విష‌వాయువులు వెలివ‌డి ఆరుగురు కార్మికులు మృతి చెందిన ఘ‌ట‌న‌పై జ‌న‌సేన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 + fifteen =

%d bloggers like this: