Home / జన సేన / ప‌ద‌..ప‌ద‌..ప‌ద‌..ప‌ద అంటూ యువ‌త‌ని ఉర్రూత‌లూగిస్తున్న క‌వాతు గీతం.

ప‌ద‌..ప‌ద‌..ప‌ద‌..ప‌ద అంటూ యువ‌త‌ని ఉర్రూత‌లూగిస్తున్న క‌వాతు గీతం.

   ధ‌వ‌ళేశ్వం బ్యారేజ్ అద‌రాలి.. జ‌న‌సేన క‌వాతు గురించి దేశం మొత్తం మాట్లాడుకోవాలి.. ఏం చేస్తారో చేయండి అంటూ జ‌న‌సేన అధినేత ఇచ్చిన పిలుపుతో జ‌న‌సైన్యం.. జ‌న ఉప్పెన‌గా మారి ఇప్ప‌టికే రాజ‌మండ్రి దిశ‌గా దూసుకువ‌స్తోంది.. ఈ క‌వాతుకి ఇప్ప‌టికే వామ‌ప‌క్ష పార్టీలు సంఘీభావం ప్ర‌క‌టించ‌గా, ప్ర‌జా సంఘాలు, ద‌ళిత సంఘాలు కూడా జ‌న‌సేనుడికి అండ‌గా మేము సైతం అంటూ ముందుకు వ‌స్తున్నాయి.. ఆంధ్రుల‌కి జ‌రిగిన అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తూ, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పాల‌కుల్ని నిల‌దీస్తూ, జ‌నం త‌రుపున నిర‌స‌న తెల‌పాల‌న్న ల‌క్ష్యంతో  జ‌న‌సేన అధినేత ఈ క‌వాతుకి పిలుపునిచ్చారు.. ఇప్పటికే ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల నుంచి మాత్ర‌మే కాకుండా, ఉభ‌య తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జ‌నం త‌ర‌లివ‌స్తున్న‌ట్టు రిపోర్టులు అందుతున్నాయి.. ప్ర‌త్య‌ర్ధుల వెన్నులో వ‌ణుకు పుట్టించే స్తాయిలో ఈ క‌వాతు ఉంటుంద‌న్న న‌మ్మ‌కాన్ని జ‌న‌సేన శ్రేణులు వ్య‌క్తం చేస్తున్నాయి..
నూత‌న త‌రం రాజ‌కీయాల‌కి ఊత‌మిస్తూ.. నిర్వ‌హించ‌నున్న ఈ క‌వాతుకి త‌ర‌లివ‌చ్చే జ‌న‌సైనికుల్లో మ‌రింత ఉత్సాహం నింపేందుకు పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఓ ప్ర‌త్యేక గీతాన్ని విడుద‌ల చేశారు. ఆదివారం ఉద‌యం జ‌న‌సేన పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఈ గీతాన్ని ఆవిష్క‌రించారు… పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి ముత్తంశెట్టి కృష్ణారావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ప‌ద‌..ప‌ద‌..ప‌ద‌..ప‌ద మంటూ జ‌న‌సైనికుల్లో ఈ పాట ఉరిమే ఉత్సాహాన్ని ర‌గులుస్తోంది.. రామ‌జోగ‌య్య శాస్త్రి ర‌చించిన ఆ పాట‌కి థ‌మ‌న్ బాణీలు అందించారు.. మ‌ధ్య మ‌ధ్య జ‌న‌సేన అధినేత గుండెల నిండా ధైర్యాన్ని నూరిపోస్తుంటే.. పాట విన్న ప్ర‌తి ఒక్క‌రికీ రోమాలు నిక్క‌బొడుచుకునే స్థాయిలో ఉంది.. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన క్ష‌ణాల్లో … ప‌ద‌..ప‌ద‌..ప‌ద‌.. అంటూ సామాజిక మాధ్య‌మాల‌ని కుదిపేస్తోంది..
ఎంతో పని ఒత్తిడి ఉన్నా కవాతు అని అడగ్గానే పాటను అందించిన రామజోగయ్య శాస్త్రికి, థమన్ కి జనసేన అధినేత కృతజ్ఞతలు తెలిపారు.. ఆ ఉరిమే ఉత్సాహం తో కూడిన పద..పద..పద..పద.. మీ కోసం..

Share This:

1,614 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 1 =