Home / జన సేన / ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మావేశాల్లో భాగంగా రెండ‌వ రోజు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూర్పుగోదావ‌రి జిల్లాల నుంచి పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన అభ్య‌ర్ధుల‌తో అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌మీక్ష నిర్వ‌హించారు.. జ‌న‌సేనాని ప్ర‌తి అభ్య‌ర్ధితో వ్య‌క్తిగ‌తంగా మాట్లాడుతూ.. అభ్య‌ర్ధుల్లో ధైర్యం నింపుతూ, పోరాట స్ఫూర్తిని నింపుతూ దిశానిర్ధేశం గావిస్తున్నారు.. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ప‌ద్ద‌తిగా జ‌ర‌గ‌లేద‌న్న అభిప్రాయాన్ని ప‌వ‌న్ వెలిబుచ్చారు.. ఎన్నిక‌లు స‌రైన ప‌ద్ద‌తిలో జ‌రిగి ఉంటే ఫ‌లితాలు మ‌రోలా ఉండేవ‌ని తెలిపారు.. అయినా ధైర్యంగా పోరాటం చేద్దామంటూ పిలుపునిచ్చారు.. జ‌న‌సేన ఒక ఎన్నిక‌ల కోసం మొద‌లుపెట్టిన ప్ర‌యాణం కాద‌న్న ఆయ‌న‌., 2014లో పార్టీ ప్రారంభించిన‌ప్పుడు, ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి రాజ‌కీయ శూన్య‌తా లేద‌న్నారు.. తాజా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అందుబాటులో ఉన్న ప‌రిమిత వ‌న‌రుల‌తో టీడీపీ, వైసీపీల‌తో పాటు కేంద్రంలోని బీజేపీతో పారాటం చేశామన్నారు.. పార్టీ ప‌ట్ల అమిత‌మైన విశ్వాసం క‌లిగిన ప్ర‌తి ఒక్క‌రూ పార్టీకి అండ‌గా నిల‌బ‌డ్డార‌ని తెలిపారు.. ఫ‌లితాలు ప్ర‌తికూలంగా వ‌చ్చిన నేప‌ధ్యంలో దిగులు చెంద‌కుండా ఎవ‌రికి వారు స్వీయ ప‌రిశీల‌న చేసుకుంటూ ముందడుగు వేద్దామంటూ పిలుపునిచ్చారు.. ప్ర‌జ‌లు ఇబ్బందులు, స‌మ‌స్య‌ల్లో ఉన్న‌ప్పుడు వారి కోసం ఎలం నిలబ‌డ్డాం అన్న‌ది, మేమున్నాం అన్న భ‌రోసా ఇవ్వ‌డం ముఖ్య‌మంటూ ఉద్భోద‌చేశారు.. ఎన్నిక‌ల‌తో సంబంధం లేకుండా జ‌నంతో మమేకం కావాల‌ని పిలుపునిచ్చిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., స్థానిక ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు.. ఎన్నిక‌ల కోసం ఓ రాష్ట్ర స్థాయి క‌మిటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు.. జిల్లా స‌మావేశాలు పూర్త‌య్యాక ఈ అంశంపై దిశా నిర్ధేశం చేయ‌నున్నామ‌న్నారు.. క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్‌ను పున‌రుత్తేజం చేసి బ‌లోపేతం చేయాల్సిన స‌మ‌యం ఇదే అంటూ అభ్య‌ర్ధుల‌కు దిశానిర్ధేశం చేశారు..

జిల్లా స్థాయి స‌మావేశాల్లో సాధ్య‌మైనంత ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతూ అభ్య‌ర్ధుల అభిప్రాయాలు తెలుసుకోవ‌డంతో పాటు గ్రౌండ్ రియాలిటీని అవ‌గ‌తం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.. అవ‌స‌రం అయిన చోట వారికి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తూ., భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ వివ‌రిస్తున్నారు.. శ‌నివారం విశాఖ‌, ప్ర‌కాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల అభ్య‌ర్ధుల‌తో స‌మీక్షా స‌మావేశం ఉంటుంది..

Share This:

397 views

About Syamkumar Lebaka

Check Also

ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్‌ల‌ను ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌

పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మావేశాల అనంత‌రం కృష్ణా జిల్లాకి సంబంధించి రెండు పార్ల‌మెంట్ సెగ్మెంట్‌ల ప‌రిధిలోని ఆరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌ఛార్జ్‌ల‌ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 + 9 =