Home / జన సేన / ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌స్తుత ఆస్తులు-అప్పుల వివ‌రాలు తెలుసా..?

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌స్తుత ఆస్తులు-అప్పుల వివ‌రాలు తెలుసా..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. సినిమాల్లో అయినా, రాజ‌కీయాల్లో అయినా ఆయ‌న మిస్ట‌ర్ క్లీన్‌.. రాజ‌కీయాల్లోకి రాక‌పూర్వం ఏటా రూ. 25 కోట్ల రూపాయిలు టాక్స్ రూపంలో చెల్లించిన జ‌న‌సేనాని., పాలిటిక్స్‌లో ఉన్న‌దంతా ఊడ్చేశారు.. చివ‌రికి చిన్న చిన్న ఆస్తులు మాత్ర‌మే ఆయ‌న‌కి మిగిలాయి.. ప్ర‌స్తుతం ఆయ‌న, ఆయ‌న కుటుంబ స‌భ్యుల ఆస్తుల విలువ ఎంత అనే అంశం ఎవ్వ‌రికీ తెలియ‌దు.. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు ఆస్తులు, కేసులు త‌దిత‌ర వివ‌రాల‌తో అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల్సి ఉంటుంది.. దీంతో ప్ర‌స్తుతం ప‌వ‌న్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యుల పేరిట ఉన్న ఆస్తుల విలువ‌ ఎంత అనే విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య, బిడ్డ‌ల పేర సుమారు రూ. 55 కోట్ల వ‌ర‌కు ఉంది.. వివ‌రాల్లోకి వెళ్తే అఫిడ‌విట్‌లో జ‌న‌సేన అధినేత తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఆయ‌న పేరిట ఉన్న చ‌రాస్థులు రూ. 12 కోట్లుగా ఉంది.. స్థిరాస్తుల విలువ రూ 40.81 కోట్లుగా చూపారు.. ఇక భార్య బిడ్డ‌ల పేరిట ఉన్న ఆస్తులు మ‌రో రూ. 3.2 కోట్లుగా పేర్కొన్నారు..ఇవ‌న్నీ ప‌క్క‌న‌పెట్టేస్తే అప్పులు కూడా రూ. 33.72 కోట్లు ఉన్న‌ట్టు ప‌వ‌న్ తెలిపారు..

============================

Share This:

411 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 + twelve =