Home / పవన్ టుడే / ప‌వ‌న్‌జీ.. ఇదిగో ఇల్లు.. మీకు న‌చ్చితే ఏలూరులో ఇదే పార్టీ ఆఫీస్ ..!

ప‌వ‌న్‌జీ.. ఇదిగో ఇల్లు.. మీకు న‌చ్చితే ఏలూరులో ఇదే పార్టీ ఆఫీస్ ..!

house

ఏలూరులో తాను ఉంటానికి ఇల్లు చూడ‌మ‌ని జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అలా ఆదేశించారో లేదో.. మా ఇల్లు ఉంది తీసుకోండి.. మా ఇల్లు ఇస్తాం తీసుకోండి.. అంటూ చాలా మంది ఆయ‌న‌కి ఇల్లు ఇచ్చేందుకు ఎగ‌బ‌డ్డారు.. అది కూడా నామ‌మాత్ర‌పు అద్దె చెల్లిస్తే చాలంట‌.. అయితే పార్టీ కార్యాల‌యం కూడా అదే కాబ‌ట్టి., రాష్ట్ర వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా., తాను బ‌య‌టికి వెళ్లేందుకు కూడా ఇరుకుగా ఉండే ఏలూరు రోడ్ల‌లో ఇరుక్కుపోకుండా., హెవీ క్రౌడ్ వ‌చ్చినా త‌ట్టుకునేలా ఇంటి చుట్టూ ప‌రిస్థితులు ఉండేలా ఏర్పాటు చేయాల‌ని., స్థానిక పార్టీ శ్రేణుల‌కి ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు.. ఐదో నంబ‌ర్ జాతీయ ర‌హ‌దారికి కేవ‌లం అర కిలోమీట‌రు దూరంలో అలాంటి ఓ ఇంటిని ఏలూరు ఫ్యాన్స్ ఎంపిక చేశారు.. చంద్ర‌శేఖ‌ర్ అనే ఆసామి ఈ ఇంటిని ప‌వ‌న్‌కి ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చారు కూడా.. దాదాపు ఇదే ఏపీలో జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం అంటూ ఇప్ప‌టికే వార్త‌లు కూడా వ‌చ్చేశాయి.. జ‌న‌సేనాని ఓకే చేయ‌డ‌మే త‌రువాయి అంట‌.. త‌న ఎంట్రీ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కి కొత్త క‌ష్టాలు మొద‌ల‌వ కూడ‌ద‌న్న‌ది జ‌న‌సేనాని పాల‌సీ.. అందుకే విజ‌య‌వాడ‌, గుంటూరుల‌ని కాద‌ని త‌న కార్యాల‌యం ఏలూరులో ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.. అటు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకి చెందిన అభిమానుల కోరిక కూడా అదే కావ‌డంతో., వారి ప్ర‌పోజ‌ల్‌కి ప‌వ‌న్ వెంట‌నే గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశారు..

ఇక ప‌వ‌న్ ఎంట్రీ వార్త ఇప్ప‌టికే జిల్లాలో స‌రికొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీసింది. ప‌వ‌న్ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తారు..? ఏలూరా..? పాల‌కొల్లా..? ఇంకేదైనా నియోజ‌క‌వ‌ర్గ‌మా..? ఇలా వార్తా ప‌త్రిక‌లు కూడా ఎవ‌రికి తోచిన క‌థ‌నాన్ని వారు రాసేసుకుంటున్నారు. కొంద‌రు పాల‌కొల్లు అంటే., కొంద‌రు ఏలూరు అంటూ సీరియ‌స్ వాదోప‌వాద‌న‌లు మొద‌ల‌య్యాయి.. దీంతో జిల్లాలోని సిట్టింగ్‌లు ఎక్క‌డ త‌మ కుర్చీ కింద‌కి నీళ్లు వ‌స్తాయోన‌ని కంగారు ప‌డుతున్నారు..

Share This:

1,497 views

About Syamkumar Lebaka

Check Also

జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ దిశ‌గా ప‌వ‌న్ అడుగులు.. గాజువాక ఖ‌ర్చు ఎంతో తెలుసా..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధులు గెలుపు కోసం కోట్ల రూపాయిలు కుమ్మ‌రించి ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకు నానా పాట్లు ప‌డ‌తారు.. అయితే ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 − 7 =