Home / పాలి 'ట్రిక్స్' / ప‌వ‌న్‌ది ఉడుకు ర‌క్త‌మే.. పోరాటానికి కావ‌ల్సింది అదే.. పార్టీ మారిన పాత మంత్రిగారు.

ప‌వ‌న్‌ది ఉడుకు ర‌క్త‌మే.. పోరాటానికి కావ‌ల్సింది అదే.. పార్టీ మారిన పాత మంత్రిగారు.

113_annayyagari-sai-prathap

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా క‌ధ‌న‌రంగంలోకి దూకిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌ని చూసి అటు అధికార పార్టీ, ఇటు విప‌క్షం రెండు ఉలిక్కిప‌డుతున్నాయి.. ప‌వ‌న్‌ని ఎలా అడ్డుకోవాలో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ముప్పేటదాడులు మొద‌లు పెట్టాయి.. ఆయా పార్టీల వ్యూహాలు రెండు మూడు ర‌కాలుగా ఉంటున్నాయి.. ఒక‌టి త‌మ అనుంగ మీడియాతో విష‌ప్ర‌చారం చేయించ‌డం.. జ‌న‌సేనాని అనంత స‌భపై ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన మ‌రుక్ష‌ణం ఓ వార్త వ‌చ్చింది.. ప‌వ‌న్ హోదా పోరులో టైమింగ్ లేద‌ని., అది ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి చెందిన క‌థ‌న‌మే.. అయితే ఆశ్చ‌ర్యంగా ఆ మ‌రుస‌టి దిన‌మే విప‌క్ష‌నేత జ‌గ‌న్‌, ఓ యువ‌జ‌న స‌భ‌లో మొత్తం ప్ర‌త్యేక హోదా అంశ‌మే ప్ర‌స్తావించారు.. ఈ రెండు అంశాలు ప‌వ‌న్ పోరాటానికి వ‌స్తున్న స్పంద‌న చూసి దాన్ని ఎలాగైనా హైజాక్ చేయాల‌ని స‌ద‌రు నేత తిప్ప‌లు ప‌డుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది..

ఇక అధికార పార్టీ నేత‌ల‌యితే కేంద్ర విధిలించిన ప్యాకేజీతో తెగ ఖుషీ అయిపోయిన‌ట్టు క‌న‌బ‌డుతున్నారు.. రాష్ట్ర ప్ర‌జ‌లు ఏమైపోతే మాకెందుకు ఆ ప్యాకేజీ పైస‌లు మా ముఖాన కొడితే., అధికారంలో ఉన్న ఈ రెండేళ్లు నాలుగు రాళ్లు వెన‌కేసుకోవ‌చ్చ‌న్న ఆత్రుత వారి మాట‌ల్లో విన‌బ‌డుతోంది.. దీనికి జ‌న‌సేనాని చేసే ఉద్య‌మం ఎక్క‌డ మొకాల‌డ్డు అవుతుందోన‌న్న కంగారు క‌న‌బ‌డుతోంది.. ఇప్ప‌టికే కేంద్ర మంత్రులుగా ఉన్న కొంద‌రు టీడీపీ నేత‌లు, రాష్ట్ర ప్ర‌జ‌ల ఓట్ల‌తో ప‌ద‌వుల్లో కులుకుతున్న మ‌రికొంద‌రు ఇప్ప‌టికే ప్యాకేజీ చాలు., ప‌వ‌న్ పోరు వృధా అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేసేశారు కూడా.. వీరంద‌రికీ కావ‌ల్సింది.. వారి మీద అపార‌మైన న‌మ్మ‌కంతో ఓట్లేసిన ప్ర‌జ‌ల సంక్షేమం కాద‌న్న‌ది తేట‌తెల్ల‌మ‌వుతోంది..

ఇక మ‌రో బ్యాచ్ వీరికి అధికార‌మే ప‌ర‌మావ‌ధి., రాజ‌కీయ నిరుధ్యోగాన్ని వీరు అస‌లు జీర్ణించుకోలేరు.. కాస్త వెలుతురు మంద‌గించిన ప్ర‌తిసారీ., ప‌వ‌న్ పాట పాడేసి., ప‌వ‌ర్‌స్టార్ అనే సూర్యుడి కాంతిని త‌మ‌పై ప్ర‌స‌రింప చేసుకోవ‌డ‌మే వీరి టార్గెట్‌.. వీరికి సొంత అజెండాలు, నైతిక విలువ‌లు అస‌లు ఏ మాత్రం ఉండ‌వు.. మీరు మాకు వ‌ద్దంటూ జ‌నం చీ కొట్టినా., తుడిచేసుకుని ప‌క్క పార్టీలోకి పోతారు.. ఇప్పుడు వీరి తాజా ల‌క్ష్యం ప‌వ‌న్ క‌ళ్యాణే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ది ఉడుకు ర‌క్త‌మంట‌, రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేదంట‌.. కేంద్రంలో మంత్రి ప‌ద‌వి వెల‌గ‌బెట్టిన సాయిప్ర‌తాప్ అనే కాంగ్రెస్ జంప్ జిలానీ, ప్ర‌స్తుత టీడీపీ నేత చేసిన తాజా వ్యాఖ్య‌లివి.. జ‌న‌సేనాని రాజ‌కీయాల్లో నేర్చుకోవాల్సింది చాలా ఉంద‌ని ఈయ‌న‌గారి అభిప్రాయం. ఓ విమ‌ర్శ చేసేట‌ప్పుడు త‌మ గురించి తాము ముందు ఆలోచించుకోవాల‌న్న ఇంగితం ఆయ‌న మ‌రిచారు.. రాష్ట్రాన్ని అప్ప‌టి మీ పార్టీ అడ్డ‌దిడ్డ‌డంగా చీల్చేస్తుంటే., చూస్తూ ఉండిపోయారు. మిమ్మ‌ల్ని గెలిపించిన జ‌నంతోనే ఛీ కొట్టించుకున్నారు.. ఇప్పుడు రాజ‌కీయ నిరుద్యోగాన్ని వ‌దిలించుకునేందుకు అన్నంపెట్టిన పార్టీని వీడి, టీడీపీలోకి జంప్ చేశారు.. మీ రాజ‌కీయాలు జ‌న‌సేనానికి నేర్పే ప్ర‌య‌త్నం చేయోద్ద‌న్న‌ది రాష్ట్ర ప్ర‌జ‌ల విజ్ఞ‌ప్తి.. ఆయ‌న‌కంటూ ఓ సొంత అజెండా ఉంది.. మీరు చెప్పిన‌ట్టు స‌ల‌స‌ల మ‌రిగే ర‌క్తం ఉంది.. ల‌క్ష్యం కోసం పోరాడ‌గ‌లిగే శ‌క్తి ఉంది.. ఆయ‌న అడుగులో అడుగు వేసేందుకు కోట్లాది మంది సైన్యం అండ‌దండ‌లు ఉన్నాయి.. ఇంత‌కు మించి ఆయ‌న మీ నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు.. ద‌య చేసి ఆయ‌న్ని మీతో చేర్చుకోవ‌ద్దు.. వీల‌యితే జ‌నానికి ప‌నికొచ్చే ప‌నులు చేయండి.. ప్ర‌త్యేక హోదా సాధించే వ‌ర‌కు మిమ్మ‌ల్ని, మీ ప్ర‌భుత్వాల్ని ఎవ‌ర్నీ జ‌న‌సేనాని కునుకుతియ్య నివ్వ‌రు.. వీల‌యితే ఆయ‌న ప్ర‌శ్న‌ల‌కి స‌రైన జ‌వాబులు వెతుక్కోండి.. అంతేకానీ చీప్ పాలిట్రిక్స్ ఆయ‌న‌కి ఆపాదించొద్దు.. అలాంటివి చేస్తే., జ‌నం చూస్తూ ఊరుకోరు..

Share This:

1,532 views

About Syamkumar Lebaka

Check Also

ఓటుకు నోటు ఇచ్చిన నేత‌ల‌కు జ‌నం నామం.. పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో ప్ర‌కంప‌న‌లు..

అధికారం చేతిలో ఉంటే ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చాల్సిన అవ‌స‌ర‌మూ లేదు.. సొంత పార్టీ నాయ‌కుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 2 =