Home / పవన్ టుడే / ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్‌ల చిత్రానికి ”కొల‌వెరి” అనిరుధ్‌ బ్యాండ్ బాజా..!

ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్‌ల చిత్రానికి ”కొల‌వెరి” అనిరుధ్‌ బ్యాండ్ బాజా..!

anirudh   pktrivikram
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మాట‌ల‌మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌ల క్రేజీ కాంబినేష‌న్‌లో త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్న చిత్రానికి మ‌రింత క్రేజీ తెచ్చే హాట్ న్యూస్ ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది.. కొల‌వెరి..కొల‌వెరి.. డీ అంటూ తొలి పాట‌తోనే సౌత్‌లో మ్యూజిక్ సంచ‌ల‌నంగా మారిన యువ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చ‌నున్నాడు.. చేసింది త‌క్కువ సినిమాలే అయినా అనిరుధ్ త‌న మ్యూజిక్‌తో సౌతిండియా కుదిపేస్తున్నాడు.. అయితే తెలుగులో ఈ యువ సంచ‌ల‌నం బాణీలు అందిస్తున్న తొలి చిత్రం ఇదే కావ‌డం విశేషం.. గ‌తంలో టాలీవుడ్ నుంచి పెద్ద పెద్ద సినిమాల ఆఫ‌ర్లు అనిరుధ్‌ని వెతుక్కుంటూ వ‌చ్చినా లైట్ తీసుకున్నాడు.. ఇప్పుడు ప‌వ‌న్ మూవీ అన‌గానే., అదీ త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో కావ‌డంతో ఈ యువ మ్యూజిక్ మాంత్రికుడు ఎగిరిగంతేసి మ‌రీ ఒప్పుకున్నాడంట‌.. ఆ విష‌యాన్ని స్వ‌యంగా అనిరుధ్దే వెల్ల‌డించాడు.. ఈ చిత్రానికి అనిరుధ్ పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు రాగా., తాజాగా ఈ కొల‌వెరి డీ క‌న్‌ఫ‌మ్ చేశాడు..

Share This:

About Syamkumar Lebaka

Check Also

ప్ర‌జల‌ప‌క్షాన జ‌న‌సేనుడి బౌన్స‌ర్‌.. అడ‌క‌త్తెర‌లో ఆ ఇద్ద‌రు..!

విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయం అంటే న‌రంలేని నాలుక చెప్పే డైలాగ్ కాదు.. విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయం అంటే ప్ర‌జ‌ల చేత‌.. …

One comment

  1. Super ..page keep it up

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine + 12 =

%d bloggers like this: