Home / పవన్ టుడే / ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్‌ల ప్రొడ‌క్ష‌న్‌లో నితిన్‌…

ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్‌ల ప్రొడ‌క్ష‌న్‌లో నితిన్‌…

pawean-kalyanకంటెంట్ ఉన్న వాడి కటౌట్ కూడా కొత్త రికార్డులు సృష్టిస్తుంది అన‌డానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌స్తుతం తెలుగు చిత్ర‌సీమ‌లో ఆయ‌న ప్ర‌తి అడుగు ఓ చ‌రిత్రే.. అందుకే 24 ఫ్రేమ్స్‌లో ప్ర‌తి టెక్నీషియ‌న్ ఇవాళ ఆయ‌న‌తో క‌లిసి ఓ సినిమాక‌యినా ప‌నిచేయాల‌ని ఆరాట‌ప‌డుతుంటారు.. ఎందుకంటే ప‌వ‌న్‌తో క‌లిసి ప‌నిచేసిన త‌ర్వాత వ‌చ్చే హైపే వేరు.. అందుకే ఆయ‌న‌తో సినిమాలు తీసేందుకు డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు క్యూ క‌డితే., ఏదో ఒక ర‌కంగా ఆయ‌న పేరుని వాడుకుని త‌మ సినిమాల‌కి ప్ర‌మోష‌న్ ఇచ్చుకోవాల‌ని కో-ఆర్టిస్టులు పోటీ ప‌డుతుంటారు.. తాజాగా విక్ట‌రీ వెంక‌టేష్ మూవీ గురు ఆ కోవ‌కే వ‌స్తుంది.. గురు సెట్‌లో ప‌వ‌న్ క‌టౌట్ క‌న‌బ‌డ‌టం సంచ‌ల‌నం సృష్టించించింది.. ఆ సినిమాకి భారీ హైప్ తెచ్చిపెట్టింది కూడా..

ఇక కో-ఆర్టిస్టుల్లో ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ కూడా భారీగానే ఉన్నారు.. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా వారు త‌మ చిత్రాల్లో ప‌వ‌న్ నామ‌స్మ‌ర‌ణ‌తో త‌రిస్తూ ఉంటారు.. వారంటే ప‌వ‌ర్‌స్టార్‌కి కూడా ప్ర‌త్యేక‌మైన అభిమానం ఉంటుంది.. ఇటీవ‌ల స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ అందుకు ఓ ఉదాహ‌ర‌ణ‌.. ఇక యువ‌హీరోల్లో ప‌వ‌న్ హార్ట్ కోర్ ఫ్యాన్‌గా చెప్పుకునే నితిన్‌కి అయితే అంత‌కు మించిన బంప‌ర్ ఆఫ‌రే ద‌క్కింది.. ఏకంగా నితిన్ అప్‌క‌మింగ్ మూవీని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నిర్మించ‌నున్నారు.. ద‌ర్శ‌కుడు, ప‌వ‌న్ స‌న్నిహితుడిగా పేరున్న త్రివిక్ర‌మ్‌, నితిన్ తండ్రి సుధాక‌ర్‌రెడ్డి, ప‌వ‌న్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు..

ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్‌, శ్రేష్ట మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రౌడీ ఫెల్లో ఫేమ్ కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని, అందుకు సంబంధించిన ఫొటోల‌ని నితిన్ అభిమానుల‌తో పంచుకున్నాడు..

Share This:

800 views

About Syamkumar Lebaka

Check Also

వ‌రుస‌గా రెండో రోజూ సామాన్యుడి గ‌డ‌ప త‌ట్టిన జ‌న‌సేనుడు.. దూసుకుపోతున్న త‌రంగం..

జ‌న‌సేన త‌రంగం.. ప్ర‌తి ఇంటికి జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలు చేర్చే క్ర‌మంలో రూపొందించిన కార్య‌క్ర‌మం.. రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 1 =