Home / పవన్ టుడే / ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్ ప‌వ‌ర్ కాంబినేష‌న్‌కి క్లాప్‌.. డిసెంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌..

ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్ ప‌వ‌ర్ కాంబినేష‌న్‌కి క్లాప్‌.. డిసెంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌..

sai_0432
ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌ల క్రేజీ కాంబినేష‌న్‌లో నిర్మాణం జ‌రుపుకోనున్న చిత్రానికి సంబంధించి షూటింగ్‌కి క్లాప్ ప‌డింది.. శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల 49 నిమిషాల‌కు రామానాయుడు స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మం జ‌రిగింది.. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ అధినేత ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. వైభ‌వంగా జ‌రిగిన ఈ చిత్రం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో పాటు ద‌ర్శ‌క‌,నిర్మాత‌లు, కాట‌మ‌రాయుడు ప్రొడ్యూస‌ర్ శ‌ర‌త్ మ‌రార్‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, పి.డి.వి ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు..
sai_0397sai_0421

ప్రారంభోత్స‌వం అనంత‌రం మీడియాతో మాట్లాడిన నిర్మాత‌., ప‌వ‌ర్‌స్టార్‌-త్రివిక్ర‌మ్‌ల క్రేజీ కాంబినేష‌న్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం త‌మ సంస్థ‌కు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైంద‌ని తెలిపారు. సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న ఇద్ద‌రు క‌థానాయిక‌లు న‌టించ‌నుండ‌గా., ఎంపిక అనంత‌రం స్టార్ కాస్టింగ్ ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలిపారు.. డిసెంబ‌ర్ నుంచి చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది..

 

sai_0400

 

సినిమాకి సంబంధించి సాంకేతిక వ‌ర్గం కూడా అంతా టాప్ రేటెడ్ పెర్ఫార్మ‌ర్లే కావ‌డం విశేషం.. ఈ హాట్ మూవీకి సౌతిండియ‌న్ మ్యూజిక్ సంచ‌ల‌నం కొల‌వెరి అనిరుద్ సంగీతం అందించ‌నున్నారు.. తెలుగులో ర‌విచంద‌ర్‌కు ఇదే తొలి చిత్రం.. ఇండియా లో టాప్ మోస్ట్ కెమెరామెన్ వి. మణికందన్ (మణిరత్నం ‘రావణ్’, శంకర్ ‘అపరిచితుడు’, బాలీవుడ్ చిత్రాలు ‘ఏ జవానీ హై దీవాని’, మైహూనా) కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. కళా దర్శకత్వం: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: చంటి (కోటగిరి వెంకటేశ్వరరావు), ఎగ్జి క్యూటివ్ నిర్మాత: పి.డి.వి. ప్రసాద్.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌-త్రివిక్ర‌మ్‌ల‌తో పాటు కొల‌వెరి ర‌విచంద‌ర్ మ్యూజిక్‌, మ‌ణికంద‌న్ ఛాయాగ్ర‌హ‌ణం ఈ చిత్రంపై అంచ‌నాల‌ను తారా స్థాయికి చేర్చాయి.. సెట్స్ మీద‌కి రాక‌ముందే సూప‌ర్ డూప‌ర్ టాక్ ప‌వ‌న్ ప‌వ‌ర్‌కి నిద‌ర్శ‌నం..

 

Share This:

About Syamkumar Lebaka

Check Also

ప్ర‌జల‌ప‌క్షాన జ‌న‌సేనుడి బౌన్స‌ర్‌.. అడ‌క‌త్తెర‌లో ఆ ఇద్ద‌రు..!

విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయం అంటే న‌రంలేని నాలుక చెప్పే డైలాగ్ కాదు.. విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయం అంటే ప్ర‌జ‌ల చేత‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen − eleven =

%d bloggers like this: