Home / జన సేన / ప‌వ‌న్ ఓ అసాధార‌ణ పొలిటీషియ‌న్‌.. అట్లాంటా వేదిక‌పై ఉద్దానం డాక్ట‌ర్లు..!!!

ప‌వ‌న్ ఓ అసాధార‌ణ పొలిటీషియ‌న్‌.. అట్లాంటా వేదిక‌పై ఉద్దానం డాక్ట‌ర్లు..!!!

ఏడు మండ‌లాలు.. 118 గ్రామాలు.. ప‌చ్చ‌టి ప్రాంతంలో కిడ్నీ వ్యాధి చిచ్చు.. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి పోరాటం.. ల‌క్ష‌లాది మంది వ్యాధి గ్ర‌స్తులు.. వేలాది మంది మృతులు.. మూలాలు చిక్క‌ని మ‌హ‌మ్మారి.. గ్రామాల‌కి గ్రామాలు మింగేస్తుంటే.. మీనమేషాలు లెక్కించిప పాల‌నా వ్య‌వ‌స్థ‌లు.. కొంద మంది డాక్ట‌ర్లు చొర‌వ తీసుకుని త‌మవంతు కృషి చేస్తున్నా., ప‌ట్టీప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించిన ప్ర‌భుత్వాలు.. అలాంటి స‌మ‌స్యంలో మా రాష్ట్రంలో స‌మ‌స్య వుంది.. వేలాది మంది చ‌నిపోతున్నారు.. ఆ మ‌హ‌మ్మారి పేరు కిడ్నీ క్రానిక్ డిసీజ్ అని ప్ర‌పంచానికి చాటిన వ్య‌క్తి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. ఉద్దానం వ్యాధి విష‌యం తెల‌సుకున్న వారం రోజుల్లో వారిని ప‌రామ‌ర్శించ‌డానికి వ‌చ్చిన జ‌న‌సేనాని., ఇంటికో స‌మ‌స్య‌ని అంట‌గ‌ట్టిన కిడ్నీ వ్యాధిపై పోరుబావుటా ఎగుర‌వేశారు.. అప్ప‌టికే ప‌రిశోధ‌న చేస్తున్న డాక్ట‌ర్ల‌తో క‌లిసి యుద్ధం మొద‌లు పెట్టారు.. ఆ యుద్ధం రెండు ర‌కాలు.. ఒక‌టి ముందు వ్యాధి సోకిన వారిని కాపాడ‌డం., రెండు వ్యాధి రాకుండా అరిక‌ట్ట‌డం.. ఇందులో మొద‌టి అడుగు విజ‌య‌వంతంగా వేసిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌ద్ద ఏం చూశారు.. ఆయ‌న‌తో క‌ల‌సి ప‌నిచేసిన మిష‌న్ ఉద్దానం డాక్ట‌ర్లు అట్లాంటా వేదిక‌గా జ‌రిగిన జ‌న‌సేనాని జ‌న్మ‌దినోత్స‌వ వేడుక వేదిక‌పై పంచుకున్నారు.. వారి మాట‌ల్లో..

డాక్ట‌ర్ కుమార్ కొత్త‌ప‌ల్లి.. తాను కిడ్నీ స్పెష‌లిస్ట్ కాకున్నా., రీసెర్చ్‌లో త‌న‌వంతు స‌హ‌కారం అందిస్తున్న డాక్ట‌ర్ కుమార్ కొత్త‌ప‌ల్లి కూడా గ‌త వేస‌విలో ఉద్దానంలో విజిట్ చేశారు.. అక్క‌డ ప్ర‌జ‌ల క‌ష్టాలు స్వ‌యంగా వీక్షించారు.. అట్లాంటా వేడుక‌ల్లో బ‌ర్త్ డే బాయ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తో అనుబంధాన్ని పంచుకున్నారు..ఉద్దానంలో కిడ్నీ స‌మ‌స్య‌ని మొద‌ట 1990లోనే గుర్తించ‌డం జ‌రిగింది.. 2001లో డాక్ట‌ర్ దుర్గారావు వెలుగొడ దీనిపై స‌ర్వే చేసి., ప‌రిశోధ‌న మొద‌లు పెట్టారు.. అప్ప‌టి నుంచి ఆయ‌న‌తో క‌ల‌సి ప‌నిచేస్తున్నాం.. 2014లో మంత్రి కామినేనికి, స్థానిక ఎంపి రామ్మోహ‌న్ నాయుడికి రిపోర్ట్ కూడా ఇచ్చాం.. ఎంపి పార్ల‌మెంటులో కూడా ఆ రిపోర్టుని చ‌దివారు.. అయితే పాల‌నా వ్య‌వ‌స్థ‌ల నుంచి ఎలాంటి స‌హ‌కారం అంద‌లేదు.. అయితే 2017లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇచ్చాపురం వెళ్లాక స‌మ‌స్య ప్ర‌పంచ మొత్తం తెలిసిపోయింది.. మేం ప‌రిశోధ‌న చేశామ‌ని తెలిసి వారంలో రిపోర్ట్ కావాల‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అడిగారు.. ఆయ‌న అంద‌రిలా ఓ సాధార‌ణ పొలిటీషియ‌న్ కాదు.. స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో నిజాయితీతో కూడిన నిబ‌ద్ధ‌త ఆయ‌న సొంతం.. ప్ర‌తి విష‌యంలో ముక్కుసూటిగా ఉంటారు.. అంత‌టి నిబ‌ద్ద‌త క‌లిగిన వ్య‌క్తితో క‌ల‌సి పోరాటం చేయ‌డం చాలా సంతోషంగా వుంది.. జ‌న‌సేనాని డిమాండ్‌తోనే ఉద్దానంపై పాల‌క‌ప‌క్షాలు ఫోక‌స్ మార్చాన‌డంలో ఎలాంటి సందేహం లేదు.. జ‌న‌సేనాని కోరిక మేర‌కు ఆరు అంశాల‌తో కూడిన నివేదిక ఆయ‌న ముందు ఉంచితే., ఇప్ప‌టికే ఐదింటికి ప‌రిష్కారం ల‌భించింది.. ఇక రీసెర్చ్ ఒక‌టే మిగిలింది..

డాక్ట‌ర్ ర‌వి ఆకుల‌.. మిష‌న్ ఉద్దానం టీంలో ప‌నిచేస్తున్న ఈయ‌న‌., త‌మ విలువైన స‌మ‌యాన్ని వ‌దులుకుని., స్వదేశంలోని వ్యాధిగ్ర‌స్తుల కోసం వెచ్చిస్తూ రీసెర్చ్ చేస్తున్నారు.. ఉద్దానంకి ఊపిరి పోసిన వ్య‌వ‌హారంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పాత్ర‌పై ఆయ‌న ఏమ‌న్నారంటే..!!!!. ఉద్దానంలో చాలా దారుణ‌మైన ప‌రిస్థితులు వున్నాయి.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోరాటం త‌ర్వాత డ‌యాల‌సిస్ సెంట‌ర్లు వ‌చ్చినా., క‌నీసం సెంట‌ర్ వ‌ర‌కు వెళ్లే స్థోమ‌త‌లేని ప‌రిస్థితి.. ఒక్కో ఇంట్లో 300 రూపాయ‌ల‌తో నెల రోజుల కాలం వెళ్ల‌దీస్తున్న మ‌నుషులు వున్నారు… అలాంటి ప్రాంతంపై జ‌న‌సేనాని గ‌ళం విప్పాకే ల‌క్షా 10 వేల మందిని స్క్రీనింగ్ చేశారు.. వీర‌లో 1200 మంది రోగం ముదిరి ప్రాణాపాయ స్థితిలో వున్న వారిని గుర్తించారు.. ఇది నిజంగా ప‌వ‌న్ చ‌ల‌వే.. లేకుంటే ఈ పాటికే వారి జీవితాలు ముగిసేవి అని ఆయ‌న తెలిపారు.. ఇచ్చాపురం వెళ్లిన వెంటనే డాక్ట‌ర్ల‌తో మీటింగ్ పెట్టారు.. ముందు రోగుల‌కి వైద్యం.. ఆ త‌ర్వాతే రీసెర్చ్ అన్న నిర్ణ‌యం ఆయ‌న‌దేన‌న్నారు..

డాక్ట‌ర్ సాయి కొల్ల‌.. అమెరికాలో పేరున్న‌, అనుభ‌వ‌జ్ఞులైన డాక్ట‌ర్ల‌లో ఒక‌రు.. ఓ స‌మ‌స్య‌ను గుర్తించాక మాట‌లు చెప్ప‌డం కాదు.. చేత‌లు చేసి చూపించాలి అంటూ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేసి చూపించారంటూ మిష‌న్ ఉద్దానంలో ఆయ‌న అనుభ‌వాల్సి పంచుక‌న్నారు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లో మేం గ్ర‌హించిన విజ‌న్ ఒక్క‌టే., ఎవ‌రు బాధ‌ల్లో వున్నా., వారి ద‌గ్గ‌ర‌కి వెళ్లి సాయం చేయ‌డ‌మే ఆ విజ‌న్‌.. స్పాట్‌లో ఖ‌చ్చిత‌మైన నిర్ణ‌యం తీసుకోవ‌డంలో ఆయ‌న‌కి ఆయ‌నే సాటి అంటూ డాక్ట‌ర్ సాయి కొల్ల కొనియాడారు..
మిష‌న్ ఉద్దానం జ‌న‌సేన టీం స‌భ్యులు డాక్ట‌ర్ హ‌రిప్ర‌సాద్ రెండు ముక్క‌ల్లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏంటో తేల్చి చెప్పేశారు.. జ‌న‌సేనాని ఇచ్చాపురం విజిట్ త‌ర్వాత‌, కొన్ని రోజుల‌కి ఆ ప్రాంతంలో ప‌రిస్థితుల అధ్య‌య‌నానికి వెళ్లిన‌ప్పుడు.. ఓ ముస‌లాయ‌న్ని ఎలా వుంది తాత ఆరోగ్యం అని అడిగితే.. ఆయ‌నెవ‌రో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అంట‌., ఆయ‌న మా కోసం వ‌చ్చాక‌.. ఇప్పుడు మా ప‌రిస్థితి చాలా మారిపోయింది.. మంచినీళ్లు వ‌స్తున్నాయి.. మందులు వ‌స్తున్నాయి అని చెప్పిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు..

జి.కొండూరులో ఇదే త‌ర‌హా స‌మ‌స్య ఉంది-ముత్తంశెట్టి..
మిష‌న్ ఉద్దానం వైద్యుల‌తో పాటు అట్లాంటాలో వేదిక పంచుకున్న జ‌న‌సేన పార్టీ సెంట్ర‌ల్ క‌మిటీ స‌భ్య‌డు ముత్తంశెట్టి కృష్ణారావు.. కృష్ణాజిల్లా జి.కొండూరు ప్రాంతంలో ఇదే త‌ర‌హా కిడ్నీ వ్యాధి ఉంద‌నీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ప్రాంతంలో 150 మంది కిడ్నీ రోగాల‌తో మృతి చెందార‌ని తెలిపారు.. ఆ ప్రాంత‌పు ఎస్టీ యూత్ జ‌న‌సేన దృష్టికి స‌మ‌స్య‌ను తీసుకురాగా, క‌లెక్ట‌ర్ స‌హా అంద‌రి దృష్టికీ విష‌యాన్ని తీసుకువెళ్ళిన‌ట్టు తెలిపారు.. స‌మ‌స్య ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నోటీస్‌కి వెళ్లాకే ప్ర‌భుత్వంలో స్పంద‌న వ‌చ్చింద‌ని వివ‌రించారు.. ఉద్దానానికి కూడా ప్ర‌భుత్వంపై త‌న స్థాయితో ఒత్తిడి తెచ్చి ప‌నిచేయిస్తున్నార‌న్నారు.. ఒక్క కిడ్నీ స‌మ‌స్య మాత్ర‌మే కాక‌., వేలాది మంది రైతుల స‌మ‌స్య‌.. నిర్వాసితుల స‌మ‌స్య త‌దిత‌ర అంశాల‌పై కూడా ఆయ‌న పోరాటాలు చేస్తున్నార‌న్నారు.. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా ఎన్ ఆర్ ఐలు స్వ‌దేశానికి వ‌చ్చి జ‌న‌సేన ఆవ‌శ్య‌క‌త గురించి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న తేవాల‌ని పిలుపునిచ్చారు.. జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌స్తే ., ఎలాంటి పోరాటాల అవ‌స‌రం లేకుండా ప్ర‌జ‌ల‌కి న్యాయం జ‌రుగుతుంద‌న్నారు..

ఉద్దానం బాధితుల కోసం ఉచిత ఆంబులెన్స్ కానుక‌..!                                                 Advertisiment.
మిష‌న్ ఉద్దానం టీంకి మ‌ద్ద‌తుగా అక్క‌డ చిన్నారులు అదే పేరుతో విరాళాలు సేక‌రించి., ఉద్దానం బాధితుల‌కి ఉచితంగా మందుల పంపిణీ చేస్తున్నారు.. ఓ చిన్నారి త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌కి కేటాయించిన మొత్తాన్ని కూడా ఉద్దానం కోసం విరాళంగా ఇచ్చిందంటే., విదేశాల్లో వున్న చిన్నారులు కూడా ఎంత సేవాగుణంతో వున్నార‌న్న‌ది అర్ధం అవుతుంది.. అయితే డ‌యాల‌సిస్ సెంట‌ర్లు, మందులు, నీరు అందుబాటులో వున్నా., చివ‌రి స్టేజ్‌లో వున్న రోగుల్లో చాలా మంది డ‌యాల‌సిస్ సెంట‌ర్‌కి వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ప‌డుతున్నారు.. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన ఉపాస మెడిక‌ల్ టీం త‌రుపున, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బ‌ర్త్ డే గిఫ్ట్‌గా ఓ ఉచిత ఆంబులెన్స్ స‌ర్వీస్‌ని ఉద్దానం కోసం అందించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు..

ఉద్దానం వైద్యుల‌కి ఎన్ఆర్ఐల స‌న్మానం..!!
మాతృభూమిలో ఓ ప్రాంతం ప్ర‌జ‌లు అంతుతెలియ‌ని రోగంతో మృతి చెందుతున్నార‌ని తెలుసుకుని., త‌మ విలువైన స‌మ‌యాన్ని, డ‌బ్బునీ వెచ్చించి ఉద్దానం బాధితుల కోసం కృషి చేస్తున్న డాక్ట‌ర్ల టీం స‌భ్యుల్ని అట్లాంటా వేదిక‌పై ఘ‌నంగా సత్క‌రించారు.. ఓట్లు వేయించుకున్న పాల‌కులే ప్ర‌జ‌ల్ని వదిలేసిన‌ప్పుడు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చెప్పార‌ని సేవ‌కు దిగిన వీరంతా ఈ స‌న్మానానికి నూటికి నూరుశాతం అర్హులే..

Advertisement.

Share This:

3,114 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eighteen + twelve =