Home / పాలి 'ట్రిక్స్' / ప‌వ‌న్ చుట్టూ తిరుగుతున్న ఏపీ ”ప‌వర్” పాయింట్‌..!

ప‌వ‌న్ చుట్టూ తిరుగుతున్న ఏపీ ”ప‌వర్” పాయింట్‌..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌కంగా మారారు.. జ‌న‌సేనతో రాజ‌కీయారంగేట్రం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌., ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగ‌న‌ప్ప‌టికీ., ఓట్ల పాలిటిక్స్ మొత్తం ఆయ‌న చుట్టూనే తిరుగుతూ వ‌స్తున్నాయి.. ప‌వ‌న్ ఎవ‌రి ప‌క్షాన నిలిస్తే., విజ‌యం వారి ప‌క్ష‌మే. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ద‌గ్గ‌ర నుంచి ఆయ‌న విక్ట‌రీ సింబ‌ల్‌గా మారార‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం.. అంతేకాదు ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలోనూ, జ‌న‌సేనాని… అధికార‌, విప‌క్ష నేత‌ల‌తో పోలిస్తే ఓ అడుగు ముందే ఉన్నారు.. ప‌వ‌ర్‌స్టార్ నుంచి స్పంద‌న వ‌చ్చిందంటే క‌ర‌డుగ‌ట్టిన స‌మ‌స్య‌ల‌కి కూడా ప‌రిష్కారం దొరికిన‌ట్టే.. ప్ర‌జ‌లు యుద్ధాలు చేసినా, విప‌క్షాలు ధ‌ర్నాలు, బంద్‌లు చేసినా దిగిరాని ప్ర‌భుత్వం., ప‌వ‌న్ క‌ల్పించుకోగానే వెన‌క‌డుగు వేసేస్తున్నాయి. జ‌న‌సేనాని వెనుక ఉన్న జ‌న‌బ‌ల‌మే అందుకు కార‌ణం. ఈ జ‌న బ‌లాన్ని చూసే ప్ర‌త్య‌ర్ధులు కంగారు ప‌డుతున్నారు.. ఆయ‌న బ‌య‌టికి రాక‌పోవ‌డాన్ని బూత‌ద్దంలో పెట్టి చూపి., అవాకులు, చ‌వాకులు పేలుతున్నారు.. త‌మ అనుంగ పాత్రికేయుల‌తో వ్య‌తిరేక క‌థ‌నాలు రాయించ‌డం, ప‌నిగ‌ట్టుకుని బుర‌దజ‌ల్లించ‌డం వంటివి చేస్తున్నారు.. ఇది ఒక‌వ‌ర్గం ప‌ని అయితే., పొలిటిక‌ల్ బ్యాచ్‌లో మ‌రో బ్యాచ్ వ్య‌వ‌హారం మ‌రో రకంగా ఉంది.. జ‌నంలో క్రేజీ త‌గ్గిన‌ప్పుడ‌ల్లా ఈ బ్యాచ్‌ ప‌వ‌ర్‌స్టార్‌పై విమ‌ర్శలు కురిపిస్తారు.. జ‌నంలో బాగా ప‌లుకుబ‌డి ఉన్న వ్య‌క్తిని విమ‌ర్శిస్తేనే., త‌మ ప‌లుకుబ‌డి తిరిగి వ‌స్తుంద‌న్న‌ది వీరి ఆశ‌.. ఆ మ‌ధ్య‌న వైసీపీ ఎమ్మెల్యే రోజా, ఆ త‌ర్వాత మ‌రికొంద‌రు టీడీపీ నేత‌లు, ఇప్పుడు వైసీపీలోకి వెళ్లి అడ్ర‌స్ కోల్పోయిన దాడి వీర‌భ‌ద్ర‌రావు లాంటి వారు ఈ కోవ‌కి చెందుతారు.. ఎవ‌రేం చేసినా, ఎలా చేసినా, ప‌వ‌న్‌పై అవాకులు పేలినా అది ఆయ‌న పాపులారిటీని మ‌రింత పెంచుతుండ‌డంతో., ప్ర‌స్తుతం ఈ బ్యాచ్ ప‌రిస్థితి గొంతులో ప‌చ్చివెల‌క్కాయ ప‌డిన చందంగా త‌యారైంది.. ఏర‌కంగా చూసినా అధికార‌, విప‌క్షాల‌కు ధీటుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో ప‌వ‌ర్ పాయింట్‌గా మారార‌న్న టాక్ విన‌బ‌డుతోంది.. అధికారపార్టీ ప్ర‌తిప‌క్షం సృష్టించే స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కాల‌న్నా., ప్ర‌తిప‌క్షం త‌న వెనుక‌బాటు త‌నం నుంచి గ‌ట్టెక్కాల‌న్నా., ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కాల‌న్నా.. ఇప్ప‌డు అంతా ఒక‌టే జ‌పం, అదే జ‌న‌సేనాని ప‌వ‌న్ నామ‌స్మ‌ర‌ణ‌.. ఇదే రాష్ట్ర రాజ‌కీయాల్లో ప‌వ‌న్‌కి ఉన్న ప‌వ‌ర్ ఏంటో చెప్ప‌క‌నే చెబుతోంది..

Share This:

1,562 views

About Syamkumar Lebaka

Check Also

ఓటుకు నోటు ఇచ్చిన నేత‌ల‌కు జ‌నం నామం.. పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో ప్ర‌కంప‌న‌లు..

అధికారం చేతిలో ఉంటే ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చాల్సిన అవ‌స‌ర‌మూ లేదు.. సొంత పార్టీ నాయ‌కుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × 4 =