జనసేనాని, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కి జనంలో ఉన్న పవర్ చూసి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న పొలిటికల్ శక్తులు ఉలిక్కిపడుతున్నాయి.. ప్రభల శక్తిగా మారిన ఆయన్ని అడ్డుకునేందుకు ఎన్ని రకాల పన్నాగాలు పన్నాలో., అన్ని రకాల నక్క జిత్తులు ప్రదర్శిస్తున్నాయి.. ట్విట్టర్ వేదికగా ఆయన ఐదు ప్రశ్నలు సంధిస్తే., అందులో ఏ ఒక్క దానికీ బదులు చెప్పే సత్తాలేని కమలనాధులు., జనసేనాని ఇరుకున పెట్టేందుకు ఇతర మార్గాలు అన్వేషించే పనిలో పడ్డాయి.. ఆయన ట్వీట్స్‌కి జనం నుంచి వస్తున్న అనుకూలతను-ప్రతికూలతగా సృష్టించేందుకు సోషల్ మీడియాలో తనకున్న బలాన్ని బలగాన్ని ప్రయోగించింది.. కాషాయదళం చేసిన ఈ ప్రయత్నాన్ని జనసైన్యం చాలా వరకు తిప్పికొట్టినప్పటికీ., ప్రత్యర్ధులు కూడా చాలా వరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి.. పవన్ అభిమానులు, జన సైనికుల ముసుగు దరించిన బీజేపీ అనుకూలవర్గం., జనసేనాని దేశభక్తి లేనివాడిగా చిత్రించే ప్రయత్నాలు చేశారు..
జనసేనాని గోవధ నిషేధం, రోహిత్ వేముల ఆత్మహత్య అంశాలపై ప్రశ్నించినప్పుడు కమలనాధులు కలవరపాటుకి గురయ్యారు.. కొత్త తప్పులు., పాత తప్పుల్ని కప్పిపుచ్చుతున్న సమయంలో., మానినగాయాన్ని మళ్లీ లేపుతున్నారేంటి.. మనమూ అదే సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడి చేద్దాం.. అన్న నిర్ణయానికి వచ్చేశారు.. దేశభక్తి అనే అంశంపై ఆయన స్పందించగానే., పవన్‌ని దేశభక్తి లేనివాడిగా చిత్రించే ప్రయత్నం చేసేశారు.. అంతేకాదు సుప్రీం కోర్టు తీర్పుని ధిక్కరించారంటూ కేసులు పెట్టి భయపెట్టాలని చూశారు.. కోర్టు తీర్పుని ధిక్కరించడం అంటే., న్యాయస్థానం చెప్పినదాన్ని చెయ్యొద్దు అని చెప్పడం.. ప్రశ్నించడం ధిక్కారం కాదు.. న్యాయమూర్తికి అభిప్రాయం చెప్పే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది.. ఇక్కడ జనసేనాని చెప్పిన విషయం టక్కున గుర్తుకు వచ్చేస్తుంది.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వ్యతిరేకిస్తే., దేశాన్ని వ్యతిరేకించినట్టు చిత్రించడం వారికి అలవాటైపోయింది.. పవన్‌కళ్యాణ్ వారు చేసిన తప్పులు ఎత్తిచూపుతున్నారు కాబట్టి., ఆయన కాషాయరాజ్యాంగానికి వ్యతిరేకి.. అంటే వారి దృష్టిలో దేశభక్తుడు కాదు.. అదే విషయాన్ని తమ బలగంతో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.. నిజమైన పవన్ అభిమానులకి కూడా పవన్ చేస్తుంది తప్పా.. ఒప్పా అన్న అనుమానం కలిగేలా చేశారు.. సామాజిక మాధ్యమాల్లో వారికున్న బలం అలాంటిది మరి..
అయితే నోట్ల రద్దు., ప్రత్యేక హోదా అంశాల్లో పవన్ స్పందన చూశాక గాని.. తప్పుల మీద తప్పులు చేస్తున్న కేంద్రంపై జనం తరుపున జనసేనాని యుద్ధం చేస్తున్నారు అన్న విషయం అందరికీ అవగతం కాలేదు.. పాలిటిక్స్‌లో కుట్రలు, కుయుక్తులు కామన్.. మనం నమ్మిన సిద్దాంతం పవనిజం అయితే నిజాయితీగా దాన్ని ఫాలో అవడమే మన పని.. ఇలాంటి వ్యతిరేక ప్రచారాల వలలో పడితే అనుకున్న లక్ష్యానికి ఆడుగు దూరంలో నిలిచిపోవాల్సి వస్తుంది.. ఇలాంటి కుట్రల్లో పవన్ భక్తులు పావులుగా మారొద్దు.. ఆయన చెప్పిందే మనకు వేదం.. చేసిందే శాసనం..
పవన్ కళ్యాణ్ గారిని గుడ్డిగా నమ్మే భక్తులు గా ఉంటే ఆయన హర్షించరు. మనం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు అర్ధం చేసుకుని, ఆయన సిద్ధాంతాలను అవగాహన చేసుకుని దేశం కోసం తనతో నడిచే జనసేన సైనికులు గా ఉండాలి.
జైహింద్
ok..
your posts are very good and it is very helpful to Janasena Party. you are a true fan of Pawan kalyan sir. keep going strong all the best syamkumar sir