Home / పాలి 'ట్రిక్స్' / ప‌వ‌న్ చెబితే.. చేసేస్తాం.. ఆయ‌న‌తో మాత్రం పెట్టుకోం- నారా లోకేష్‌

ప‌వ‌న్ చెబితే.. చేసేస్తాం.. ఆయ‌న‌తో మాత్రం పెట్టుకోం- నారా లోకేష్‌

lokesh

3
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్ర‌భుత్వం గ‌ద్దెనెక్కిందంటే అది జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుణ్య‌మే అన్న‌ది నిర్వివాదాంశం.. స్వ‌యంగా ఆ పార్టీ నేత‌లు, మంత్రులు సైతం ఎన్నో సంద‌ర్బాల్లో బ‌హిరంగంగానే ఒప్పుకున్నారు కూడా.. అందుకే ఏపీ స‌ర్కారు ప‌వ‌న్ వ్య‌వ‌హారంలో ఆ విధేయ‌త‌ని క‌న‌బ‌రుస్తూ ఉంటుంది..ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కు సంబంధించి, ఏ విష‌యం ప‌వ‌ర్‌స్టార్‌ చెంత‌కు వ‌చ్చినా., స‌ర్కారు హుటాహుటిన దాని ప‌రిష్కార మార్గం వెతుకులాడే ప‌నిలో ప‌డుతోంది.. అప్ప‌ట్లో రాజ‌ధాని రైతుల భూముల వ్య‌వ‌హారంలో గాని, తాజాగా భీమ‌వ‌రం ఆక్వా ఫుడ్ పార్క్ విష‌యంలో గాని అదే జ‌రిగింది. బాధితులు జ‌న‌సేనానిని క‌ల‌వ‌డం, ఆయ‌న స్పందించ‌డం, ఆ వెంట‌నే ప్ర‌భుత్వం హుటాహుటిన ఇదే అంశంపై చ‌ర్చించి సానుకూలంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం ఒక దాని వెంట ఒక‌టి జ‌రిగిపోయాయి. ఉద్య‌మాల‌కి, విప‌క్షాల విమ‌ర్శ‌ల దాడుల‌కీ స్పందించ‌ని స‌ర్కారు., ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్ప‌గానే ఎందుకు అంత వేగంగా రియాక్ట్ అవుతోంది అన్న అనుమానం అంద‌రిలో రాక‌మాన‌దు.. దీనికి ఒక కార‌ణం జ‌న‌సేనాని ప్ర‌చారం వ‌ల్లే త‌మ పార్టీ గెలిచింద‌న్న విధేయ‌త అయితే., రెండోది ఆయ‌న‌తో విరోధం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అన్న భ‌యం. ఏ వ్య‌వహారంలో అయినా ప‌వ‌న్ స‌ల‌హాలు, సూచ‌న‌లు ప్ర‌భుత్వ పెద్ద‌లు పాటించ‌డానికి కార‌ణం కూడా అదే.. అంతేకాదు ఎప్పుడైనా ప్ర‌భుత్వానికి-ప‌వ‌న్‌కి మ‌ధ్య విబేధాలు వ‌చ్చాయి అన్న వార్త‌లు బ‌య‌టికి వ‌స్తే., ప్రెస్ మీట్లు పెట్టిమ‌రీ ఆయ‌న‌తో పెట్టుకోమ‌ని అధికార పార్టీ పెద్ద‌లు సెల‌విస్తున్నారు.. అందుకు ఉదాహ‌ర‌ణే తాజాగా ముఖ్య‌మంత్రి త‌న‌యుడు, టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారాలోకేష్ ఇచ్చిన వివ‌ర‌ణ‌.. త‌మ కుటుంబ ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించేందుకు ప్రెస్‌మీట్ పెట్టి., అక్క‌డ అంతా ప‌వ‌న్ జ‌పం చేశారు.. అక్వాఫుడ్ పార్క్ వ్య‌వ‌హారంలో ఆయ‌న స‌ల‌హాలు, సూచ‌న‌లు పాటిస్తామ‌ని, జ‌న‌సేనానితో త‌మ‌కు ఎలాంటి విబేధాలు లేవ‌ని ప‌దే ప‌దే చెప్పుకొచ్చారు.. త‌ద్వారా ప‌వ‌ర్‌స్టార్‌తో పెట్టుకోమ‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు లోకేష్‌బాబు..

Share This:

1,324 views

About Syamkumar Lebaka

Check Also

ఓటుకు నోటు ఇచ్చిన నేత‌ల‌కు జ‌నం నామం.. పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో ప్ర‌కంప‌న‌లు..

అధికారం చేతిలో ఉంటే ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చాల్సిన అవ‌స‌ర‌మూ లేదు.. సొంత పార్టీ నాయ‌కుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 − eight =