Home / పాలి 'ట్రిక్స్' / ప‌వ‌న్ తిట్టారా.. ఐతే ఓకే.. జ‌న‌సేనాని వ్యాఖ్య‌ల‌పై టీడీపీ స్పంద‌న‌..

ప‌వ‌న్ తిట్టారా.. ఐతే ఓకే.. జ‌న‌సేనాని వ్యాఖ్య‌ల‌పై టీడీపీ స్పంద‌న‌..

_34a0284ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా అనంత వేదిక‌గా గ‌ర్జించిన జ‌న‌సేనాని., ఈ సారి చంద్ర‌బాబు, ఆయ‌న స‌ర్కారుని వెన‌కేసుకొస్తున్నార‌న్న విమ‌ర్శ‌ల‌పై దృష్టి సారించారు.. ఈ సారి టీడీపీ, చంద్ర‌బాబుల‌పై నేరుగా వ్యాఖ్య‌లు చేశారు.. మీ ప్ర‌భుత్వంపై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.. ప్ర‌తి చోట క‌రెప్ష‌న్ పెరిగిపోయిన‌ట్టు తెలుస్తోంది.. అన్ని విష‌యాల్లో ఓ కులానికే పెద్ద పీట వేస్తున్నార‌ని తెలుస్తోంది.. స‌రిచేసుకోండి.. లేకుంటే గ‌త ఎన్నిక‌ల్లో మీ గెలుపు కోసం ప్ర‌చారం చేసిన నేనే., గ‌తి త‌ప్పిన మీ విధానాల‌పై పోరాడుతా.. మీపై పోటీ చేస్తా.. అంటూ హెచ్చ‌రించారు.. ఇక్క‌డ ప‌వ‌ర్‌స్టార్ చెప్పాల‌నుకున్న విష‌యం నేరుగా చెప్పేశారు.. నేను బ‌రిలోకి దిగుతున్నా., మీ విధానాల‌పైనే నా పోరాటం.. కాచుకోండి అని స‌వాలు చేసేశారు..

అయితే ప‌వ‌న్ తిట్టిపోసినా.. విమ‌ర్శించినా.. స‌వాళ్లు విసిరినా.. ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు టీడీపీ స‌ర్కారు సిద్ధంగా లేదు.. ప‌వ‌న్ పేరు చెబితే టీడీపీ నేత‌లు, సిఎంతో స‌హా అంతా ఉలిక్కి ప‌డుతున్నారు.. ఆయ‌న అలా అన్నారా.. ఐతే ఓకే అంటున్నారు.. జ‌న‌సేనాని స‌ల‌హాల్ని స్వీక‌రిస్తామ‌ని చెబుతున్నారు.. తిట్టినా, కొట్టినా, ఇంకేం చేసినా., ఆయ‌న‌తో క‌లిసే న‌డ‌వాల‌నుకుంటున్నారు.. గొడ‌వ‌కు దిగాల‌ని మాత్రం భావించ‌డం లేదు..

ఇక్క‌డ ఇంకో కొస‌మెరుపు ఏంటంటే.. మీ విధానాల‌పైనే నాపోరు అని ప‌వ‌ర్‌స్టార్ స్ప‌ష్టంగా చెప్పినా.., ఆయ‌న మాపై పోటీ చేస్తాన‌ని చెప్ప‌లేదుగా అంటూ వ్య‌వ‌హారాన్ని ప‌క్క‌దోవ ప‌ట్టిస్తున్నారు.. ఇంకా మాట్లాడితే.. ప్ర‌త్య‌ర్ధుల నోటి నుంచి కామెంట్ రాక‌ముందే., క‌త్తులు దూసే బెజ‌వాడ ఎమ్మెల్యే బొండా ఉమా., ప‌వ‌ర్‌స్టార్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌తో క‌లిసే పోటీ చేస్తార‌ని చెప్ప‌డం విశేషం..

క‌లిశా.. ఒంట‌రి పోరా.. అన్న విష‌యం భ‌విష్య‌త్తు చెబుతుంది సార్‌.. ముందు ఆయ‌న ఎత్తిచూపిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టి సారించండి.. లేక‌పోతే మీ పీఠాలు క‌దులుతాయి.. పునాదుల‌తో స‌హా కూలిపోతాయి.. ప‌వ‌న్‌కి ఎదురు రావ‌ద్ద‌న్న మీ విధానం ఓకేగాని., ఉన్న స‌మ‌యంలో ఆయ‌న చెప్పింది చేసేయండి ముందు..

Share This:

705 views

About Syamkumar Lebaka

Check Also

నా త‌ల్లి న‌న్ను దేశ ప్ర‌జ‌ల‌కి ద‌త్త‌త ఇచ్చేసింది.. మీ కోస‌మే నా జీవితం- కార్య‌క‌ర్త‌ల‌తో జ‌న‌సేనాని..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కి దిశానిర్ధేశం చేసే స‌మ‌యంలో దాదాపు ప్ర‌తి విష‌యాన్ని పంచుకుంటారు.. ప్ర‌తి కార్య‌క‌ర్త‌నీ త‌న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × one =