Home / ఎడిటోరియల్స్ / ప‌వ‌న్ ద”ప‌వ‌ర్‌”.. ప‌వ‌న్ ద”లీడ‌ర్‌”..

ప‌వ‌న్ ద”ప‌వ‌ర్‌”.. ప‌వ‌న్ ద”లీడ‌ర్‌”..

power
ఆయ‌న పేరే ఓ ప‌వ‌ర్‌.. పేరుకి చిత్ర‌సీమ‌ నుంచే రాజ‌కీయారంగేట్రం చేసినా., ప్ర‌జ‌ల‌పై గ‌తంలో ఏ న‌టుడూ చూప‌నంత ప్ర‌భావం., ఆయ‌న చూపారు.. ఆయ‌న పేరు చెబితే ప్ర‌తి అభిమాని న‌రాల్లో క‌రెంట్ పాస్ అవుతుంది.. వెంట్రుక‌లు నిక్క‌బొడుచుకుంటాయి.. ఆయ‌న కోసం ఏమైనా చేసేందుకు రెడీ అయిపోతారు.. ఆయ‌నే జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప‌వ‌ర్‌స్టార్‌కి అంత‌టి ప‌వ‌ర్ ఓవ‌ర్‌నైట్‌లో రాలేదు.. సినిమాల‌తో అంత‌కంటే రాలేదు.. చేసే ప‌నిలో నీతి, మాట‌లో నిజాయితీ, సాటివారి ప‌ట్ల ప్రేమ‌, సామాన్యుల బాధ‌ల చూసి తట్టుకోలేని త‌నం, వారికి ఏదో చేయాల‌న్న త‌ప‌న‌.. ఇవ‌న్నీ సినిమాస్టార్‌ కాస్తా పొలిటిక‌ల్‌స్టార్‌గా మారేందుకు కార‌ణ‌మ‌య్యాయి.. తాను చెప్పాల‌నుకున్న విష‌యం ఏదైనా ముక్కుసూటిగా చెప్పేయ‌డం., చేయాల‌నుకున్న‌ది ధైర్యంగా చేసేయ‌డం., స‌మ‌స్య‌ల‌పై స్పందించే తీరు ప‌వ‌న్ పేరుని కాస్తా ప‌వ‌ర్‌గా మార్చేశాయి.. అదీ ఓ రాష్ట్ర రాజ‌కీయాల్ని శాసించేంత‌గా.. ప‌వ‌ర్‌స్టార్ ఏ ప‌ద‌వో ద‌క్క‌లేద‌న్న ఆక్రోశంతో రాజ‌కీయాల్లోకి రాలేదు.. ఆ ప‌ద‌వులు ద‌క్కుతాయ‌ని అంత‌కంటే రాలేదు.. ప‌ద‌వీకాంక్ష‌తో ఎవ‌ర్నీ బ‌లీ చేయ‌లేదు.. సినీ ఫీల్డు నుంచి వ‌చ్చాంక‌దా అని త‌న కోసం, త‌న ప్ర‌చారం కోసం న‌టీన‌టులెవ్వ‌రినీ తిప్పుకోనూ లేదు.. తిర‌గ‌మ‌నీ చెప్ప‌లేదు.. ఎవ‌రినీ డ‌బ్బులు అడ‌గ‌లేదు, జోలి ప‌ట్టిఅడుక్కోనూ లేదు.. క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అంతా తానై క‌థ‌న‌రంగంలోకి దూకాడు.. త‌న ల‌క్ష్యం దిశ‌గా ఎక్కుపెట్టిన విల్లులా దూసుకుపోతున్నాడు.. అందుకే జ‌నం న‌ర‌న‌రానా పాస్ అయ్యే ప‌వ‌ర్ త‌న సొంతం చేసుకున్నాడు..

ప్ర‌జాభిమానం ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ లీడ‌ర్ కాలేరు.. రోడ్డు ప‌క్క‌న ఉన్న చిన్న టీ స్టాల్ వ‌ద్ద టీ తాగ‌డం, రోడ్లు ఊడ్చే వారి ద‌గ్గ‌ర చీపుర్లు లాక్కుని ఫొటోల‌కి ఫోజులివ్వ‌టం లీడ‌ర్‌షిప్ కాదు.. ఆ టీ స్టాల్ ఓన‌ర్ రెండు పూట‌లా ప‌ట్టెడ‌న్నం తింటున్నాడా అన్న ఆలోచ‌న ఉండ‌డ‌మే నాయ‌కుడి ల‌క్ష‌ణం.. ఎదుటివాడి ఆక‌లి చూస్తే., త‌న ఆక‌లి గుర్తుకురాకూడ‌దు.. ఎదుటివాడి బాధ చూస్తే., త‌న క‌ళ్లు చెమ‌ర్చాలి.. స‌మస్య‌లు చూస్తే చెలించాలి.. ఒక్క‌రి స‌మ‌స్య తీర్చి., వంద మంది స‌మ‌స్య‌లు తీర్చిన చందంగా ప్ర‌చారం చేసుకోవ‌డం కాదు.. ఆ వంద మంది స‌మ‌స్య‌లు ఎలా తీర్చాల‌న్న ఆలోచ‌న ఉండాలి.. స‌రిగ్గా జ‌న‌సేనాని అంత‌రంగం అచ్చుగుద్దిన‌ట్టు ఇలాగే ఉంటుంది.. రోడ్డుపై భిక్ష‌గాణ్ణి చూస్తే., ఆ పూట ఆయ‌న భోజ‌నం చేయ‌లేడు.. ఎదుటివాడి స‌మ‌స్య‌ని త‌న స‌మ‌స్య‌గా భావిస్తాడు.. ప‌రిష్కారం కోసం ఎవ‌ర్ని ప్ర‌శ్నించేందుకైనా వెనుకాడ‌డు.. ఎవ‌రితో పోరాడేందుకైనా భ‌య‌ప‌డ‌ని తెగువ ఆయ‌న సొంతం.. ఒక్క‌రి స‌మ‌స్య కాదు ప్ర‌తి ఒక్క‌రి స‌మ‌స్య తీర్చాల‌న్న‌దే జ‌న‌సేనాని ల‌క్ష్యం.. అందుకే ప‌వ‌నే మా లీడ‌ర్ అంటున్నారు జ‌నం.. 2014కి ముందు అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు మోడీ ప్ర‌ధాని కావాల‌ని ముక్త‌కంఠంతో కోరుకున్నారు.. స‌ర్వేల‌న్నీ ఇదే విష‌యాన్ని ఘోషించాయి.. ఇప్ప‌డు ఏపీలో స‌ర్వేల‌న్నీ ప‌వ‌ర్‌స్టార్‌కి అనుకూల ప‌వ‌నాలున్న‌ట్టు చెబుతున్నాయి.. మూడు ముక్క‌లాట‌లో ప‌వ‌న్ దే పైచేయి అని చెబుతున్నాయి.. రాష్ట్రంలో జ‌న‌సేనాని ముఖ్య‌మంత్రి కావాల‌ని మెజార్టీ శాతం ప్ర‌జ‌లు కోరుకుంటున్నారంట‌.. ఆయ‌నే మా లీడ‌ర్ అంటున్నారంట‌.. జ‌నానికి ఏదో చేయాల‌న్న నిరంత‌ర త‌ప‌న క‌లిగిన వ్య‌క్తినే లీడ‌ర్ అంటారు మ‌రి..

Share This:

1,428 views

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనాని ”మౌనం” తుపాను ముందు ప్ర‌శాంత‌తే..

ఐదు సంవ‌త్స‌రాల క్రితం జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏం సాధించారు..? ఒక్క సీటు అయినా గెలుస్తారా..? అస‌లు ఎన్నిక‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve − eleven =