Home / ఎడిటోరియల్స్ / ప‌వ‌న్ పంజా ఇప్పుడే ఎందుకు విసిరారంటే..?

ప‌వ‌న్ పంజా ఇప్పుడే ఎందుకు విసిరారంటే..?

శ్రీకృష్ణుడు కూడా కంస సంహారానికి వంద త‌ప్పుల వ‌ర‌కు అవ‌కాశం ఇచ్చాడు.. పాపం పండింద‌నుకున్న త‌ర్వాతే రాక్ష‌స సంహారం గావించాడు.. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీల‌కు మ‌ద్ద‌తు ప‌లికిన జ‌న‌సేనాని కూడా అదే ధ‌ర్మాన్ని పాటించారు.. ఆ పార్టీల సిద్ధాంతాలు, వారు ఇచ్చే హామీలు ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేవిగా ఉన్నాయి., వారికే ఓట్లేయండి అని ప్ర‌చారం చేసిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., మూడు రాష్ట్రాల్లో(ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌) వాటి విజ‌యానికి బాట‌లు వేశారు.. ఒక పార్టీ రాష్ట్రంలో అధికార‌పీఠం ఎక్కితే., మ‌రో పార్టీ ఏకంగా కేంద్రం ప‌గ్గాలు చేప‌ట్టింది.. అయితే అప్ప‌టి నుంచి వారి పాల‌న‌ను నిశితంగా ప‌రిశీలిస్తూ వ‌స్తున్న జ‌న‌సేనాని., ఇప్పుడే ఎందుకు నోరు విప్పారు..? ఇది సంద‌ర్భ‌మా., అసంద‌ర్భ‌మా..? అనే ప్ర‌శ్న‌లు స‌ర్వ‌త్ర వ్య‌క్త‌మ‌వుతున్నాయి.. గోవ‌ధ‌కు సంబంధించిన వివాదం చెల‌రేగిన‌ప్పుడు మొద‌టి త‌ప్పుగా వ‌దిలేశారు… రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య అనంత‌రం కూడా రాను రాను ప‌ద్ద‌తి మార్చుకుంటారులే అనుకున్నారు.. ఆ త‌ర్వాత అస‌హ‌నం., ఆ త‌ర్వాత త‌న‌ను న‌మ్మి ఓట్లేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను ప్ర‌త్యేక హోదా విష‌యంలో మోస‌గించ‌డం., ఇప్పుడు నోట్ల ర‌ద్దు.. పాల‌కుల పాపాల చిట్టా ఒక్కొక్క‌టిగా పేరుకుపోతున్నాయి.. వారి చేష్ట‌ల‌కు ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు నినాదంతో పోరుబాట ప‌ట్టిన జ‌నసేనాని., ప్ర‌జ‌ల త‌రుపున మీరు చేస్తున్న త‌ప్పులు పేరుకుపోతున్నాయి.. ఇవిగో మీరు చేస్తున్న త‌ప్పులు అనే విష‌యాన్ని బ‌హిర్గతం చేయాలని భావించారు.. అందులో భాగంగానే గోవ‌ధ నిషేధం, రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య అంశాల్లో క‌మ‌ల‌నాధుల కావ‌రాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసే ప్ర‌య‌త్నం చేశారు..

గోవ‌ధ నిషేధం అనే అంశాన్ని బీజేపీ కేవ‌లం రెండు వ‌ర్గాల మ‌ధ్య కుంప‌టి రాజేసి., రాజ‌కీయ ల‌బ్ది పొందాల‌నే చూసింద‌న్న విష‌యాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేశారు.. క‌మ‌ల‌నాధుల చిత్త‌శుద్దిని ప్ర‌శ్నించారు.. జ‌న‌సేనాని చేసిన వ్యాఖ్య‌ల్ని వ్య‌క్తిగ‌తంగా చిత్రించేందుకు కొంద‌రు., అసంబ‌ద్దమైన‌విగా చిత్రించేందుకు మ‌రికొంద‌రు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు..

ఇక రోహిత్ వేముల వ్య‌వ‌హారంలో ప‌వ‌న్ వ్యాఖ్య‌ల్ని బీజేపీ నేత‌లు అస‌లు లెక్క‌లోకే తీసుకోరంట‌.. ఎందుకంటే ఆయ‌న చేసిన విమ‌ర్శ‌లో నిజం ఉంది కాబ‌ట్టి.. రోహిత్ వేములా ద‌ళితుడా..? కాదా అన్న విష‌యం ప‌క్క‌న‌పెడితే.. అత‌ని ఆత్మ‌హ‌త్య‌ను రాజ‌కీయ పార్టీలు పొలిటిక‌ల్ మైలేజ్‌కి వాడుకున్నాయ‌న్న‌ది నిజం.. ఈ వ్య‌వ‌హారం నుంచి త‌ప్పించుకోవ‌డానికి అత‌ను ద‌ళితుడు కాద‌ని నిరూపించేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేసింద‌న్న‌దీ నిజం.. ఇక్క‌డ అత‌ను ద‌ళితుడా.. కాదా అన్న‌ది విష‌యం కాదు.. చిన్న విష‌యాన్ని ఓ మేథావిని దేశం కోల్పోవాల్సి వ‌చ్చింది అన్న‌దే అస‌లు పాయింటు.. అదే స‌మ‌యంలో సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ వేదిక‌గా రాజ‌కీయ పార్టీలు క‌త్తులు దూసుకుని., విద్యాల‌యాన్ని కాస్తా., యుద్ధాల‌యంగా మార్చాయ‌న్న‌ది మ‌రో పాయింటు.. ఇలాంటి నిప్పులాంటి నిజాలు మీకు జీర్ణం కావు కాబ‌ట్టి., జ‌న‌సేనాని వ్యాఖ్య‌ల్ని మీరు ప‌ట్టించుకోర‌న్న‌మాట‌.. అన్న మాట కాదు.. అది ఉన్న‌మాటే.. ఓ త‌ప్పు చేయ‌డం.. జ‌నం దాన్ని మ‌ర్చిపోయేందుకు మ‌రో వివాదాన్ని తెర‌పైకి తేవ‌డం.. తెలంగాణా బీజేపీ నేత కిష‌న్‌రెడ్డిగారు సెల‌విచ్చిన మాట ఇదే.. రోహిత్ వేముల విష‌యం అస‌హ‌నం, నోట్ల ర‌ద్దు లాంటి అంశాల్లో కొట్టుకుపోతున్న సంద‌ర్బంలో జ‌న‌సేనాని దాన్ని మ‌ళ్లీ తెర‌పైకి తేవ‌డం మింగుడు ప‌డ‌ని విష‌య‌మే..

తాను మ‌ద్ద‌తిచ్చిన ఆయా పార్టీలు అధికారంలోకి వ‌చ్చి ఇప్ప‌టికే స‌గం రోజులు గ‌డ‌చిపోయాయి.. ఈ స‌గం రోజుల్లో జ‌నానికి ఒరిగింది ఏంటి అనే దాని కంటే., మీరు చేసిన ఈ త‌ప్పుల వ‌ల్ల జ‌నం ఈ విధ‌మైన ఇబ్బందులు ప‌డ్డారు.. వీటికి మీరేం బ‌దులిస్తారు.. ఇలాంటి త‌ప్పులు పున‌రావృతం అయితే., ఏ ప్ర‌జ‌ల‌కి అయితే మీకు ఓట్లేయ‌మ‌ని అడిగానో., ఆ ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడేందుకు నేను ఎప్పుడూ సిద్దంగా ఉంటా.. మీ పాపాల చిట్టా లెక్కిస్తూ ఉంటా.. అన్న హెచ్చ‌రిక చేయాల‌న్న‌దే జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉద్దేశం..

Share This:

900 views

About Syamkumar Lebaka

Check Also

ఎనిమిది రోజులు.. 13 జిల్లాలు.. ముగిసిన జ‌న‌సేన జిల్లా స్థాయి స‌మీక్షా స‌మావేశాలు..

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో త‌న సైన్యాన్ని కార్యోన్ముఖుల్ని చేసే ప్ర‌క్రియ‌లో భాగంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న తొలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen − 6 =