ఉద్దానం బాధితుల వెతలు విని మనసు కరిగిన జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్., తాను ఇచ్చిన హామీ మేరకు వెంటనే పని మొదలుపెట్టేశారు.. డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ దుర్గాప్రసాద్ తదితరులతో కూడిన కమిటీతో విశాఖలోనే ఓ సమావేశం నిర్వహించి., విధివిధానాలు ఖరారు చేసేశారు.. 15 రోజుల్లో ఉద్దానం బాధితుల వెతలు., అది తీర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేధిక రూపొందించాలని ఆదేశించారు.. మాట చెప్పాక మడమ తిప్పేది లేదు అని మరోసారి నిరూపించారు.. పార్టీ తరుపున వేసిన కమిటీ సిఫార్సులను నివేదిక వచ్చిన వెంటనే ప్రభుత్వం ముందు పెట్టి., సమస్య పరిష్కారానికి ఒత్తిడి తెస్తానని చెప్పిన ఆయన., ఆ మాటకు కట్టుబడి ఉన్నానని., కమిటీ పని మొదలు పెట్టడం ద్వారా రుజువు అయిపోయింది..
మరి ఉద్దానం కిడ్నీ బాధితుల సత్వర అవసరాలు తీర్చేందుకు పవన్ పెట్టిన డెడ్ లైన్ విషయంలో సర్కారు ఏం చేస్తోంది..? పవన్ డెడ్‌లైన్ ఇప్పటికే ముగిసింది.. సభా ముఖంగా అడిగిన విషయాలనే మరోసారి ఆయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకి రోగితో పాటు ఓ అటెండెంట్‌కి ఉచిత బస్ పాస్‌లు, ఉచిత మందుల పంపిణి., మూత్రపిండాల వ్యాధితో తల్లిదండ్రులు మృతి చెంది అనాధలైన పిల్లలకి ఆర్ఫన్ హోం, సూపర్ స్పెషాలిటీ స్థాయి వైద్యుల నియామకం, ప్రతి మండలంలో డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు., వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల మేరకు ఉచిత ఆర్ ఓ వాటర్ సరఫరా చేయడం వంటి డిమాండ్లు సర్కారు ఎదుట ఉంచారు.. వీటిపై యుద్ధప్రాతిపదికన స్పందించకుంటే యుధ్దం తప్పదని హెచ్చరించారు కూడా.. మరి చంద్రాబాబు ప్రభుత్వం నుంచి స్పందన ఏది..?
ఆరోగ్య మంత్రి కామినేని విడుదల చేసిన ఓ ప్రెస్ నోట్లో ఉచిత మందుల పంపిణి, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు, ఉపాధి హామి పథకం కింద ఆర్ధిక సాయం అంటూ ఏవేవో ప్రకటనలు చేశారు.. ఆచరణలో చిత్తశుద్ది ఉంటే ఉద్దానం బాధితుల కష్టాలు తీర్చే పై ఏర్పాట్లపై అధికారిక ప్రకటన ఎక్కడ..? వేలాది మంది ప్రాణాలు హరిస్తున్న ఈ సమస్యపై అసలు పాలకులకి చిత్తశుద్ది ఉందా..? నోబెల్ తెస్తే వంద కోట్లు ఇస్తానని ప్రకటిస్తున్న బాబు., అదే సైంటిస్టుల్ని జనం చనిపోతున్న ఇలాంటి సమస్యలపై దష్టి సారించమని ఎందుకు చెప్పరు..? ఈ ప్రభుత్వాలు ప్రజల కోసమా..? ప్రగల్భాల కోసమా..? పవన్ పర్యటనకి ముందు అమెరికా సైంటిస్టులో సమస్య కనిపెట్టలేక పోయారు.. ఈయనేం చెబుతారో అని వెటకారంగా మాట్లాడిన వైద్యమంత్రి కామినేని., జనసేనాని చెప్పింది విన్నారుగా… ఆయన సూచనలు ఆచరణ సాధ్యం కానివి ఏమీ కాదుగా..? ఆరు వేల కోట్ల మీ బడ్జెట్లో ఓ వంద కోట్లు కేటాయింస్తే., అమెరికా సైంటిస్టులు కనిపెట్టలేని సమస్యకు కొంత వరకు పరిష్కారం లభిస్తుందిగా..? జనసేనుడి సూచనలు పాటిస్తే., ఆ గొప్ప ఏదో ఆయనికి వచ్చేస్తుందని భయమా..? కారణం ఏదయినా., ఆయన చెప్పింది ఫాలో అవడమే మీకు మంచిది.. పవన్ నేరుగా బరిలోకి దిగితే., మీరు.. మీకు వంతపాడే పచ్చ మీడియా ఏకమైనా ఏం చేయలేరు.. బాబు గారు ఈ హీట్ మీకు తాకకముందే కళ్లు తెరవండి…
Good, jai janasena ,from manikyalarao naidu.tatipakala, janasena party active member visakhapathanam