Home / పెన్ పోటు / ప‌వ‌న్ ప‌వ‌ర్‌పై ఎందుకీ వ‌క్రీక‌ర‌ణ‌లు..? మీ బ్యాగ్రౌండ్ స్క్రిప్ట్ ఎవ‌రిది..?

ప‌వ‌న్ ప‌వ‌ర్‌పై ఎందుకీ వ‌క్రీక‌ర‌ణ‌లు..? మీ బ్యాగ్రౌండ్ స్క్రిప్ట్ ఎవ‌రిది..?

img-20170103-wa0000

ఓ స‌మ‌స్య త‌న వ‌ద్ద‌కి వ‌చ్చిన‌ప్పుడు జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వెంట‌నే ప్ర‌తిస్పందిస్తారు.. వారి స‌మ‌స్య ప‌రిష్కారంపై దృష్టి సారిస్తారు.. వీల‌యితే స‌మ‌స్య ఎక్క‌డుందో అక్కిడికి స్వ‌యంగా వెళ్లి., జ‌నం బాధ‌లు తెలుసుకుంటారు.. వారి త‌రుపున ప్ర‌భుత్వంతో పోరాడుతారు.. రాజ‌ధాని భూముల వ్య‌వ‌హారం ద‌గ్గ‌ర్నుంచి., నిన్న మొన్న‌టి ఆక్వా ఫుడ్ పార్క్‌, ఉద్దానం బాధితుల స‌మ‌స్య‌ల వ‌ర‌కు ఆయ‌న పంథాలో ఎలాంటి మార్పూ రాలేదు.. ప్ర‌శ్నించే విష‌యంలో ఎక్క‌డా వెన‌క‌డుగు వేయ‌రు.. ఎవ‌ర్నీ వ‌దిలిపెట్ట‌రు.. అయితే ప‌వ‌న్ చేసిన ప్ర‌తి పోరాటంలో విజ‌య‌మే..

img-20170103-wa0163

ఇక ప‌వ‌న్ నేరుగా ప‌బ్లిక్‌లోకి రావ‌డ‌మే అరుదు.. అభిమానుల్లో ఆయ‌న‌కున్న క్రేజీ దృష్ట్యా., వారికి ఎక్క‌డ ఎలాంటి ఇబ్బందులు వ‌స్తాయోన‌న్న భ‌య‌మే అందుకు కార‌ణం.. వారి కోరిక మేర‌కు ఇచ్చాపురంలో తొలి రోడ్ షో నిర్వ‌హించారు.. మూరుమూల ప్రాంతంలో నిర్వ‌హించిన ఈ రోడ్ షోకి వేలాది మంది త‌ర‌లివ‌చ్చి., జ‌న‌సేనుడి స‌త్తా చాటారు.. ఇక్క‌డ ప్ర‌తిదీ క్రిస్ట‌ల్ క్లారిటీయే.. స‌మ‌స్య ఎక్క‌డుంటే తాను అక్క‌డ ఉంటాన‌ని మొద‌ట్లోనే ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని., అదే పాటిస్తున్నారు.. ఇక ఆయ‌న కోసం వ‌చ్చిన జ‌నాన్ని కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క‌రూ., ఏదో ప్ర‌లోభానికి గురిచేసి తీసుకురాలేదు.. ఎవ‌రికి వారు ప‌వ‌ర్‌స్టార్‌ని చూడాలి., ఆయ‌న ఏం చెబుతారో వినాలి అనే ఉద్దేశంతో వ‌చ్చే వారే…

అయితే కొన్ని  మీడియా సంస్థ‌లు మాత్రం జ‌న‌సేనుడి విష‌యంలో కాస్త వ‌క్ర‌మార్గాన్ని అనుస‌రిస్తున్నాయి.. ఎవ‌రెస్టు శిఖిరం ఎత్తుకి చేరిన ఆయ‌న విలువ‌ని త‌గ్గించేందుకు సాధ్య‌మైన అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.. తెర‌వెనుక ఏం జ‌రుగుతోంది..? అనేది ప‌క్క‌నబెడితే., ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గొప్ప‌ని ఒప్పుకోవ‌డానికి చాలా సంస్థ‌లు ఇష్ట‌ప‌డ‌టం లేదు.. అది సొంత అజెండానో లేక‌., కాసుల‌కి ప‌డే కక్కుర్తో తెలియ‌దుగాని., జ‌న‌సేనాని సాధించిన విజ‌యాల‌ను కూడా వ‌క్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో విష‌పు భీజాన్ని నాటాల‌ని చూస్తోంది.. ప‌వ‌న్ ఉద్దానం బాధితుల కోసం పోరాటానికి ఇచ్చాపురం వెళ్లిన‌ప్పుడు., ఇచ్చిన క‌వ‌రేజ్ ఎంతో ప్ర‌జ‌లు చూస్తూనే ఉన్నారు.. ద‌శాబ్దాలుగా వేళ్లూనుకున్న ఓ స‌మ‌స్య‌పై ఆయ‌న పోరాటం చేయ‌ద‌లుచుకున్న‌ప్పుడు., ఆ స‌మ‌స్య‌ని ప్ర‌పంచం ముందు ఉంచాల‌నుకున్న‌ప్పుడు., ఈ మీడియాలో ఏ ఒక్క‌రూ ఆయ‌న‌కి తోడు రాలేదు.. ఆయ‌న రోడ్ షోకి ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం వ‌చ్చిన‌ప్పుడు సైతం ఎవ‌రూ స్పందించ‌లేదు.. రెండు నిమిషాలు లైవ్ కూడా ఇవ్వ‌లేదు..

tv5

ఇప్పుడు ప‌వ‌న్ పోరాటానికి ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన స్పంద‌న‌ని మాత్రం., ఎందుకు ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించింది..? దాని వెనుక ఉన్న ర‌హ‌స్య మేంటి అనే అన్వేష‌ణ‌లు మొద‌లు పెట్టి., ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు.. జ‌న‌సేనుడు రోడ్డెక్కుతాన‌ని హెచ్చ‌రిస్తే., ఆయ‌న‌తో అన‌వ‌స‌ర‌మైన త‌ల‌నొప్పి ఎందుకులే అని స‌ర్కారు దిగివ‌చ్చింది.. ఇక్క‌డ పవ‌న్ పుణ్య‌మా అని ప్ర‌జ‌ల ఇబ్బందులు తీరుతున్నాయి అన్న ప్ర‌చారం ఏ ఒక్క‌రూ చేయ‌డం లేదు.. ప్ర‌భుత్వ స్పంద‌న వెనుక ఏదో ఉంది అంటూ..? నానార్ధాలు తీసి., జ‌నాన్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు.. పెరిగిపోతున్న జ‌న‌సేనుడి విలువ‌ని మ‌స‌క‌బార్చేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు.. ఇక్క‌డ వారి వార్త‌ల్లో మ‌రో విష‌యం కూడా జ‌నానికి అర్ధం కాలేదు.. ప‌వ‌న్ ప్ర‌శ్నిస్తే., ప్ర‌భుత్వం ఆఘ‌మేఘాల మీద స్పందించింది.. ఒకే.. అది ప్ర‌జ‌ల్లో జ‌న‌సేనానికి క్రేజీ పెంచుతుంది గాని., ప్ర‌భుత్వానికి సింప‌తీ ఎలా అవుతుందో., అది రాసిన వారు.., తెర‌కెక్కించిన వారికే తెలియాలి..
మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ అని గొప్ప‌గా చెప్పుకోవ‌డం కాదు.. ప్ర‌జ‌ల కోస‌మే ఏర్ప‌డిన ప్ర‌జాస్వామ్యంలో మీ బాధ్య‌త ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌వ‌డ‌మే న‌న్న‌ది గుర్తెర‌గండి ముందు.. ప్ర‌లోభాల ప‌క్షాన నిల‌చి., పాత్రికేయ విలువ‌ల్ని ట్యాంక్ బండ్‌లో క‌ప్పిపెట్ట‌వ‌ద్దు.. మీ తెర‌మాటు వ్య‌వ‌హారాల కోసం ప్ర‌జల్లో గంద‌ర‌గోళం సృష్టించొద్దు..

 

Share This:

1,792 views

About Syamkumar Lebaka

Check Also

”అజ్ఞాత‌వాసి ర‌విప్ర‌కాష్‌”ది ఎంత క్రిమిన‌ల్ మైండో చూడండి..

వెనుక‌టికి ఒక సామెత ఉంది ”చెప్పేది శ్రీరంగ నీతులు.. దూరేది —— గుడిసెలు” అని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కొన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen − 7 =