Home / జన సేన / ప‌వ‌న్ ప‌శ్చిమ ప‌ర్య‌ట‌న ఖ‌రారు కాలేదు.. కార్య‌క‌ర్త‌లు ఊహాగానాలు నమ్మ‌వ‌ద్దు..

ప‌వ‌న్ ప‌శ్చిమ ప‌ర్య‌ట‌న ఖ‌రారు కాలేదు.. కార్య‌క‌ర్త‌లు ఊహాగానాలు నమ్మ‌వ‌ద్దు..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, ఆయ‌న పార్టీకి సంబంధించి మొద‌టి నుంచి ఊహా జ‌నిత వార్త‌లు రాస్తూ, జ‌న‌సేన శ్రేణుల్ని గంద‌ర‌గోళానికి గురిచేయ‌డం., త‌ద్వారా రేటింగ్స్ సాధించి జేబులు నింపుకోవ‌డం మీడియాలో ఓ వ‌ర్గానికి నిత్యం కృత్యంగా పెట్టుకుంది.. ఇప్పుడు ఈ జాఢ్యం సామాజికి మాధ్య‌మాల‌కి కూడా పాకింది.. బుధ‌-గురు వారాల్లో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోరాట యాత్ర త‌దుపరి షెడ్యూల్ గురించి ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది.. సోమ‌వారం నుంచి అంటే ఈ నెల 16 నుంచి జ‌న‌సేనాని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నుంచి త‌దుప‌రి పోరాట యాత్ర‌ను కొనాగిస్తార‌న్న‌దే ఆ వార్త సారాంశం.. దీంతో జిల్లాలో టూర్ ఏర్పాట్లు ఎలా చేయాలి, అనే అంశాల‌పై జ‌న‌సైనిక్స్ చ‌ర్చ‌లు మొద‌లు పెట్టేశారు. అయితే త‌దుప‌రి టూర్‌కి సంబంధించి అధికారికంగా ఎలాంటి షెడ్యూల్ ఖ‌రారు కాలేదు.. పార్టీ వ‌ర్గాలు కూడా స‌ద‌రు తేదీల‌ను ఇంకా ఖ‌రారు చేయాల్సి ఉంది..

జ‌న‌సేన పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా, పార్టీ అధినేత స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డ‌మో లేక ప్రెస్ నోట్ ద్వారానో, మీడియా విభాగం నుంచి మెస్సేజ్ రూపంలోనో తెలియ‌ప‌రుస్తూ వ‌స్తోంది.. అయినా ఇలాంటి అన‌ధికారిక వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేయ‌డం, వాటిని న‌మ్మి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ప్ర‌చారం క‌ల్పించ‌డం, గంద‌ర‌గోళానికి గురికావ‌డం జ‌రుగుతూనే ఉంది.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన అధినేత ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న ఖ‌రారు కాలేదు.. 16వ తేదీ నుంచి టూర్ అంటూ వ‌స్తున్న వార్త‌ల్ని ఖండిస్తూ, స్వ‌యంగా ఆ జిల్లా ఇన్‌ఛార్జ్ క‌ల‌వ‌కొల‌ను తుల‌సి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఊహాగానాలు నమ్మ‌వందని పార్టీ శ్రేణుల్ని కోరారు.. పోరాట యాత్ర తేదీలు ఖ‌రార‌య్యాక‌, జ‌న‌సేన పార్టీ అధికారికంగా ప్రెస్ నోట్ ద్వారా ప్ర‌క‌టిస్తుంద‌ని తుల‌సి వెల్ల‌డించారు..

జ‌న‌సేన పార్టీకి సంబంధించి ఎలాంటి విష‌యాన్న‌యినా, పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించ‌కుండా న‌మ్మి గంద‌రోగోళానికి గురిక‌వాద్ద‌ని జ‌న‌సైనిక్స్‌కి మ‌న‌వి..

Advertisement..

Share This:

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనకి కామ‌న్ సింబ‌ల్(లాంత‌ర్) అనే ప్ర‌చారం అబ‌ద్దం.. పార్టీ శ్రేణులు న‌మ్మ‌వ‌ద్దు..

జ‌న‌సేన పార్టీ శ్రేణుల‌ని గంద‌ర‌గోళానికి గురి చేసేందుకు ప్ర‌త్య‌ర్ధులు రోజుకో కొత్త ప్ర‌య‌త్నంతో ముందుకి వ‌స్తున్నారు.. జ‌న‌సేన పార్టీకి ప్ర‌ధాన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four + 18 =

%d bloggers like this: